twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా వైరస్ సోకిందంటే.. తాచు పాములా చూస్తారు: బిత్తిరి సత్తి

    |

    ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా వైరస్ కాస్త ఛాన్స్ దొరికినా వదలడం లేదు. అన్ని స్థాయిల వారిని వైరస్ ఈజీగా భయపెడుతోంది. ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు కరోనా వైరస్ భారిన పడుతున్నారు. ఇక టీవీ కమెడియన్ బిత్తిరి సత్తి కూడా కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయం నిజమా అబద్దామా అని జనాల్లో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వగా సత్తి ఫైనల్ గా ఫేస్ బుక్ లైవ్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పరిస్థితి గురించి అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సత్తి వివరణ ఇచ్చారు.

    Recommended Video

    Bithiri Sathi Emotional In Tupaki Ramudu Interview
     ఎలా వచ్చిందో తెలియదు..

    ఎలా వచ్చిందో తెలియదు..

    సత్తి మాట్లాడుతూ.. కరోనా వైరస్ నాకు ఎలా వచ్చిందో.. ఎప్పుడు వచ్చిందో నాకు తెలియడం లేదు. కానీ మొత్తానికి నేను కూడా వైరస్ భారిన పడ్డాను. నాది కొంత స్టాండర్డ్ బాడీ. కరోనా వైరస్ నాకు రాదని అనుకున్నాను. కానీ వచ్చింది. అయితే మనం ఏ పని చేయకుండా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటే కరోనా లక్షణాలు బయటపడవు.

    బయపడాల్సిన అవసరం లేదు.

    బయపడాల్సిన అవసరం లేదు.

    కానీ విశ్రాంతి లేకుండా పని చేస్తూ.. టైమ్ కి ఆహారం తీసుకోకుండా ఉంటే వైరస్ కూడా టైమ్ చూసి కొడుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం విశ్రాంతి తీసుకోవాలి. కొంత పోషక ఆహారం తీసుకోవాలి. కరోనా సోకిన కూడా బయపడాల్సిన అవసరం లేదు. నాకైతే హాస్పిటల్ కి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాలేదు.

     లక్షణాలు ఏమి కనిపించడం లేదు.

    లక్షణాలు ఏమి కనిపించడం లేదు.


    ప్రస్తుతం నాకు పెద్దగా లక్షణాలు ఏమి కనిపించడం లేదు. వీడియో కాల్ ద్వారానే వైద్యుల సలహాలు తీసుకుంటున్నాను. ఇక ఈ వైరస్ మనకు సోకింది అంటే ఇతరుల నుంచి సహాయం పొందడం కష్టంగానే ఉంటుంది. కొంతమంది కరోనా వైరస్ అనుమానాలు ఉన్నాయని అంటేనే పురుగును చూసినట్లు చూస్తారు. మనతో అప్పటివరకు బాగానే ఉన్న వారు కూడా మనం ఒక తాచు పాము అన్నట్లు చూస్తారు.

     ఎదుటివారిని రిస్క్ లో పెట్టకూడదు.

    ఎదుటివారిని రిస్క్ లో పెట్టకూడదు.

    అసలైతే వైరస్ భారిన పడినప్పుడు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మనమే క్వారంటైన్ లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మనకు వైరస్ లేదని ధీమాతో ఎదుటివారిని రిస్క్ లో పెట్టకూడదు. మనకు వస్తే.. వచ్చిందని చెప్పాలి. లేకుంటే మనంత ద్రోహి ఇంకొడు ఉండడు. ఎలాంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి అని బిత్తిరి సత్తి వివరణ ఇచ్చారు.

    English summary
    Popular Anchor Bithiri Sathi tested coronavirus positive. After medical reports show his status, Sathi went to self quarantine. Apart from sathi, Many of Sakshi television members tested coronavirus positive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X