‘నాలో ఏ లోపం ఉంది?’.. ఇండస్ట్రీపై సుమన్ శెట్టి ఆవేదన!

ఒకప్పుడు టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు సుమన్ శెట్టి (Suman Shetty). ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానంటూ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రోజులు గుర్తుచేసుకుంటూ, ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆయన వ్యక్తం చేసిన ఆవేదన అందరినీ కదిలిస్తోంది. అసలేం జరిగింది? ఆయన జీవితం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇంతకీ ఆయన ఏం అన్నారు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుమన్ శెట్టి పేరు వినగానే 'అధ్యక్షా' డైలాగ్ గుర్తుకు వస్తుంది. తన ప్రత్యేక శైలి, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఎన్నో సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించారు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించి మంచి ఫాలోయింగ్ సంపాదించారు. కానీ ఒక దశ తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గిపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

Telugu comedian Suman Shetty Gets Emotional Over Lack of Film Offers After Acting in 300 Movies

తాజాగా కిస్సిక్ టాక్స్ అనే టాక్ షోలో పాల్గొన్న సుమన్ శెట్టి తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా 'నెలలో 30 రోజులు ఉంటే ఆ 30 రోజులు షూటింగ్‌లోనే ఉండేవాడిని' అని చెప్పడం ఆయన అప్పటి బిజీ స్థాయిని తెలియజేస్తోంది. తన నటనకు గుర్తింపుగా నంది అవార్డు కూడా అందుకున్నానని గుర్తు చేసుకున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని స్వీకరించేవాడినని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, అవకాశాలు లేకనే తనకు గ్యాప్ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

'నాలో లోపం ఏంటి? ఎందుకు నాకు అవకాశాలు రావడం లేదు?' అనే ప్రశ్న తనను ఇప్పటికీ వెంటాడుతుందని ఎమోషనల్‌గా చెప్పారు. నటన విషయంలో ఎక్కడైనా తాను తగ్గిపోయానా? లేక తనకు ఇస్తున్న పాత్రలను సరైన విధంగా చేయలేకపోతున్నానా? అనే సందేహాలు కూడా తనను కలవరపెడుతున్నాయని వెల్లడించారు. ఇంకా, తన ఆరోగ్య సమస్యలు కూడా కెరీర్‌పై ప్రభావం చూపినట్టు తెలిపారు. ఒక దశలో చేతులు, కాళ్లకు ఫ్రాక్చర్లు కావడంతో కొంతకాలం షూటింగ్స్‌కు దూరమవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఆ గ్యాప్ తర్వాత తిరిగి ఇండస్ట్రీలో సెటిల్ కావడం అంత సులభం కాలేదని ఆయన మాటల్లో తెలుస్తోంది.

ఇక వ్యక్తిగత జీవితంపై మాట్లాడిన సుమన్ శెట్టి, తన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యతను కూడా వెల్లడించారు. ఒక ప్రశ్నకు స్పందిస్తూ.. "నాకు కోటి రూపాయలు వస్తే ముందుగా మా అక్కకు ఇస్తాను" అని చెప్పడం ఆయన భావోద్వేగాలను ప్రతిబింబించింది. ఇంటి ఆడపిల్ల సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుందని తన తండ్రి చెప్పిన మాటలను ఇప్పటికీ పాటిస్తున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆయనలోని కుటుంబ విలువలను చూపించాయి.

ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో పాల్గొనడం ద్వారా సుమన్ శెట్టి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. షోలో తన ఆట, మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయనకు మళ్లీ సినిమా అవకాశాలు వస్తాయని అభిమానులు ఆశించారు. అయితే ఆ అంచనాలు ఇప్పటివరకు నిజం కాలేదు. అయితే.. ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్‌లు, కొత్త టాలెంట్ ఎంట్రీలు, కంటెంట్ మార్పులు వల్ల పాత తరం కమెడియన్లకు అవకాశాలు తగ్గడానికి కారణమవుతున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ సుమన్ శెట్టి వంటి అనుభవజ్ఞులైన నటులకు సరైన పాత్రలు వస్తే వారు మళ్లీ మెరిపించే సామర్థ్యం ఉన్నదని సినీ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో చర్చకు దారి తీస్తున్నాయి. "ఇలాంటి టాలెంట్‌ను ఇండస్ట్రీ మళ్లీ ఉపయోగించుకోవాలి" అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. మరి ఈ ఎమోషనల్ అప్పీల్ తర్వాత అయినా దర్శక నిర్మాతలు సుమన్ శెట్టిని తిరిగి అవకాశాలతో బిజీ చేస్తారా? లేక ఆయన ఎదురు చూపులు ఇంకా కొనసాగుతాయా? అన్నది చూడాలి.

Read more about: tollywood bigg boss suman shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X