అందాల తెగింపుతో అందరినీ ఆగం చేస్తున్న తెలుగు యాంకరమ్మ.. తెరమరుగైన ఈమెను గుర్తించారా?
తెలుగు బుల్లితెరపై కనిపిస్తూ.. తన అందంతో అందరినీ అల్లాడించిన యాంకర్ వర్ణిణి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈమె.. మొదట నటిగా సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత యాంకర్ గా మారి తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం పూర్తిగా తెరపై కనిపించడమే మానేసింది. అలా వెండితెరపై కాదు. బుల్లితెరపై మాత్రమే కనిపించకుండా ఉంటున్న ఈమె తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. బ్లూ డ్రెస్ వేసుకుని చందమామలా కవ్విస్తోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కెరియర్ స్టార్టింగ్ లో నటిగా చేసిన వర్షిణి సౌందర రాజన్.. ఎన్నో బ్రాండ్లకు పని చేసింది. ఇలా దర్శక, నిర్మాతల దృష్టిని ఆకర్షించిన ఈమెకు 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా టాలీవుడ్ లో కాలు పెట్టిన ఈమె ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. పెద్దగా గుర్తింపు రాకపోవడంతో... సినిమాలకు గ్యాప్ ఇచ్చి పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ లో నటించింది. దాని ద్వారా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణి సౌందరాజన్ కు ఏవీ కలిసి రాలేవు. ఆ సయమంలోనే ఢీ షో ద్వారా తెలుగు బుల్లితెరపై అడుగు పెట్టింది. ఈ షో ద్వారానే మెంటర్ గా చేసి విపరీతమైన క్రేజ్ అందుకుంది. అలా వచ్చిన గుర్తింపుతోనే తెలుగు బుల్లితెరపై వచ్చే వివిధ ఛానెళ్లలో కూడా అనేక షోలు చేసింది. యాంకర్‌గా బుల్లితెరపై చాలా ఏళ్ల పాటు తనదైన మార్కును చూపించిన ఆమె.. 'కామెడీ స్టార్స్' షో తర్వాత హోస్టింగ్‌కు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం కేవలం సినిమాలపై మాత్రమే ఫోకస్ చేసిన ఈమె ఇటీవలే భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలో నటించి మెప్పించింది.
బుల్లితెరకు దూరమైనా.. వెండితెరపై మెరుస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. అలాగే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందమైన ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం వర్షిణి షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ అందాన్ని తట్టుకోలేకపోతున్నామని.. హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్ లోనూ వేడి పుట్టించేలా ఘాటు ఫోజిలు పెడుతున్నావంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఫలితంగా వర్షిణి ఫొటోకు భారీ రెస్పాన్స్ వచ్చి.. బాగా వైరల్‌గా మారిపోయింది. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











