‘లేడీ యాంకర్ నాపై చేతబడి చేయించింది.. అప్పటి నుంచే నాశనం’

తెలుగు టీవీ రంగంలో రవి యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సంథింగ్ స్పెషల్ అనే టీవీ షోతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత యాంకర్ గా చాలా ఆఫర్లు అందుకున్నారు. స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు. ఇదెలా ఉంటే.. యాంకర్ రవి ఎదుగుదలను చూసి కొంత మంది ఓర్వలేక పోయారంట. తనపై చేతబడి చేయించి మరీ తన కెరీర్ పడిపోయేలా ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

యాంకర్ రవి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మా బ్యాచ్ లోనే ఒక మహిళా యాంకర్ నాపై చేతబడి చేయించింది. ఇటీవల ఫేమస్ అయిన పూజారి దగ్గరకు వెళ్లి పూజలు చేసింది. నా డౌన్ ఫాల్ ను కోరుకున్నారు. ఎవరికైనా ఉంటుంది. ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేరు. ఆ విషయం నాకు తెలిసింది. కొన్ని నేను దగ్గర నుండి ప్రత్యేక్షంగా చూశాను కూడా. వాళ్లకి ఏం ఆనందం వస్తుందో నాకు మాత్రం అర్థం కాలేదు. కానీ నేను సాధారణంగా అలాంటివన్నీ నమ్మను. నాకు లోపల అలాంటి వాటితో ఏం జరగదనేది గట్టి నమ్మకం. ఇక సమాజం కూడా విషపూరితంగా తయారైంది.

Telugu Female Anchor Black Magic on Anchor Ravi

ఏఐ వచ్చిన తర్వాత మరి దారుణం తయారయ్యారు. కోహ్లీ రిటైర్‌మెంట్ తర్వాత లండన్ కు వెళ్లి సెటిల్ అయ్యారు. అసలు ఇక్కడ సోసైటీ భయంకరంగా ఉంది. అందుకే ఆయన పిల్లలతో కలిసి అండన్ కు వెళ్లిపోయారు. ఇక ఎడ్యుకేషన్ అనేదే సరిగా లేదు. ఉన్న ఎడ్యుకేషన్ ను సరిగా వాడటం లేదు. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతాడు. పేదవాడు ఇంకా పేదవాడుగా మారిపోతుడున్నాడు. ఇక పూర్ గా ఉన్నవాడు మొబైల్ ను విపరీతంగా వాడుతున్నారు. సరైన ఎంప్లాయిమెంట్ లేక వాళ్లకున్న ఒత్తిడినంత సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. వాళ్ల క్రియేటివిటీ మొత్తం ఇక్కడే వాడుతున్నారు. నాకు విదేశాల్లో బెటర్ ఫ్యూచర్ ఉంటే మాత్రం నేను కూడా వెళ్లిపోతాను.' అంటూ చెప్పుకొచ్చారు.

అయితే యాంకర్ రవి చాలా మంది లేడీ యాంకర్లతో కలిసి పని చేశారు. తొలుత మాటీవీలో సంథింగ్ స్పెషల్ అనే లైవ్ షోతో మంచి స్పందనను సొంతం చేసుకున్నాడు. యాంకర్ లాస్య మంజులతతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత పటాస్ షోలో శ్రీముఖితో హోస్ట్ గా వ్యవహరించారు. అలాగే మరికొంత మంది యాంకర్లతోనూ కలిసి ఎంతో ఫ్రెండ్లీ యాంకరింగ్ చేసి అలరించారు. అయితే రవిపై చేతబడి చేయించేంత కడుపుమంట ఏ యాంకర్ కు ఉందనేది టెలివిజన్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గ్గా మారింది.

సంథింగ్ స్పెషల్, పటాస్ తో పాటు వన్ షో, ఢీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, మొండి మొగుడు పెంకీ పెళ్లాం, కిర్రాక్, అలీ టాకీస్ వంటి టీవీ షోలతో ప్రేక్షకులను అలరించారు. హీరోగా ఇదీ మా ప్రేమ కథ అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. టెలివిజన్ రంగంలో అడుగు పెట్టే ముందు ఇండియన్ ఆర్మీకి ట్రెయినింగ్ తీసుకున్నారు. అలాగే యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించే ముందు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X