Bigg Boss 6: చివర్లో మారిన కంటెస్టెంట్ల జాబితా.. షోలోకి తెలుగు హీరో ఎంట్రీ

గతంలో ఎప్పుడూ చూడని కంటెంట్.. మజాను పంచే టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ప్రేమలు, రొమాన్స్ ఇలా ఎన్నో ఊహకందని ట్విస్టులతో సాగుతూ దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది తెలుగు బిగ్ బాస్. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ షోకు మన ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ప్రతి సీజన్ ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా రేటింగ్‌ను రాబడుతోంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఆరో దానిని మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులోకి తెలుగు హీరో ఎంట్రీ ఇస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

బిగ్ బాస్ ఆరో సీజన్‌ డేట్ ఫిక్స్

బిగ్ బాస్ ఆరో సీజన్‌ డేట్ ఫిక్స్

దేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగులో మాత్రమే బిగ్ బాస్ షోకు అత్యధిక స్పందన దక్కుతోంది. దీంతో నిర్వహకులు ప్రతి ఏటా ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆరో సీజన్‌ను మొదలు పెట్టబోతున్నారు. దీన్ని సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సీజన్‌ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నాడు.

ప్రోమోలతోనే మరింత ఆసక్తిగా

ప్రోమోలతోనే మరింత ఆసక్తిగా

బిగ్ బాస్ ఆరో సీజన్‌ గురించి దాదాపు మూడు నెలల క్రితం నుంచే ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతోన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే దీని నుంచి లోగో, సీజన్ ప్రోమోలు విడుదల చేశారు. వీటికి అన్ని వర్గాల వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే, రెండు రోజుల క్రితమే ఈ సీజన్ ప్రారంభ తేదీని ప్రకటిస్తూ మరో ప్రోమో వదిలారు. తద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు.

పనులు కంప్లీట్.. ఎపిసోడ్‌పైనే

పనులు కంప్లీట్.. ఎపిసోడ్‌పైనే

అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తి అయిపోయినట్లు ఇప్పటికే బుల్లితెర వర్గాలు వెల్లడించాయి. దీంతో సెప్టెంబర్ 4వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కానున్న ప్రీమియర్ ఎపిసోడ్‌పై నిర్వహకులు దృష్టి సారించారట. అలాగే, కంటెస్టెంట్లను కూడా క్వారంటైన్‌లోకి పంపే ఏర్పాట్లను చేస్తున్నారు.

కంటెస్టెంట్లు ఫైనల్.. పేర్లు లీక్

కంటెస్టెంట్లు ఫైనల్.. పేర్లు లీక్

అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో మొదలు పెట్టారు. ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. తర్వాత నేరుగా మాట్లాడి డీల్స్ చేసుకున్నారు. ఇలా ఈ సీజన్ కోసం 19 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారు. వీళ్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

చివరి నిమిషంలో మారిన లిస్ట్

చివరి నిమిషంలో మారిన లిస్ట్


బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. ఈ క్రమంలోనే ఈ సీజన్‌ కోసం ఎంపిక చేసిన కంటెస్టెంట్ల జాబితా కూడా వైరల్ అవుతోంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నిర్వహకులు ఫైనల్ చేసిన జాబితాను చివరి నిమిషంలో మార్చాల్సి వచ్చినట్లు ఓ న్యూస్ తెలిసింది.

బిగ్ బాస్‌ షోలోకి తెలుగు హీరో

బిగ్ బాస్‌ షోలోకి తెలుగు హీరో

గతంలో కంటే ఎక్కువ అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న ఆరో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వహకులు ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారట. ముఖ్యంగా ప్రజాదరణ ఉన్న వాళ్లను ఎక్కువగా తీసుకుంటున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే ఈ సీజన్ కోసం తెలుగు హీరో బాలాదిత్యను కంటెస్టెంట్‌గా తీసుకు వస్తున్నారని తాజాగా ఓ వార్త లీక్ అయింది.

లక్కీ ఛాన్స్ పట్టేసిన బాలాదిత్య

లక్కీ ఛాన్స్ పట్టేసిన బాలాదిత్య

చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో మెప్పించిన బాలాదిత్య.. ఆ తర్వాత హీరోగా మారాడు. అనంతరం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అయితే, తాజాగా బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి నిర్వహకులు ఎంపిక చేసిన వాళ్లలో ఒకరు తప్పుకోవడంతో బాలాదిత్యకు ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. దీనికి అతడు వెంటనే ఓకే చెప్పాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X