Bigg Boss 7 Telugu: షోలోకి హీరో కమ్ పొలిటికల్ లీడర్.. హౌస్‌లో కూడా ఆపరేషన్.. ఇదే అసలైన ట్విస్ట్

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా వచ్చి.. ఇండియాలోనూ సూపర్ సక్సెస్ అయింది బిగ్ బాస్. హిందీలో ఎప్పుడో ప్రారంభం అయిన ఈ కార్యక్రమం.. తెలుగులోకి మాత్రం ఏడేళ్ల క్రితమే వచ్చింది. అయినప్పటికీ ఏ భాషలోనూ సాధ్యం కాని విధంగా టాప్ రేటింగ్‌ను రాబట్టి ఇండియాలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. దీంతో బ్రేకులు లేకుండా సీజన్లు కంప్లీట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే మరో కంటెస్టెంట్ పేరు లీకైంది. ఆ సెలెబ్రిటీ ఎవరో మీరే చూసేయండి!

మరికొద్ది రోజుల్లోనే ఏడోది:తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని కంటెంట్‌తో ప్రసారం అయినా.. బిగ్ బాస్ మొదటి సీజన్‌తోనే రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పటికే చాలా వాటిని కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను సెప్టెంబర్ 3వ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ చేయబోతున్న ఈ సీజన్ నుంచి పలు ప్రోమోలూ వచ్చాయి.

 Telugu Hero Sivaji Likely Entry To Bigg Boss 7 Telugu

ఉల్టాపుల్టా.. అందుకేనట:బిగ్ బాస్ షో గతంలో మాదిరిగా రంజుగా సాగడం లేదన్న విషయం తెలిసిందే. బయట పీఆర్ టీమ్‌లను ఏర్పాటు చేసుకుని.. చాలా మంది కంటెస్టెంట్లు ఓట్లు వేయించుకుంటున్నారు. దీన్ని సమూలంగా మార్చేందుకు నిర్వహకులు ఇప్పుడు సరికొత్త కాన్సెప్టుతో రాబోతున్నారు. దీన్ని ఏడో సీజన్‌తో పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని నాగార్జున వెల్లడించాడు.

వర్క్ బ్యాలెన్స్.. వేగంగా:వాస్తవానికి బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుందంటే.. దానికి సంబంధించిన పనులన్నీ రెండు, మూడు నెలల ముందుగానే ప్రారంభం అవుతాయి. అందుకు అనుగుణంగానే ఏడో సీజన్ వర్క్ కూడా చాలా రోజుల క్రితమే మొదలైంది. ఇలా ఇప్పటికే పనులన్నీ చాలా వరకూ పూర్తి చేశారని తెలిసింది. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారని సమాచారం.

20 మంది.. వీళ్ల పేర్లే లీక్:మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 20 మంది కంటెస్టెంట్లు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే చాలా మంది పేర్లు లీక్ అయ్యాయి. అందులో మోహన భోగరాజు, అమర్‌దీప్, అంజలి, సందీప్ మాస్టర్, శోభా శెట్టి, నిఖిల్, రియాజ్, సింగర్ దామిని, బుల్లెట్ భాస్కర్, మహేశ్, అనిల్, షకీలాల పేర్లు బాగా వినిపిస్తున్నాయి.

అలాంటి వాళ్లే సీక్రెట్‌గా:బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి ఇప్పటికే లీక్ అయిన సెలెబ్రిటీలు కాకుండా మరికొందరు హై రేంజ్ (కాంట్రవర్శీలతో సంబంధం ఉన్న) కంటెస్టెంట్లను కూడా తీసుకు వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వీళ్ల పేర్లు మాత్రం బయటకు రాకుండా నిర్వహకులు చాలా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయినప్పటికీ కొందరు వివరాలు మాత్రం బయటకు వచ్చేస్తున్నాయి.

హీరో కమ్ పొలిటీషియన్:భారీ అంచనాలతో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి.. మరో టాప్ సెలెబ్రిటీ పేరు కూడా తాజాగా లీక్ అయింది. బుల్లితెర వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌లోకి టాలీవుడ్ ఫేమస్ హీరో, పొలిటికల్ లీడర్ శివాజి కూడా ఎంట్రీ ఇస్తున్నాడట. బిగ్ బాస్ షోను మరింతగా రక్తి కట్టించే బాధ్యతను అతడిపై ఉంచారని సమాచారం.

 Telugu Hero Sivaji Likely Entry To Bigg Boss 7 Telugu

అతడి రాకతో రంజుగా:చాలా కాలం పాటు సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేసిన శివాజి.. ఆ తర్వాత సోలో హీరోగా మారి ఎన్నో సినిమాలు చేశాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అలా 'ఆపరేషన్ గరుడ' అంటూ ఓ స్టోరీతో సెన్సేషన్‌గా మారాడు. అలాంటి శివాజి బిగ్ బాస్ షోలోకి వస్తే ఏడో సీజన్ మరింత రంజుగా మారే అవకాశం ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X