జబర్ధస్త్‌లోకి తెలుగు హీరోయిన్.. రావడం రావడమే రొమాంటిక్‌గా పవర్‌స్టార్ నామస్మరణ!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో పాపులర్ అయిన షోలలో జబర్ధస్త్ ఒకటి. ప్రముఖ చానెల్‌లో ఏడేళ్లుగా ప్రసారం అవుతున్న ఈ షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే బుల్లితెరతో పాటు వెండితెరపైకి ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ షో మరింత హైలైట్ అయింది. క్యాలెండర్లలో సంవత్సరాల నెంబర్లు మారుతున్నా.. జబర్ధస్త్ హైప్‌ మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ షోలోకి తెలుగు హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, పవన్ కల్యాణ్ పేరును పలికి ఫిదా చేసింది. ఇంతకీ ఎవరామె.?

వాళ్లంతా బాగా ఫేమస్.. రోజా, నాగబాబుకూ ప్లస్

వాళ్లంతా బాగా ఫేమస్.. రోజా, నాగబాబుకూ ప్లస్

జబర్ధస్త్ షో ద్వారా చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వీళ్లంతా ఇప్పుడు సెలెబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. వీరితో పాటు పలువురు రైటర్లు కూడా ఇండస్టరీలోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో ఈ కామెడీ షో ద్వారా మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజా కూడా బాగానే లాభ పడ్డారు.

నాగబాబు వెళ్లిపోయాడు.. ప్లేస్ భర్తీ చేయలేదు

నాగబాబు వెళ్లిపోయాడు.. ప్లేస్ భర్తీ చేయలేదు

ఏడేళ్ల పాటు జబర్థస్త్ షోకు జడ్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు నాగబాబు. అయితే, ఇటీవల ఆయన వ్యక్తిగత కారణాలతో ఈ షో నుంచి వెళ్లిపోయారు. ఆయనతో పాటే పలువురు టీమ్ లీడర్లు, ఆర్టిస్టులు కూడా జంప్ అయ్యారు. అప్పటి నుంచి జబర్ధస్త్ నిర్వహకులు కసిగా పని చేస్తున్నారు. కానీ, ఆయన స్థానాన్ని మాత్రం మరొకరితో భర్తీ చేయలేదు.

వాళ్లు మారుతున్న.. వీళ్లు ఎంట్రీ ఇస్తున్నారు

వాళ్లు మారుతున్న.. వీళ్లు ఎంట్రీ ఇస్తున్నారు

నాగబాబు జబర్ధస్త్ నుంచి వెళ్లిపోవడం.. మరో చానెల్‌లో కొత్త షోను ప్రారంభించడం వంటి కారణాలతో షో నిర్వహకులు సరికొత్త ప్లాన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రోజాతో పాటు జడ్జ్‌గా వ్యవహరించేందుకు పలువురు సీనియర్ సెలెబ్రిటీలను తీసుకొస్తున్నారు. అదే సమయంలో తమ తమ స్కిట్లలో చేసేందుకు కొందరు యాక్టర్లను తెచ్చుకుంటున్నారు టీమ్ లీడర్లు.

హైపర్ ఆది అదిరిపోయే ప్లాన్లు.. అందుకే వాళ్లంతా

హైపర్ ఆది అదిరిపోయే ప్లాన్లు.. అందుకే వాళ్లంతా

ఈ షోలో భారీ పాపులారిటీ సంపాదించుకున్న టీమ్ లీడర్లలో ఒకడైన హైపర్ ఆది రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన టీమ్‌లో చేసేందుకు ఎంతో మంది నటీనటులను, యాంకర్లను తీసుకు వస్తున్నాడు. తన పంచ్ డైలాగులను వాళ్లతో చెప్పించి జడ్జ్‌లతో పాటు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాడు. దీంతో ఆది స్కిట్లు బాగా పేలుతున్నాయి.

జబర్ధస్త్‌లోకి తెలుగు హీరోయిన్.. పవన్ పేరు ప్రస్తావన

ఇక, తాజాగా ఈ షోలోకి తెలుగు హీరోయిన్ మాధవి లత ఎంటర్ అయింది. హైపర్ ఆది టీమ్‌కు సాయం చేసేందుకు వచ్చిన ఆమె.. పవన్ కల్యాణ్ పాటకు రొమాంటిక్‌గా స్టెప్పులేసింది. అంతేకాదు, తనకు పవర్ స్టార్ అంటే ఇష్టమని మరోసారి చెప్పుకొచ్చింది. అలాగే, కొన్ని పంచ్ డైలాగులు సైతం పేల్చింది. దీంతో వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

పవన్ కల్యాణ్ అంటే ఇష్టం కాదు... భక్తి అని చెప్పింది

పవన్ కల్యాణ్ అంటే ఇష్టం కాదు... భక్తి అని చెప్పింది

మాధవి లత ‘నచ్చావులే' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటిచినప్పటికీ సరైన గుర్తింపును దక్కించుకోలేకపోయింది. కానీ, బయట మాత్రం బాగా పాపులర్ అయింది. పవన్ కల్యాణ్ అంటే భక్తి అని చేసిన కామెంట్లతో పాటు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం.. బోల్డ్ స్టేట్‌మెంట్లతో ఆమె క్రేజ్ సంపాదించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X