Bigg Boss 7 Telugu పొలిటికల్ ఫ్యామిలీ.. లండన్‌లో చదువు.. సీరియల్స్‌లో ఎంట్రీ.. Amardeep బ్యాక్ గ్రౌండ్ చూస్తే

తెలుగు బుల్లితెర అభిమానులకు అమర్‌దీప్ చౌదరి గురించి తెలియని వారుండరు. టెలివిజన్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ కుర్ర నటుడి పేరు ప్రస్తుతం మీడియాలో మార్మోమోగుతోంది. అయితే సీరియల్స్ ద్వారా హ్యాండ్సమ్ లుక్స్ తో... తన నటనతో ఆకట్టుకొన్న సీరియల్ హీరో ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లోకి అడుగుపెట్టారు. అయితే బుల్లితెరకు దూరంగా ఉండి.. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోను ఫాలో అయ్యేవారికి మాత్రం ఈ అమర్దీప్ ఎవరు.. ఏంటి అనే సందేహాలు వస్తున్నాయి. అయితే బుల్లితెర నుంచి బిగ్‌బాస్ కంటెస్టెంట్ గా మారిన అమర్దీప్ గురించిన వివరాల్లోకి వెళితే..

అమర్దీప్ చౌదరి.. తెలుగు సీరియల్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెలుగులో అనేక సీరియల్స్ లో నటించారు. అమర్ దీప్ 1990 నవంబర్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో జన్మించారు. అమర్‌దీప్ తండ్రి అమీర్ బాషా. ఈయన కూచిపూడి డ్యాన్సర్, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి. ఇక అమర్దీప్ తల్లి రూపా. ఈమె కూడా నృత్యకారిణి, అంతే కాదు.. బీజేపీ నాయకురాలు కూడా.

Telugu Serial Actor Amardeep Chowdary into Bigg Boss Telugu 7: Here are the personal and Professional Details

తన తల్లిదండ్రుల అడుగుజాడల్లో అమర్‌దీప్ కూడా డ్యాన్స్ నేర్చుకుని కొన్ని పోటీల్లో పాల్గొన్నారు. చదువు పూర్తయ్యాక కంప్యూటర్ సైన్స్ లో బి.టెక్ చేశారు. తరువాత, అతను మాస్టర్స్ చదివేందుకు లండన్ వెళ్లారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తరువాత... అతను 2016 లో 'పరిణయం' అనే షార్ట్ ఫిల్మ్‌తో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు.

ఆ తర్వాత కేరళలోని త్రివేండ్రం వెళ్లి సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేశారు అమర్దీప్. కొంతకాలం తర్వాత, అతను తిరిగి హైదరాబాద్‌కు వెళ్లి ఐడ్రీమ్ తెలుగులో చేరారు. పిజ్జా vs గోంగూర, మంగమ్మ గారి మనవడు, గర్ల్ ఫ్రెండ్ ఊరెళితే, సూపర్ మచ్చి, రాజు గారి కిడ్నాప్, నా పబ్‌ జీ వైఫ్, డేట్, లవ్ యు జిందగీ,గర్ల్‌ఫ్రెండ్, డబుల్ డేట్ వంటి అనేక షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో కనిపించారు.

2017 సంవత్సరంలో అమర్‌దీప్ తెలుగు టెలివిజన్ పరిశ్రమలో 'ఉయ్యాల జంపాలా' సీరియల్‌తో అడుగుపెట్టారు, ఇందులో అతను రాహుల్ పాత్రను పోషించారు. 2019 లో... అమర్‌దీప్‌కి 'సిరి సిరి మువ్వలు' సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఇందులో అశ్విన్ అనే పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సీరియల్ మధ్యలోనే ఆపేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Telugu Serial Actor Amardeep Chowdary into Bigg Boss Telugu 7: Here are the personal and Professional Details

ఇక చివరగా అమర్‌దీప్‌ ప్రియాంక జైన్‌తో కలిసి 'జానకి కలగలేదు' సీరియల్ లో నటించారు. మధ్యలో అమర్దీప్ అత్తారింటికి దారేదిలో, హిట్లర్ గారి పెళ్లాం సీరియల్స్ లో అతిథి పాత్రలు కూడా చేశారు. సీరియల్స్‌తో పాటు, అతను ఆయుష్మాన్ భవ, కేర్ ఆఫ్ అనసూయ, కృష్ణార్జున్ యుద్ధం, శైలజా రెడ్డి అల్లుడు మొదలైన చిత్రాలలో కూడా కనిపించారు.

ఇక సీరియల్ నటి తేజస్వని గౌడతో ప్రేమలో పడ్డ అమర్దీప్... ఆగస్ట్ 3, 2022న బెంగుళూరులో నిశ్చితార్థం జరిగింది. 14 డిసెంబర్ 2022న బెంగుళూరులో తేజస్విని గౌడను అమర్‌దీప్ వివాహం చేసుకున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న అమర్ దీప్... ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టనున్నారు. మరి ఎలాంటి ఈ కుర్ర నటుడు బిగ్ బాస్ లోకి వెళ్లి ఎలాంటి ఫెర్మామెన్స్ ఇస్తారో చూడాలి. ఫిల్మి బీట్ తెలుగు నుంచి ఆల్ ది బెస్ట్ అమర్ దీప్ చౌదరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X