Bigg Boss 7 Telugu 5 సీరియల్స్, 2 సినిమాలు చేసినా ఎవరికీ తెలియని నటుడు.. ఈ ప్రిన్స్ యవార్ గురించి తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎట్టకేలకు అట్టహాసంగా ప్రారంభం అయింది. ఇక అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహారిస్తున్న ఈ షోకు సంబంధించిన గ్రాండ్ కర్టెన్ రైజర్ ఈవెంట్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ గురించి మాకు తెలిసిన వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ యావార్ ఎవరు.. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.
ప్రిన్స్ యావార్... ఈ పేరు ఇటీవల కాలం నుంచే వినబడుతోంది. అది కూడా బిగ్ బాస్ హౌజులోకి అడుగుపెట్టనున్నారు.. ఇతను ఓ మోడల్ అని చెబుతున్నారు. అంతే తప్పు... ఈ కుర్రాడు ఎవరు ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ప్రిన్స్ యావార్ ఇండియన్ మోడల్. టెలివిజన్, చలనచిత్ర నటుడు. అతను ప్రధానంగా తెలుగు భాషలో కొన్ని సినిమాల్లో, సీరియల్స్ లో పనిచేశారు.

ప్రిన్స్... 12 జూన్ 1996న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు. తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, యావర్ హైదరాబాదులోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ , PG కళాశాలలో డిగ్రీ చేశారు. చిన్నప్పటి నుండి, యావర్ కు ఫిట్‌నెస్, మోడలింగ్‌పై ఆసక్తి ఎక్కువ. అతని కళాశాల రోజుల్లో, యావర్ మోడలింగ్‌లో పాల్గొనేవారు.
ఈ కుర్ర మోడల్... 2017వ సంవత్సరంలో... ప్రిన్స్ యావార్ చంద్రకాంత అనే హిందీ సీరియల్ తో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. అందులో అతను ఒక చిన్న పాత్రను పోషించాడు. యావర్ తర్వాత తెలుగు టెలివిజన్ పరిశ్రమలో నా పేరు మీనాక్షి సీరియల్‌తో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత హిట్లర్ గారి పెళ్లాం (జీ తెలుగు), అభిషేకం (ఈటీవీ), కలిసి ఉంటే కలదు సుఖం (స్టార్ మా) వంటి కొన్ని సీరియల్స్‌లో నటించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే... కమిట్‌మెంట్ మిస్టేక్ వంటి రెండు సినిమాల్లో నటించారు. అంతే కాదు పలు యాడ్స్ లో కూడా ప్రిన్స్ యావార్ నటించారు. ఇప్పుడు ఈ మోడల్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. అందం, యాక్టింగ్ తోనే కాకుండా డ్యాన్స్‌లతో ఆలరించే ప్రిన్స్ యావార్ బిగ్‌బాస్ మనసు దోచుకొన్నారు. దాంతో అతనికి బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో పాల్గొనే ఆఫర్ లభించింది.
సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమయ్యే బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర కాబోతున్నారు. తెలుగు ఫిల్మి బీట్ నుంచి ప్రిన్స్ యావార్ కు ఆల్ ది బెస్ట్.


Click it and Unblock the Notifications











