Divorce: భర్తకు తెలుగు సీరియల్ నటి విడాకులు.. 3 ఏళ్ల దాంపత్య జీవితానికి గుడ్‌బై!

వినోద పరిశ్రమలో అఫైర్ బ్రేకప్స్, విడాకుల వార్తల జోరు ఎక్కువగా కనిపిస్తున్నది. ఇటీవల కాలంలో ఉన్నట్టుండి సినీ, టెలివిజన్ తారలు తమ దాంపత్య జీవితాలకు గుడ్ బై చెబుతూ వార్తలతో అభిమానులకు షాకిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో తెలుగు టెలివిజన్ సీరియల్ నటి చేరింది. మూడేళ్ల క్రితం వివాహం చేసుకొన్న నటి తన భర్తతో తెగతెంపులు చేసుకొన్నట్టు అధికారికంగా ప్రకటించడం బుల్లితెర ప్రేక్షకులకు దిగ్బ్రాంతిని కలిగించింది. తెలుగు బుల్లితెర మీద డైనమిక్ పాత్రలతో ఆకట్టుకొంటున్న అనూష హెగ్డే తన భర్త నుంచి విడాకులు తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఆమె విడాకుల గురించి వార్తల్లోకి వెళితే..

కన్నడ రాష్ట్రానికి చెందిన అనూష హెగ్డే తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో టెలివిజన్ రంగంలో రాణిస్తున్నారు. మంగళూరుకు చెందిన ఈ అందాల భామ ఇప్పటి వరకు పలు సీరియల్స్‌లో నటించారు. రాధ రమణ, నిన్నే పెళ్లాడుతా, సూర్యకాంతం, ఆనంద రాగం లాంటి సీరియల్స్‌తో తెలుగు, దక్షిణాది బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు.

Actress Anusha Hegde officially divorced

అయితే బుల్లితెర నటుడు ప్రతాఫ్ సింగ్‌తో పరిచయం అనూషను ప్రేమలో పడేలా చేసింది. వారిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. నిన్నే పెళ్లాడుతా సెట్స్‌లో జరిగిన పరిచయం ప్రేమగా మారిందని చెప్పుకొన్నారు. 2019లో వారిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 12వ తేదీన వారిద్దరి వివాహం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది.

అయితే అనూష, ప్రతాప్ సింగ్ దాంపత్య జీవితం సవ్యంగానే సాగుతున్నట్టు కనిపించింది. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడం, ఇరు కుటుంబాలు వారి విభేదాలను పరిష్కరించే ప్రయత్నం సఫలం కావడంతో చట్టపరంగా విడిపోయిందుకు కోర్టును ఆశ్రయించారు. వారిని కౌన్సెలింగ్ చేసిన అనంతరం వారికి విడాకులను కోర్టు మంజూరు చేసింది. ఆ విషయాన్ని అనూష్ స్వయంగా వెల్లడించింది.

ప్రతాప్ సింగ్‌తో నా వైవాహిక జీవితానికి ముగింపు కార్డు పడింది. మేమిద్దరం విడిపోయి బతకాలని సమిష్టిగా నిర్ణయం తీసుకొన్నాం. మాకు 2025లో డైవోర్స్ లభించాయి. ఈ నిర్ణయం మా ఇద్దరిది. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదు. కాబట్టి మా ప్రైవసీకి భంగం కలిగించకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా విడాకులపై ఎలాంటి ఊహాగానాలు వద్దు. మేము వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకొన్నాం అని ఆమె తెలిపారు

అనూష హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. అనుపల్లవి అనే కన్నడ సీరియల్‌లో నటిస్తున్నారు. ఆమె ఈ సీరియల్‌లో ఐఏఎస్ ఆఫీసర్ పల్లవి పాత్రను పోషిస్తున్నారు. ఇంతకు మంుదు సూర్య కాంతం అనే సీరియల్‌లో డీసీపీ సూర్యకాంతంగా నటించారు. ఈ సీరియల్‌లో ఉత్తమ ప్రదర్శన గాను జీ తెలుగు కుటుంబ అవార్డ్ లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X