కో-డైరెక్టర్ కుట్ర..అలాంటి కష్టం ఎవరికీ రావొద్దు.. సీరియల్ హీరోయిన్ ఆవేదన

తెలుగు బుల్లితెరపై తన అందం, నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లహరి (Lahari)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'మొగలి రేకులు', 'గృహలక్ష్మి' వంటి సీరియల్స్‌తో ఆమె తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ఆ సీరియల్స్ ద్వారా వచ్చిన పాపులారిటీతో వెండితెరపై కూడా చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన లహరి, ప్రస్తుతం మాత్రం స్క్రీన్‌పై కాస్త తక్కువగా కనిపిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ, యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.

ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న లహరి తన వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలతో పాటు కొన్ని చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌లో ఎక్కువగా కనిపించకపోవడానికి గల కారణాలను వెల్లడిస్తూ, "ఇప్పుడు నేను సోషల్ మీడియా, యూట్యూబ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను" అని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా మంచి ఆదాయం వస్తోందని, కానీ తన సంపాదన గురించి పూర్తిగా బయటపెట్టాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. "ఈరోజుల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. అందుకే సంపాదించినది సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యం" అని ఆమె అభిప్రాయపడ్డారు.

Telugu serial actress Lahari Emotional on Industry Betrayal Says No One Should Face Such Hard Times

తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడిన లహరి, పెళ్లి తర్వాత వచ్చే బాధ్యతలు, కాంప్రమైజ్‌ల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. "మా ఇద్దరి మధ్య ఎవరి మాట ఎవరు వినరు. కొన్నిసార్లు నేను తగ్గుతాను, కొన్నిసార్లు ఆయన తగ్గుతారు. కానీ ఎక్కువసార్లు నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది" అని తెలిపారు. చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారి తీసే అవకాశం ఉంటుందని, ఒకే విషయం పదేపదే జరుగుతుంటే ఎప్పుడో ఒకసారి 'బ్లాస్ట్' అవ్వాల్సిందేనని చెప్పారు. "నేను ఎవరినీ ఉట్టిగా వదిలేయను. ఒకసారి కోపం వచ్చిందంటే నా భావాలను నేరుగా చెప్పేస్తాను" అని స్పష్టంగా చెప్పారు.

ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ లహరి భావోద్వేగానికి గురయ్యారు. ఒక సీరియల్ షూటింగ్ సమయంలో కో-డైరెక్టర్ తనపై అసూయతో తప్పుడు ఆరోపణలు సృష్టించాడని తెలిపారు. "నాకు తెలియకుండానే నా గురించి తప్పు ప్రచారం చేసి, మరుసటి రోజే నన్ను ఆ సీరియల్ నుంచి తీసేశారు. కానీ తర్వాత వాళ్లకే దాని ప్రభావం తెలిసింది. అప్పుడు నాకు 'కర్మ' అనేది నిజమని అర్థమైంది" అని ఆమె అన్నారు. ఈ సంఘటన తన జీవితంలో ఒక పెద్ద షాక్‌గా మిగిలిపోయిందని, అలాంటి అనుభవం ఎవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.

అత్త - కోడళ్ల సంబంధాల గురించి కూడా లహరి తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. "అత్త ఎప్పటికీ అత్తగానే ఉంటుంది. కోడలిని కూతురిలా చూసే పరిస్థితి చాలా అరుదు. కుటుంబంలో ఏ చిన్న గొడవ వచ్చినా మొదటగా తన కొడుకే సపోర్ట్ చేస్తారు" అని అన్నారు. పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఈ విషయాలను ముందుగానే అర్థం చేసుకోవాలని సూచించారు. "ఉమ్మడి కుటుంబంలో ఉండటం కంటే విడిగా ఉండటం మంచిది. అలాగే 'మామ బాయ్స్' విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి" అంటూ తన అనుభవాల ఆధారంగా ఓపెన్‌గా మాట్లాడారు.

షోలో చివరగా అడిగిన ప్రశ్నకు లహరి ఇచ్చిన సమాధానం అందరినీ కదిలించింది. "మీకు మళ్లీ అలాంటి రోజులు రావద్దని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా?" అని అడగగా, ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. "ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటికీ బాధేస్తుంది. నేను చెప్పింది కూడా తప్పే అని అనిపించిన పరిస్థితులు ఎదురయ్యాయి. అప్పుడు ఎవరికి చెప్పాలి అన్న భావన కలిగింది. నా లాంటి కష్టాలు ఎవరికీ రాకూడదు" అని ఎమోషనల్‌గా చెప్పారు.ఆమె చెప్పిన అనుభవాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: lahari telugu serials tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X