ప్రియుడితో పారిపోయిన తెలుగు నటి... 45 రోజుల పాటు ఆ ఊరిలో ఉంచి...
ఘర్షణ, చంద్రముఖి టీవీ సీరియల్స్‌లో నటించిన శ్రీవాణి ఓ యూట్యూబ్ ఛానల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తన టీనేజీ ప్రేమ వ్యవహారం, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ప్రేమించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, పెళ్లి చేసుకునే సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు.
17 ఏళ్ల వయసులోనే నటుడు, కొరియోగ్రాఫర్, ఈవెంట్ మేనేజర్‌తో విక్రమాదిత్యతో ఫ్రేమలో పడిన శ్రీవాణి ఇంకా తన మైనారిటీ తీరకుండానే ప్రియుడితో కలిసి పారిపోయిందట. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ విషయాలను ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు.

షిరిడీ అని చెప్పి అమలాపురం తీసుకెళ్లాడు
ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకునే పరిస్థితి లేకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. విక్రమ్ మొదట నాతో షిరిడి వెళ్లి పెళ్లి చేసుకుందామని చెప్పాడు. కానీ షిరిడీ తీసుకెళ్లకుండా అమలాపురం దగ్గరలోని ఓ పల్లెటూరికి తీసుకెళ్లాడు. ముందే నాకు విషయం చెబితే ఎవరికైనా చెప్పేస్తాను, మళ్లీ దొరికిపోతామనే భయంతో అలా చేశాడట. నేను కూడా ఆ విషయంలో ఏకీభవించాను అని శ్రీవాణి గుర్తు చేసుకున్నారు.

మైనారిటీ తీరలేదని పెళ్లి చేయలేదు
అక్కడికి వెళ్లిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ నా వయసు అప్పటికీ 17 సంవత్సరాలు మాత్రమే కావడంతో 18 సంవత్సరాలు నిండే వరకు ఆగాలని చెప్పారు. అందుకే నాలుగు నెలలు వెయిట్ చేశాం. సెప్టెంబర్ 2తో నాకు 18 సంవత్సరాలు నిండాయి, సెప్టెంబర్ 15న పెళ్లి చేసుకున్నాం అని శ్రీవాణి తెలిపారు.

45 రోజుల పాటు ఆ ఊరిలో
ఇద్దరం పని చేస్తున్నాం కాబట్టి చేతి నిండా డబ్బు ఉంది. పారిపోయే ముందే ఇద్దరం కలిసి రెండున్నర లక్షలు పట్టుకుని వెళ్లడంతో ఎక్కడా ఇబ్బంది పడలేదు. అమలాపురం దగ్గరలోని బెండమూర్లంక అనే ఊరిలో ఉన్నాం. ఆ ఊర్లో తెలిసిన కొరియోగ్రాఫర్ ఉండటంతో మాకు సహాయం చేశాడు. చెరువు పక్కనే మేము ఉండటానికి ఇల్లు ఇచ్చారు. 45 రోజుల పాటు ఆ ఊరిలో గడిపిన రోజులు ఎప్పటికీ గుర్తుండి పోతాయని శ్రీవాణి గుర్తు చేసుకున్నారు.

నేను పారిపోవడం వల్ల ఆ సీరియల్ ఆగిపోయింది
నేను పారిపోయే సమయంలో ‘ఘర్షణ' అనే సీరియల్ చేస్తున్నాను. పారిపోయిన తర్వాత ఆ సీరియల్ ఆగిపోయింది. అది ఇందిరా ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు. తిరిగి వచ్చాకు నాకు మరో ఛాన్స్ ఇవ్వడానికి వారు ఇష్టపడేలేదు. తర్వాత ‘చంద్రముఖి' సీరియల్‌లో ఆఫర్ వచ్చింది. అలా మళ్లీ నా కెరీర్ గాడిలో పడింది అని శ్రీవాణి తెలిపారు.

ఆ ధైర్యంతోనే అతడితో వెళ్లిపోయాను
నేను ప్రేమించిన విక్రమ్ నాకు బాగా తెలిసిన వ్యక్తి. చిన్నతనం నుంచి పరిచయం ఉంది. నన్ను బాగా చూసుకుంటాడు అనే ధైర్యంతోనే అతడితో వెళ్లిపోయా...అప్పటి రోజులను గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది అని శ్రీవాణి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











