TRP Rating: టాప్‌ గేర్‌లో కార్తీక దీపం.. దిగజారిన దేవత.. రెండు, మూడు స్థానాల్లో ఏ సీరియల్ అంటే?

తెలుగు టెలివిజన్ రంగంలో డైలీ సీరియల్స్ మధ్య రసవత్తరమైన పోటీ జరుగుతున్నది. కార్తీక దీపం, వదినమ్మ, ఇంటింటి గృహలక్ష్మీ, గుప్పెడంత మనసు, దేవత, జానకి కలగనలేదు లాంటి ధారావాహికలు ప్రేక్షకులకు విశేషంగా వినోదాన్ని పంచుతున్నాయి. ప్రేక్షకులకు వినోదం పంచుతున్న ఈ సీరియల్‌కు సంబంధించి రేటింగ్స్ ఇలా ఉన్నాయి. ఆ రేటింగ్ వివరాల్లోకి వెళితే..

ఐదో స్థానంలో దేవత సీరియల్

ఐదో స్థానంలో దేవత సీరియల్

బుల్లితెరపై ఆకట్టుకొంటున్న సీరియల్స్‌కు సంబంధించి టాప్ 5 రేటింగుల విషయానికి వస్తే.. సుహాసిని, అర్జున్ అంబటి, వైష్ణవి లీడ్ రోల్స్‌లో నటించిన దేవత సీరియల్ 5 స్థానానికి పడిపోయింది. గతవారం టీఆర్పీ రేటింగ్‌లో దేవత సీరియల్ నాలుగోస్థానంలో ఉండేది. గతంలో దేవత సీరియల్ మూడో స్థానానికి కూడా చేరుకొన్న సందర్భాలు ఉన్నాయి. దేవత సీరియల్‌కు గుప్పెడంత మనసు సీరియల్ నుంచి గట్టిపోటీ ఎదురవుతున్నది.

నాలుగో స్థానంలో జానకి కలగనలేదు

నాలుగో స్థానంలో జానకి కలగనలేదు

ఇక జానకి కలగనలేదు సీరియల్ ప్రస్తుత టీఆర్పీ రేటింగులో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇటీవలే ప్రారంభమైన ఈ సీరియల్‌లో ప్రియాంక జైన్, అమర్‌దీప్, సినీ నటి రాశి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత టీఆర్పీ రేటింగుల్లో ఐదో స్థానంలో కనిపించిన ఈ సీరియల్ ప్రేక్షకుల ఆదరణను నిలబెట్టుకోవడంతో నాలుగో స్థానానికి చేరుకొన్నది.

మూడో స్థానంలో గుప్పెడంత మనసు

మూడో స్థానంలో గుప్పెడంత మనసు

తెలుగు టెలివిజన్ టీఆర్పీ రేటింగ్స్‌లో మూడోస్థానానికి గట్టి పోటీ ఎదురువుతున్నది. తాజా రేటింగుల్లో సాయికిరణ్ రామ్, ముఖేష్ గౌడ తదితరులు నటిస్తున్న గుప్పెడంత మనసు మూడో స్థానాన్ని చేజిక్కించుకొన్నది. బుల్లితెర ప్రేక్షకులను సెంటిమెంట్, ఎమోషనల్ కంటెంట్‌తో విశేషంగా ఆకట్టుకొంటున్న ఈ సీరియల్ మంచి ఆదరణతో ముందుకెళ్తున్నది.

రెండోస్థానంలో ఇంటింటి గృహలక్ష్మి

రెండోస్థానంలో ఇంటింటి గృహలక్ష్మి

బుల్లితెర మీద గట్టి పోటీ మధ్య ఇంటింటి గృహలక్ష్మీ రెండోస్థానాన్ని నిలబెట్టుకొంంటూ ముందుకు వెళ్తున్నది. కస్తూరి శంకర్, హరికృష్ణ నటించిన ఇంటింటి గృహలక్ష్మి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. గత కొద్దికాలంగా మరో సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి దరిదాపులకు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదనే మాట వినిపిస్తున్నది.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
నంబర్ స్థానంలో కార్తీకదీపం

నంబర్ స్థానంలో కార్తీకదీపం

ఇక టాప్ గేర్‌లో దూసుకెళ్తూ కార్తీకదీపం భారీ టీఆర్పీని చేజిక్కించుకొంటున్నది. మలయాళ డైలీ సీరియల్ కరుతముత్తు ఆధారంగా తెరకెక్కుతున్న కార్తీక దీపంలో కార్తీక్‌గా నిరుపమ్ పరిటాల, దీపగా ప్రేమీ విశ్వనాథ్ నటిస్తున్నారు. ఇంకా మోనితగా శోభితా శెట్టి, సౌందర్యగా అర్చన తదితరులు నటిస్తున్నారు. దీప అనారోగ్యం అనే అంశం ఇప్పుడు ఈ సీరియల్‌కు ఆక్సిజన్‌గా మారింది. దీప, కార్తీక్ మధ్య వాగ్వాదం, మోనిత కుట్రల, సౌందర్య ఎమోషనల్ అంశాలు సీరియల్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లడమే కాకుండా టాప్ రేంజ్‌కు చేర్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X