బిగ్ బాస్ 4పై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత.. అలాంటి ఆఫర్స్ వస్తే..

సీనియర్ మోస్ట్ తెలుగు సింగర్ సునీతకు అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎప్పుడు చూసినా సింపుల్ గా తన చిరునవ్వుతోనే కనిపించే సునీత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా సైలెంట్ గా ఉండే ఆమె ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండడం లేరు. ఊహించని విధంగా స్పందిస్తూ రూమర్స్ కి కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

లిస్ట్ లో సునీత పేరు..?

లిస్ట్ లో సునీత పేరు..?

ఇక ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 మొదలు కానున్న విషయం తెలిసిందే. అయితే షో ఇంకా మొదలవ్వకముందే చాలా రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో ఊహించని పేర్లు వినబడుతున్నాయి. అందులో సునీత పేరు కూడా ఉంది. ఇక ఫైనల్ గా ఆ రూమర్స్ పై ఎట్టకేలకు ఈ గాయని వివరణ ఇచ్చారు.

క్లారిటీ ఇచ్చిన సింగర్..

క్లారిటీ ఇచ్చిన సింగర్..

ఫేస్ బుక్ లో ఒక వీడియో పోస్ట్ చేసిన సునీత బిగ్ బాస్ 4లో పాల్గొనబోతున్నట్లు వస్తున్న రూమర్స్ పై ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. బిగ్ బాస్ 4లో నేను పాల్గొనడం లేదు. గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు. ఇప్పుడు మాత్రమే కాదు. భవిష్యత్తులో కూడా బిగ్ బాస్ లో అడుగుపెట్టాలని అనుకోవడం లేదు అని సునీత క్లియర్ గా వివరణ ఇచ్చారు.

భవిష్యత్తులో కూడా..

భవిష్యత్తులో కూడా..

ఇక సునీత ఇచ్చిన క్లారిటీతో నిజంగా ఒక వర్గం అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారనే చెప్పాలి. నిజంగా ఆమె షోకి రాబోతుందనుకొని కొందరు సంబరపడ్డారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఆమె కుండబద్దలు కొట్టేశారు. అలాగే భవిష్యత్తులో ఒకవేళ అలాంటి ఆఫర్స్ వచ్చినా కూడా ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పేశారు.

Recommended Video

Hero Sudheer Babu Special Interview On 'V' Movie
106రోజుల పాటు బిగ్ బాస్ షో

106రోజుల పాటు బిగ్ బాస్ షో

ఇక సునీతతో పాటు తరుణ్, శ్రద్దా దాస్ అలాగే మరికొందరు స్టార్స్ కూడా బిగ్ బాస్ లో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్ 6న ఆదివారం మొదలుకాబోతున్న బిగ్ బాస్ 4కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. 16 మంది కంటెస్టెంట్స్ స్టార్ట్ చేయబోయే ఈ రియాలిటీ షో 106 రోజుల పాటు కొనసాగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X