సీక్రెట్ గా మలేసియాలో సీరియల్ నటి పెళ్లి.. పెళ్లి ఫోటోలు వైరల్!
సినీ గ్లామర్ ఫీల్డ్ లో పెళ్లిళ్లు, విడాకులు సర్వ సాధారణం అని తెలిసిందే. అయితే కొందరి పెళ్లిళ్లు అట్టహాసంగా అందరికీ తెలిసేలా జరిగితే మరికొందరి సెలబ్రిటీల వివాహాలు చాలా రహస్యంగా అవుతుంటాయి. ఇక సీరియల్స్ నటీనటులకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా తెలుగు సీరియళ్ల ద్వారా పాపులర్ అయిన బ్యూటీ ప్రియాంక నల్కారి. తెలుగు సీరియళ్లు, టీవీ షోలలో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ తమిళం ధారావాహికల్లో కూడా అదరగొడుతోంది. అయితే బ్యూటిఫుల్ భామ తాజాగా రహస్యంగా పెళ్లి చేసుకుందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
తెలుగులో టీవీ సీరియళ్లు, షోస్ చూసేవారికి బ్యూటిఫుల్ ప్రియాంక నల్కారి గురించి పెద్దగా పరిచంయ అక్కర్లేదు. హైదరాబాద్ కు చెందిన ప్రియాంక నల్కారి అందరి బంధువయా అనే సినిమాతో 2010లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సమ్ థింగ్ సమ్ థింగ్, నా సామి రంగా వంటి తెలుగు చిత్రాలతోపాటు తమిళంలో తీయా వేళాయి సెయ్యనుమ్ కుమారు సినిమాలో నటించింది. ఆ తర్వాత వరుసగా.. వెల్ కమ్ టు అమెరికా, రవితేజ కిక్ 2, హైపర్, నేనే రాజు నేనే మంత్రి, వైఫ్ ఆఫ్ రామ్, కాంచన 3 సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ముద్దగుమ్మ ప్రియాంక నల్కారి.
అనేక తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకున్న బ్యూటిఫుల్ ప్రియాంక నల్కారికి చెప్పుకునే విధంగా క్యారెక్టర్స్ పడలేదు. దీంతో ఆమె తెలుగు సీరియళ్లలోకి ఎంట్రీ ఇచ్చింది. మేఘమాల ధారావాహికతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మంగమ్మ గారి మనువరాళ్లు, శ్రావణ సమీరాలు, రోజా, చంద్రలేఖ వంటి తదితర సీరియళ్లు చేసింది. ప్రస్తుతం తమిళంలో సన్ టీవీలో వస్తున్న రోజా, జీ తమిళ్ లోని సీతా రామం సీరియల్ తో బిజీగా ఉంది. అయితే తాజాగా ప్రియాంక నల్కారి రహస్యంగా పెళ్లి చేసుకుంది. అది కూడా మలేసియాలో. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి తెలిపింది.
జస్ట్ మ్యారీడ్ అని ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన పోస్టులో రాసుకొస్తూ పెళ్లి చేసుకున్న ఫొటోలను పంచుకుంది సీరియల్ బ్యూటి ప్రియాంక నల్కారి. తను ప్రేమించి, ఎంగేజ్ మెంట్ చేసుకున్న వ్యక్తిని ఎలాంటి ఆడంబరం లేకుండా మలేసియాలోని ఓ గుడిలో మార్చి 23న వివాహం చేసుకుంది. ప్రస్తుతం ప్రియాంక నల్కారి పెళ్లి ఫొటోలు చూసిన ఆమె ఫాలోవర్లు, నెటిజన్లు వెడ్డింగ్ విషెస్ తెలుపుతున్నారు. అయితే ప్రియాంక ఆమె కుటుంబసభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ప్రియాంక భర్త రాహుల్ వర్మ ఒక వ్యాపారవేత్త అని తెలుస్తోంది. అతను కొన్ని సీరియల్స్ లో నటించాడని అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. ఇక వీరిద్దరు 2018లో నిశ్చితార్థం చేసుకున్నారట. ప్రియాంక సీరియళ్ల పరంగా బిజీగా ఉండటంతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చిందట. దీంతో అతను మలేషియా వెళ్లిపోయాడని.. ఇప్పుడు ఆమె కూడా అక్కడికి చేరుకుని వివాహం చేసుకుందని టాక్.


Click it and Unblock the Notifications











