పుకార్లే మానసికంగా చంపేశాయి.. వైరస్ అలా.. కరోనా సోకిన తెలుగు నటి సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ బుల్లితెర నటి నవ్య స్వామి కరోనావైరస్ బారిన పడటం టెలివిజన్ ఇండస్ట్రీని షాక్ గురిచేసింది. ఆమె కథ, నా పేరు మీనాక్షి లాంటి సీరియల్స్‌తో మంచి ప్రేక్షకాదరణ, అభిమానులను సొంతం చేసుకొన్న ఆమె ప్రాణాంతక వ్యాధి బారిన పడటంతో తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తాను కరోనా బారిన పడిన తర్వాత నవ్య స్వామి స్పందించారు. ప్రముఖ దినపత్రికతో మాడ్లాడుతూ..

కరోనా సోకిన మాట నిజమే
నాకు కరోనావైరస్ సోకిన వార్త నిజమే. ఇటీవల నాకు జరిగిన వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కోవిడ్19 లక్షణాలు ఉన్నట్టు బయటపడ్డాయి. కరోనా పాజిటివ్ అని తెలియగానే కొంత ఆందోళనకు గురయ్యాను. వెంటనే మొట్టమొదటగా షూటింగుల్లో పాల్గొన వద్దని నిర్ణయం తీసుకొన్నాను. ఇతరులక సోకకుండా జాగ్రత్త పడ్డాను అని నవ్య స్వామి అన్నారు.

వైద్య పరీక్షల్లో బయటపడిన తర్వాత
నాలుగు రోజులుగా తీవ్ర అలసట, తలనొప్పి ఉండటంతో డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన సూచన మేరకు పరీక్షలు చేసుకొన్నాను. రోగ నిర్ధారణ పరీక్షల్లో నాకు పాజిటివ్ అని తేలింది. వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాను. ఇప్పుడు లక్షణాలు తగ్గినట్టు అనిపిస్తున్నది. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాను అని నవ్యస్వామి వెల్లడించారు.

రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా
కరోనా బారిన పడ్డాననే విషయం తెలియగానే రాత్రంతా ఏడ్చాను. తెల్లవారే వరకు ఏడుస్తూనే ఉన్నాను. రాత్రంత నిద్రపట్టలేదు. నాతోపాటు అమ్మకూడా ఏడుస్తూ కూర్చున్నది. నాకు కరోనా అనే విషయం తెలియగానే చాలా మంది నాకు ఫోన్ చేశారు. వారితో మాట్లాడుతూ నా బాధను పంచుకొన్నాను. నా సహచర నటిని, సిబ్బందిని ఇబ్బందిలో పడేశానా అనే బాధ నన్ను వెంటాడుతున్నది అని నవ్య స్వామి పేర్కొన్నారు.

రూమర్లే నన్ను ఎక్కువగా బాధించాయి
కరోనా సోకిందనే వార్తల కంటే బయట వ్యక్తులు నాపై ప్రచారం చేసిన రూమర్లే నాకు చాలా బాధకలిగించాయి. ఎవరైనా కావాలని వైరస్‌ను వ్యాప్తి చేస్తారా? ఎవరి నుంచి వైరస్ సోకుతుందనే విషయం తెలుస్తుందా? నాకు కరోనా వైరస్ సోకిందనగానే ఎవేవో పుకార్లు పుట్టించడం బాధను కలిగించింది అని నవ్య స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video

ఇరుగు పొరుగు వాళ్లు అలా వేధిస్తారు..
ఎవరైనా కరోనా బారిన పడితే ఆందోళన చెందవద్దు. విటమిన్ సీ, జింక్ లాంటివి ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. ఇరుగు పొరుగు వాళ్లు ఏం మాట్లాడినా పట్టించుకోవద్దు. అది పట్టుకోవద్దు.. ఇది పట్టుకోవద్దు అంటూ వేధిస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండాలి అని నవ్య స్వామి సూచనలు, సలహాలు ఇచ్చారు.


Click it and Unblock the Notifications











