తెలుగు టీవీ పరిశ్రమలో కలకలం.. లైవ్లోనే విషం తాగిన నటి.. ఏమైందంటే?

ఒకపక్క బెంగాలీ సినీ పరిశ్రమలో యువ నటీమణుల వరుస సూసైడ్ కేసులు సంచలనం రేపుతున్న సమయంలో తెలుగు బుల్లితెరకు సంబంధించిన ఒక నటి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.. పోలీసులకు వీడియో కాల్ చేసి వీడియో కాల్ నడుస్తూ ఉండగానే విషం తాగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

లైవ్ లో

లైవ్ లో

తెలుగు బుల్లితెర లో కొన్ని సీరియల్స్ లో నటిస్తున్న మైథిలి అనే యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు వీడియో కాల్ చేసి లైవ్ లో గుర్తు తెలియని ఒక ద్రావణం తాగినట్టు చెబుతున్నారు. అయితే అది విషం అని ప్రచారం జరుగుతుండగా దాని మీద పోలీసులు మాత్రం ఎలాంటి సమాచారం బయటకు రానీయలేదు.

విభేదాలు

విభేదాలు

ప్రస్తుతం సదరు యువతిని పోలీసులు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మైధిలి అనే నటి తన భర్తతో కలిసి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటోంది. ఆమెకు ఆమె భర్తకు గత కొద్దిరోజుల నుంచి విభేదాలు నెలకొన్నాయని తెలుస్తోంది. గతంలో ఒకసారి పోలీస్ స్టేషన్లో భర్త మీద మైధిలి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది అయితే పోలీసులు అప్పటికి కేసు నమోదు చేయకుండా వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి సర్దిచెప్పి పంపించారని తెలుస్తోంది.

ద్రావణం తాగినట్లు

ద్రావణం తాగినట్లు

తాజాగా ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తన భర్త తాను కొనుక్కున్న కారు బలవంతంగా తీసుకున్నాడని దాన్ని తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వడం లేదని చెబుతూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తామని చెప్పి పంపించారు. గతంలో కూడా తన భర్త మీద కేసు పెట్టిన సమయంలో అలాగే పోలీసులు తాత్సారం చేశారు అని, పోలీసులకే వీడియో కాల్ చేసిన మైధిలి లైవ్ లో ఏదో ద్రావణం తాగినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆమె ఇంటికి చేరుకుని ఆమెను హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

నగలు చోరీ

నగలు చోరీ

ప్రస్తుతం పలు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ విషయం మీద పోలీసులు మరిన్ని వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఆమె కొద్ది రోజుల క్రితం భర్త పిల్లలతో కలిసి పంజాగుట్ట నుంచి ఎల్లారెడ్డి గూడ షిఫ్ట్ అయ్యారు. అయితే పంజాగుట్టలో ఉన్న సమయంలో ఆమె నగలు చోరీకి గురయ్యాయని తెలుస్తోంది.

 మైధిలి శ్రీతన్ పేరుతో

మైధిలి శ్రీతన్ పేరుతో

ఈ విషయం మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఆమె తరచూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి వస్తోందని, రోజులు గడుస్తున్నా తన కేసు విషయంలో న్యాయం జరగడం లేదని భావిస్తూ ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెబుతున్నారు. నిజానికి నటిగా కంటే మైధిలి సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమెతో పాటు ఆమె ఇద్దరు కుమారులు కూడా పలు సీరియల్స్ సినిమాల్లో నటించారు. మైధిలి శ్రీతన్ పేరుతో ఆమె సోషల్ మీడియాలో పలు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ వ్యవహారం మీద ఆమె నోరు విప్పి చెబితే గాని అసలు ఏం జరిగింది అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X