Bigg Boss Vs EMK: ఎన్టీఆర్‌కు అందనంత దూరంలో నాగార్జున.. 42వ వారంలో ఊహించని రేటింగ్స్

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీకి సంబంధించిన సీరియల్స్, వినోదాత్మక కార్యక్రమాలు, రియాలిటీ షోలకు సంబంధించిన రేటింగ్స్ విడుదలయ్యాయి. బుల్లితెర మీద డైలీ సీరియల్స్‌తోపాటు ప్రత్యేక ఆకర్షణగా మారిన బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో, ఎవరు మీలో కోటీశ్వరులు, మాస్టర్ చెఫ్ లాంటి గేమ్ షోలు ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే 2021లో 42వ వారానికి సంబంధించిన రేటింగ్స్ ఇలా ఉన్నాయి. ఆ రేటింగ్స్ వివరాల్లోకి వెళితే. .

దుమ్ము రేపిన స్టార్ మా పరివార్ అవార్డ్స్

దుమ్ము రేపిన స్టార్ మా పరివార్ అవార్డ్స్

దసరా పండుగ నేపథ్యంగా రూపొందించిన కార్యక్రమాలకు ప్రేక్షకుల భారీగా పట్టం కట్టారు. ఈ సందర్భంగా స్టార్ మా నిర్వహించిన స్టార్ మా పరివార్ అవార్డులు 2022కు మంచి రేటింగ్ నమోదైంది. పరివార్ అవార్డ్సుకు సంబంధించిన అర్భన్‌లో 10.70 రేటింగ్, రూరల్‌లో 10.17 రేటింగ్ నమోదైంది. ఇక దసరా దోస్తి అంటూ జీ తెలుగు చానెల్ ప్రసారమైన ఈ షోకు పెద్దగా ఆకట్టుకొనలేకపోయింది. ఈ షో అర్బన్‌లో 2.99 రూరల్‌లో 2.31 రేటింగ్ నమోదు చేసుకొన్నది.

 మాస్టర్ చెఫ్ మరీ దారుణంగా

మాస్టర్ చెఫ్ మరీ దారుణంగా

గతంలో తమన్నా హోస్ట్‌గా నిర్వహించిన మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి ప్రస్తుత హోస్ట్‌గా అనసూయ భరద్వాజ్ వ్యవహరిస్తున్నారు. కొద్ది వారాలుగా ఆకట్టుకొలేకపోతున్న ఈ షోకు 42 వారంలో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 41వ వారంలో 1.36 రేటింగ్ నమోదు చేస్తే 42వ వారంలో 1.46 రేటింగ్, రూరల్‌లో 41వ వారంలో 1.11 రేటింగ్, 42వ వారంలో 1.24 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది.

 ఎన్టీఆర్ కోటీశ్వరులు తడబాటు

ఎన్టీఆర్ కోటీశ్వరులు తడబాటు

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో మంచి కంటెంట్‌తో వస్తున్నప్పటికీ.. రేటింగ్ పరంగా మెరుగుపరుచుకోలేకపోతున్నది. 41వ వారంలో అర్బన్‌లో 2.87 రేటింగ్ సాధిస్తే.. 42వ వారంలో 1.46 రేటింగ్‌ను, అలాగే రూరల్ ప్రాంతంలో 41వ వారంలో 1.11 రేటింగ్, 42 వారంలో 1.24 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. గత వారం కంటే ఈ షో కాస్త పుంజుకొన్నట్టు కనిపిస్తున్నది.

పుంజుకొంటున్న నాగ్ ఎపిసోడ్స్ రేటింగ్స్

పుంజుకొంటున్న నాగ్ ఎపిసోడ్స్ రేటింగ్స్

ఇక బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున అక్కినేని షో విషయానికి వస్తే.. వారాంతంలో రెండు రోజులు అంటే శని, ఆదివారాల్లో రేటింగ్ భారీగా ఉంటుంది. నాగ్ వచ్చే రెండు రోజుల్లో భారీ స్పందన కనిపిస్తున్నది. 41వ వారంతో అర్బన్ ప్రాంతంలో 8.77 రేటింగ్ సాధిస్తే.. 42 వారంలో 8.89 రేటింగ్‌ను నమోదు చేసింది. రూరల్ విషయానికి వస్తే.. 41వ వారంలో 5.70 రేటింగ్ సాధిస్తే.. 42వ వారంలో 6.54 రేటింగ్ సొంతం చేసుకొన్నది.

Recommended Video

Romantic Movie Premiere - Celebrities Response | Akash Puri, Ketika Sharma ​| Filmibeat Telug
వారం రోజులు నత్తనడకే అంటూ రేటింగ్స్

వారం రోజులు నత్తనడకే అంటూ రేటింగ్స్

అలాగే సోమవారం నుంచి శుక్రవారం వరకు సాగే బిగ్‌బాస్ తెలుగు షో ఎపిసోడ్స్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయనేది తాజా రేటింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. 41వ వారంలో అర్బన్ ప్రాంతంలో 4.27 రేటింగ్ సాధిస్తే.. 42 వారంలో 5.56 రేటింగ్‌ను, రూరల్ ప్రాంతంలో 41వ వారంలో 2.69 రేటింగ్ సాధిస్తే.. 42వ వారంలో 3.39 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. గత వారంతో పోల్చుకొంటే మెరుగైన రేటింగ్‌ను రాబట్టడం కొంత ఉపశమనంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X