Telugu Tv Actress ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. వంటలక్కకు పోటీగా సీనియర్ నటి!
కేవలం సినిమాలతోనే కాకుండా ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు సీరియల్స్ ద్వారా కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని టాప్ సీరియల్స్ ద్వారా వారికి ఆదాయం కూడా గట్టిగానే దక్కుతోంది. ఇప్పుడు టెలివిజన్ రంగంలో కూడా మార్కెట్ వాల్యూ బాగానే పెరిగిపోయింది. గత ఏడాది కంటే ఈసారి కొంతమంది పారితోషికాలు మరికొంత పెంచినట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా ఇప్పుడు ఒక్క రోజుకు షూటింగ్ కు అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న తెలుగు టెలివిజన్ సీరియల్ నటిమనుల లిస్టు ఈ విధంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వంటలక్క.. లెక్క పెరిగింది
ముందుగా అందరి కంటే ఎక్కువ స్థాయిలో కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి గుర్తింపును అందుకున్న ప్రేమీ విశ్వనాథ్ అత్యధిక స్థాయిలో పారితోషికం అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె ఒక ఎపిసోడ్ కు గత ఏడాది వరకు ఒక్క రోజుకు 30 వేల వరకు పారితోషికం అందుకున్నారు. ఇక ఇప్పుడు ఆమె అంతకంటే ఎక్కువ స్థాయిలోనే డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక కార్తీకదీపం సీరియల్ కావడంతో ఆమె మరో కొత్త సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాబోతోంది.

వంటలక్కకు పోటీగా రాశి
కేవలం వంటలక్క మాత్రమే కాకుండా ఇప్పుడు మిగతా సీరియల్స్ ద్వారా కూడా కొంతమంది నటీమణులు భారీ స్థాయిలోనే డిమాండ్ చేస్తున్నారు. అయితే గత ఏడాది వరకు ప్రేమే విశ్వనాధ్ కు పోటీగా అయితే ఎవరు రాలేదు. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్ రాశి జానకి కలగనలేదు సీరియల్ ద్వారా దాదాపు ప్రేమీ విశ్వనాథ్ కు పోటీగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా ఒక్క రోజు షూట్ కు ఇప్పుడు 30 వేలకు దగ్గర్లో ఉన్నట్లు సమాచారం.

సుజిత రెమ్యునరేషన్ ఎంతంటే..
ఇక వదినమ్మ సీరియల్ ద్వారా ఇటీవల కాలంలో మంచి గుర్తింపును అందుకుంటున్న సుజిత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఇది వరకే కొన్ని తెలుగు సినిమాలలో కూడా సిస్టర్ పాత్రలలో కనిపించి మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఇప్పుడు ఆమె డిమాండ్ ప్రకారం అయితే షూటింగ్స్ లలో ఒక్కరోజు పాల్గొంటే దాదాపు 25 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

సీనియర్ నటి కస్తూరి
ఇక సీనియర్ హీరోయిన్ కస్తూరి కూడా తెలుగులో కొన్ని సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె నటిస్తున్న ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ కు మంచి టిఆర్పి దక్కుతోంది. అయితే ఈ సీరియల్ కు గాను ఆమె ఒక రోజు షూటింగ్ కు దాదాపు 25 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆమె మరికొంత వారితోషికం కూడా పెంచినట్లు టాక్ వినిపిస్తోంది.

రక్తసంబంధం ఫేమ్ మేఘన
ఇక మేఘన లోకేష్ కూడా ఇటీవల కాలంలో తన క్రేజ్ మెల్లగా పెంచుకుంటుంది. ఈ తెలుగు అమ్మాయి మొదటగా రక్తసంబంధం అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో తన స్థాయిని పెంచుకుంది. ఇక తర్వాత కళ్యాణం కమనీయం అనే సీరియల్ కూడా మంచి టిఆర్పిని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కల్యాణ వైభోగం అనే సీరియల్ తో మరింత క్రేజ్ అందుకుంటుంది. ఈ సీరియల్ కు గాను ఆమె ఒక్క రోజు షూటింగ్ కోసం దాదాపు 20,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రియాంకతో పాటు..
చాలావరకు ఇటీవల కాలంలో అయితే టెలివిజన్ నటి మణులలో 15వేల నుంచి 20వేల రేంజ్ లోనే వారి రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు. ఇక జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తున్న ప్రియాంక జైన్ కూడా 20,000 రేంజ్ లోనే అందుకుంటోంది. ఇక నవ్య స్వామి, ఐశ్వర్య అర్చన, శోభిత శెట్టి.. ఇలా మరికొందరు 15 వేల నుంచి 20 వేల మధ్యలోనే వారి రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు.


Click it and Unblock the Notifications










