TV యాంకర్స్ రెమ్యునరేషన్ లో మార్పులు.. ఇప్పుడు ఎంత డిమాండ్ చేస్తున్నారంటే?

ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం మాటలతోనే ఎక్కువగా ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం గ్లామర్ తో కూడా సరికొత్తగా ఎట్రాక్ చేస్తున్నారు. ఇక వారి పారితోషికాలు కూడా సినీ ఆర్టిస్టులకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటున్నాయి. రేంజ్ పెరుగుతున్న కొద్దీ నెంబర్లు కూడా పెరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో తెలుగులో గత కొంతకాలంగా ఆకట్టుకుంటున్న యాంకర్స్ వారి రెమ్యునరేషన్స్ పెంచినట్లు తెలుస్తోంది. ఇక ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు అనే వివరాల్లోకి వెళితే..

యాంకర్ సుమ

యాంకర్ సుమ

బుల్లితెరపై అత్యంత సీనియర్ యాంకర్లలో ఉన్న వారిలో సుమ కనకాల ఒకరు. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నుంచి ఆమె ప్రస్థానం కొనసాగుతూ వస్తోంది. మొదట్లో టెలివిజన్ నటిగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగిన సుమ ఆ తర్వాత ఈవెంట్స్ రియాలిటీ షో లతో మంచి యాంకర్ గా గుర్తింపునంకుంది. ఇక ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. సుమ ఒక్కో ఈవెంట్ కు దాదాపు రెండు లక్షలకు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక టెలివిజన్ షోలకు దాదాపు అదే రేంజ్ లో డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

అనసూయ భరద్వాజ్

అనసూయ భరద్వాజ్

ఇక యాంకర్ సుమ తర్వాత చాలామంది మాటల కంటే కూడా గ్లామర్ తోనే ఎక్కువగా కట్టుకుంటూ వస్తున్నారు. జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న యాంకర్స్ లో అనసూయ భరద్వాజ్ టాప్ పొజిషన్ లో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఆమె జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఒక్క ఎపిసోడ్ కోసం రెండు లక్షల వరకు తీసుకుంటూ వచ్చింది. ఇక ఇప్పుడు నటిగా దాదాపు 2లక్షలకు వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం.

రష్మి గౌతమ్

రష్మి గౌతమ్

ఇక జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ ద్వారానే ఈ బ్యూటీ ఎక్కువగా ఆదాయాన్ని అందుకుంది అని చెప్పవచ్చు. మధ్యలో చిన్న చిన్న సినిమాలు చేసింది కానీ అవి ఏమీ అంతగా వర్కౌట్ కాలేదు. జబర్దస్త్ తప్పితే రష్మీకి ఇతర టీవీ షోలలో అయితే పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక సుధీర్ తోనే ఆమె ఎక్కువగా కెమిస్ట్రీ మైయింటైన్ చేస్తూ డి లాంటి షోలతో క్రేజ్ పెంచుకుంటోంది. ఇక ఆమె రేంజ్ కు తగ్గట్టుగానే దాదాపు లక్షన్నరకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

శ్రీముఖి కూడా..

శ్రీముఖి కూడా..

నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీముఖి ఆ తర్వాత పటాస్ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు అందుకుంది. అనంతరం బిగ్ బాస్ షో ద్వారా కూడా ఆమెకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ పెరిగారు. ఇతరులను గ్లామర్ తో కూడా ఎక్కువగా ఆకట్టుకున్న శ్రీముఖి యాంకర్ గా చేసేందుకు ప్రస్తుతం లక్షన్నరకు పైగానే డిమాండ్ చేస్తుంది.

మంజూష.. శ్యామల

మంజూష.. శ్యామల

ఇక యాంకర్స్ లో గ్లామర్ తో ఎక్కువగా ఆకట్టుకునే వారి సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతొంది. ఒకప్పుడు రాఖీ సినిమాలో సిస్టర్ పాత్రలో చాలా సింపుల్ గా కనిపించిన మంజూష రాంపల్లి ఆ తర్వాత యాంకర్ గా కొత్త కెరీర్ ను మొదలు పెట్టింది. ఇక ఇప్పుడు ఆమె ఎక్కువగా చిన్న తరహా ఈవెంట్స్ లలో దర్శనమిస్తోంది.

యాంకర్ మంజూష ప్రస్తుతం ఈవెంట్స్ కు 50 వేల రేంజ్ లో పారితోషకం తీసుకుంటోంది. ఇక చిన్న ఈవెంట్స్ ఏమైనా ఉంటే అంతకంటే తక్కువగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక శ్యామల అలాగే విష్ణు ప్రియ లాంటి వాళ్లు కూడా దాదాపు 30 నుంచి 50 వేల మధ్యలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X