టాప్ యాంకర్స్ సుమ నుంచి మంజూష వరకు.. రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం యాంకర్స్ మధ్య బలమైన పోటీ నెలకొంది. ఒకప్పుడు కేవలం మాటలతోనే ఆకట్టుకునే యాంకర్స్ ఇప్పుడు మాటలతోనే కాకుండా గ్లామర్ డోస్ కూడా పెంచేస్తున్నారు. బుల్లితెరపై కూడా హాట్ లుక్స్ తో షాక్ ఇస్తున్నారు. ఇక యాంకర్స్ ఒక్క రోజులోనే లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటున్నారు. అందులో కొంతమంది టాప్ యాంకర్స్ రెమ్యునరేషన్ లిస్టుపై ఒక లుక్కేస్తే...

పొట్టి బట్టల్లో సెగలు రేపుతున్న మధు శాలిని.. ఎక్కడా తగ్గట్లేదుగా

అప్పట్లో ఇంత ఇచ్చేవారు కాదు

అప్పట్లో ఇంత ఇచ్చేవారు కాదు

ఒకప్పుడు శిల్పా, ఉదయభాను వంటి యాంకర్స్ బుల్లితెరపై ఎక్కువగా సందడి చేసేవారు. అలాగే సినిమా ఈవెంట్స్ లలో కూడా ఈ సీనియర్ యాంకర్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేవారు. సుమ కూడా అప్పటి నుంచే తన రేంజ్ ను పెంచుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇస్తున్నంత రెమ్యునరేషన్ మాత్రం అప్పట్లో ఇచ్చేవారు కాదు.

సుమ రెమ్యునరేషన్

సుమ రెమ్యునరేషన్

ముందుగా సుమ విషయానికి వస్తే.. దాదాపు పెద్ద సినిమాలన్నీ కూడా సుమ యాంకరింగ్ తోనే కొనసాగుతాయి. సినిమా వాళ్లకు కూడా ఈవెంట్స్ లలో సుమ ఉంటే ఒక ధైర్యం ఉంటుంది. ఎదో ఒక రకంగా షోను ఆమె సక్సెస్ ఫుల్ గా నడిపిస్తారని అనుకుంటారు. ఇక సుమ ఒక్కో ఈవెంట్ కు 2లక్షలకు పైగానే తీసుకుంటారని సమాచారం.

అనసూయ 2లక్షలకు పైగా

అనసూయ 2లక్షలకు పైగా

గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా రెండు చేతుల సంపాదిస్తోంది. ఒకవైపు టీవీ షోలు మరోవైపు సినిమా ఈవెంట్స్ అంటూ బిజీబిజీగా ఉంటుంది. ఇక టీవీ షోలకు అయినా సరే సినిమా ఈవెంట్స్ అయినా సరే అనసూయ 2లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

రష్మీ ఆదాయం ఎంతంటే

రష్మీ ఆదాయం ఎంతంటే

మరో హాట్ యాంకర్ రష్మీ కూడా తన గ్లామర్ తో జబర్దస్త్ కు సరికొత్త అందాన్ని తీసుకొచ్చింది. ఇక ఆమె ఎక్కువగా ఈవెంట్స్ అయితే చేయదు. కూల్ గా జబర్దస్త్ డీ లాంటి షోల వరకే పరిమితమవుతోంది. ఇక రెమ్యునరేషన్ అయితే డైలీ పేమెంట్ గా లక్షన్నరకు పైగా అందుకుంటున్నట్లు సమాచారం.

బిగ్ బాస్ తరువాత డోస్ పెంచిన శ్రీముఖి

బిగ్ బాస్ తరువాత డోస్ పెంచిన శ్రీముఖి

ఇక బిగ్ బాస్ కంటే ముందు వరకు కూడా ఒక రేటు చెప్పిన శ్రీముఖి బిగ్ బాస్ తరువాత మాత్రం ఒక్కసారిగా డోస్ పెంచేసిందట. ఈవెంట్స్ కు లక్షకు పైగా డిమాండ్ చేస్తూ ఇతర టీవీ షోలకు మాత్రం మాట్లాడుకున్న దాని బట్టి లక్షల్లోనే పారితోషికం అందుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి.

మంజూష కూడా..

మంజూష కూడా..

రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లిగా కనిపించిన యాంకర్ మంజూష ఆ తరువాత యాంకర్ గా సరికొత్త కెరీర్ ను స్టార్ట్ చేసుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. మొదట సింపుల్ గానే కనిపించిన మంజూష ఆ తరువాత మాత్రం మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతూ మిగతా వారికి పోటీగా నిలుస్తోంది. మంజూష కూడా ఈవెంట్స్ కు 50వేలకు పైగా అందుకుంటున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X