twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మద్యం మత్తు? ఐపీఎల్ మ్యాచ్‌‌లో తెలుగు టీవీ నటి ప్రశాంతి అండ్ గ్యాంగ్ రచ్చ.. కేసు నమోదు!

    |

    Recommended Video

    Case Booked On Telugu TV Anchor Prashanthi For Creating Nuisance At Uppal Stadium | Filmibeat Telugu

    తెలుగు టీవీ నటి ప్రశాంతి, మరో ఐదుగురిపై కేసు నమోదైంది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా వీరు న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో పాటు ఒక వ్యక్తిని మ్యాచ్ చూడకుండా ఇబ్బంది పెట్టినందుకుగాను వీరిపై కంప్లయింట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    భారత ఫైనాన్స్‌ సంస్థ ఉపాధ్యక్షుడు సంతోష్‌ ఉపాధ్యాయ్‌ వీరిపై ఫిర్యాదు చేశారు. ఆయన తన ఫిర్యాదులో ప్రశాంతి, మరో ఐదుగురు తనను హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైజర్స్ మ్యాచ్ చూడకుండా అడ్డుకున్నారని, తనను దూషించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

    వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు

    వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు

    అతడి నుంచి కంప్లయింట్ అందుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 341, 188, 506 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.యాంకర్ చింతల ప్రశాంతి (32), కందూరి పూర్ణిమ (27), కె.ప్రియ (23), లక్కపల్లి సురేష్‌ (28), వంటేరు శ్రీకాంత్‌రెడ్డి (48), గుర్రం వేణుగోపాల్‌ (38)పై పోలీసులు కేసు నమోదు చేశారు.

    మద్యం మత్తులో ఇతరులకు ఇబ్బంది కలిగేలా

    మద్యం మత్తులో ఇతరులకు ఇబ్బంది కలిగేలా

    మ్యాచ్ చూసేందుకు వెళ్లిన వారు అరవడం, గోల చేయడం మామూలే. అయితే ప్రశాంతి అండ్ గ్యాంగ్ శృతి మించి ప్రవర్తించారని, పక్కవారికి ఇబ్బంది కలిగేలా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరు మద్యం సేవించి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    సీసీ టీవీ పుటేజీ స్వాధీనం

    ప్రశాంతి అండ్ గ్యాంగ్ మీద ఫిర్యాదు రావడంతో పోలీసులు ఉప్పల్ స్టేడియంలోని సీసీ టీవీ పుటేజీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పుటేజీ పరిశీలించిన అనంతరం వారు ప్రశాంతి అండ్ గ్యాంగ్ మీద తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

    విస్తుపోతున్న జనం

    విస్తుపోతున్న జనం

    ప్రశాంతి అండ్ గ్యాంగ్ చేసిన రాద్దాంతం కేవలం లోకల్ మీడియాలోనే కాదు... జాతీయ మీడియాలో కూడా చర్చనీయాంశం అయింది. బాధ్యతగా ఉండాల్సిన వారు ఇలా హద్దులు మీరి ప్రవర్తించిన విషయం తెలిసి అంతా విస్తుపోతున్నారు.

    English summary
    Telugu TV actor Prashanthi and five others were booked for creating nuisance and obstructing a person from watching IPL match at Uppal stadium here on Sunday, said police.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X