»   » వ్యభిచారంచేస్తూ పట్టుబడ్డ తెలుగు నటి: ఆగని చీకటి దందా

వ్యభిచారంచేస్తూ పట్టుబడ్డ తెలుగు నటి: ఆగని చీకటి దందా

Posted By:
Subscribe to Filmibeat Telugu
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ తెలుగు నటి !

సాధారణ ప్రజలకు, బయటి ప్రపంచానికి వ్యభిచారం అనేది ఓ పెద్ద తప్పులా కనిపిస్తున్నా....సినిమా రంగంలో మాత్రం ఇది కామన్ అయి పోయింది. తరచూ సినీరంగానికి చెందిన పలువురు అరెస్టు అవుతున్నా ఆ తప్పుడు దారి పడుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అందమైన రంగుల ప్రపంచంలా కనిపించే సినిమా రంగం చూడటానికి ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటుంది.

అయితే ప్రతి రంగంలోనూ ఉన్నట్లే సినిమా రంగంలోనూ ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. సినిమాల్లో సరైన అవకాశాలు లేక బతుకు బండి సాగించేందుకు కొందరు, జల్సా జీవితానికి అలవాటు పడి ఈజీ మనీ కోసం మరికొందరు కారణాలు ఏమైనా కానివ్వండి....పలువురు తారలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సినిమా ఇండస్ట్రీ కీర్తిని మసకబారేలా చేస్తోంది.

Telugu TV Actress Arrested In Prostitution Case

ఆన్‌లైన్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ బుల్లితెర నటి పోలీసులకు బుధవారం పట్టుబడింది. ఆన్లైన్ వేదికగా వ్యభిచారం దందా సాగిస్తున్న తెలుగు నటిని హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ లు అరెస్ట్ చేశారు. తెలుగులో బుల్లి తెరపై ఆమె ప్రముఖ నటిగా రాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీస్ లు కేసు వివరాలని అందించారు.

కృష్ణానగర్‌కు చెందిన సోయల్‌, రెడ్డి నరేష్ నాయుడు ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఓ విటుడు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోగా బుల్లితెర నటిని ఉప్పల్‌ ప్రశాంత్‌నగర్‌కు పంపించారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు ప్రశాంత్‌నగర్‌ రోడ్డులో విటుడి కోసం వేచి చూస్తున్న నటితో పాటు రెడ్డి నరేష్ నాయుడును అదుపులోకి తీసుకుని ఉప్పల్‌ పోలీసులకు అప్పగించారు.

English summary
Three persons, including a TV serial actress, were arrested by the police for running an online prostitution racket from Boduppal in the outskirts of Hyderabad this morning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu