నటి ఝాన్సీ ఆత్మహత్య: డైరీలో కీలక విషయాలు, పోలీసుల అదుపులో ప్రియుడు
'పవిత్ర బంధం' సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. ఝాన్సీ ఆత్మహత్యకు కారణం సూర్య అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆమె ప్రియుడు సూర్యను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు చెబుతున్న విషయాలను బట్టి సూర్య వేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు వారు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో వైపు ఝాన్సీ ఇంట్లో దొరికిన కొన్ని ఆధారాలు కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

డైరీలో ప్రియుడి గురించి ఝాన్సీ
ఇప్పటికే ఝాన్సీ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో తన ప్రియుడితో జరిపిన వాట్సాప్ సందేశాలను గుర్తించారు. తాజాగా ఆమె ఇంటి నుంచి ఓ డైరీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రియుడు సూర్యతో తన బంధం గురించి ఆమె రాసుకున్నారు.

సంవత్సర కాలంగా ప్రేమాయణం
ఇద్దరి మధ్య దాదాపు సంవత్సర కాలంగా ప్రేమాయణం నడుస్తోందని, అయితే కొంతకాలంగా విబేధాలు వచ్చిన గొడవలు పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు పోలీసులు తేల్చారు.

ఆమె నటించడం సూర్యకు ఇష్టం లేదు
ఝాన్సీకి నటించడం అంటే ఇష్టం. అయితే ఆమె నటించడం సూర్యకు ఇష్టం లేదు. తాను వద్దన్నా సీరియల్స్, సినిమా అవకాశాల కోసం ఝాన్సీ ప్రయత్నిస్తుండటాన్ని సూర్య సహించలేక పోయాడని, ఈ క్రమంలోనే వీరి మధ్య గొడవలు మొదలైనట్లు సమాచారం.

ఝాన్సీపై సూర్య ఆరోపణలు
ఇటీవల ఓ టీవీ ఛానల్‌తో సూర్య ఫోన్‌లో మాట్లాడుతూ... పలు సంచలన ఆరోపణలు చేశారు. తనకంటే ముందు ఇద్దరు ముగ్గురిని ఝాన్సీ ప్రేమించిందని, సినిమా రంగానికి చెందిన బ్రోకర్లతో ఆమెకు ఏవో గొడవలు ఉన్నాయని ఆరోపించారు. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











