వ్యభిచారం కేసులో తెలుగు టీవీ సీరియల్ నటి,నిర్మాత అరెస్టు

By Srikanya

Telugu TV Artist Arrested in Prostitution Case Hyderabad
హైదరాబాద్ : సినిమా మోజు మరికొందరిని మోసం చేసింది. సినిమాల్లో హీరోయిన్ వేషాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఓ నిర్మాత యువతులతో వ్యభిచారం చేయిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చి అందరినీ షాక్ చేసింది. సదరు నిర్మాత కార్యాలయంపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు దాడి చేశారు. ఆఫీస్ మేనేజర్‌తో పాటు ఓ బుల్లితెర నటి, మరో యువతి పోలీసులకు చిక్కారు.

ఇన్‌స్పెక్టర్ పి. మురళీకృష్ణ కథనం ప్రకారం... విజయవాడకు చెందిన రాజు అలియాస్ రాజేష్ నిర్మాత అవతారమెత్తి శ్రీనగర్‌కాలనీ సమీపంలోని ప్రగతినగర్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. శ్రీవెంకటకృష్ణ ఫిలిమ్స్ పేరిట కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. తాము నిర్మించే సినిమాలో హీరోయిన్ వేషం కోసం అందమైన అమ్మాయి కావాలని ఏడాది కాలంగా ప్రకటనలు ఇస్తున్నాడు.

ఈ ప్రకటనకు ఆకర్షితులై తన కార్యాలయానికి వచ్చిన వారితో కోరిక తీరిస్తేనే హీరోయిన్ వేషం దొరుకుతుందని మభ్యపెట్టి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడు. ఇదే విధంగా బుల్లితెర నటి పుష్పాంజలి (22) ఇతని ఉచ్చులోపడి వ్యభిచారిణిగా మారింది. స్వప్న (24) అనే మరో యువతి కూడా వేషం కోసం వచ్చి వ్యభిచార గృహంలో మగ్గుతోంది.

రాజేష్ వ్యవహారంపై సమాచారం అందుకున్న పో లీసులు ఆదివారం అతని కార్యాలయంపై మెరుపుదాడి చేశారు. పుష్పాంజలితో పాటు స్వప్న, విటుడు పవన్‌కుమార్, కార్యాలయం మేనేజర్ లోకేష్ పోలీసులకు చిక్కగా.. నిర్మాత రాజేష్ పరారయ్యాడు. ఏడాది కాలంగా సుమారు 25 మంది యువతులను రాజేష్ వ్యభిచార కూపంలోకి లాగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X