దేవత సీరియల్ నటిపై కౌన్సిల్ సీరియస్.. వదినమ్మ నటుడిపై ఈటీవీ ప్రభాకర్ వేటు.. బుల్లితెరపై మరో వివాదం

టెలివిజన్ రంగంలో మరో కొత్త వివాదం చర్చనీయాంశంగా మారింది. వదినమ్మ సీరియల్ నటుడిపై అలాగే దేవత సీరియల్ నటిపై ఒకేసారి చర్యలు తీసుకున్నారు. అనుకున్న కమిట్మెంట్ ప్రకారం వర్క్ చేయకపోతే అలాగే క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవని తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మరోసారి ఈ ఘటనతో చెప్పకనే చెప్పింది. సాఫీగా కొనసాగుతున్న దేవత సీరియల్ లో నటి కుమారి వైష్ణవిపై ఆర్బిట్రేషన్ కమిటీ చర్చించి చర్యలు తీసుకున్నారు. నటి కుమారి వైష్ణవి గారిని ఏ నిర్మాత కూడ తమ సీరియల్స్ మరియు ప్రోగ్రామ్స్ లలో తీసుకోకూడదని తేల్చి చెప్పారు. అలాగే వదినమ్మ " సీరియల్ లో నటిస్తున్న నటుడు శ్రీ రాజేష్ గారిపై చేసిన ఫిర్యాదు పై ఆర్బిట్రేషన్ కమిటీ చర్చించి చర్యలు తీసుకున్నారు.

దేవత సీరియల్ నటిపై సీరియస్

దేవత సీరియల్ నటిపై సీరియస్

వివరాల్లోకి వెళితే.. కౌన్సిల్ సభ్యుడు శ్రీ గుత్త వేంకటేశ్వర రావు గారు స్టార్ మా టీవి కొరకు నిర్మిస్తున్న " దేవత " సీరియల్ లో నటిస్తున్న నటి కుమారి వైష్ణవి గారిపై చేసిన ఫిర్యాదు పై ఆర్బిట్రేషన్ కమిటీ చర్చించి సదరు నిర్మాతను అలాగే నటిని తేదీ .06.12.2021 రోజున పిలిపించి విచారించడం జరిగింది. ఇక నటి కుమారి వైష్ణవి గారు ప్రస్తుతం తను నటించి మానేస్తున్న దేవత సీరియల్ ప్రసారం అవుతున్నంత కాలం నేను ఏసీరియల్ లోను నటించనని ఏవిధమైన టీవి కార్యక్రమాలలో పాల్గోననని ముందుగా వివరణ ఇచ్చారు.

 ఆమెను ఏ సీరియల్స్ లో తీసుకోవద్దు

ఆమెను ఏ సీరియల్స్ లో తీసుకోవద్దు

ఒక వేల రాబోయే కాలంలో లో అలాంటి పరిస్థితి నాకువస్తే " దేవత " సీరియల్ నిర్మాతకు నష్టపరిహారం చెల్లించగలనని వ్రాతపూర్వకంగా తెలిపారు. ఇక అనుకున్నట్లే పొరపాటు చేయడంతో దేవత సీరియల్ ప్రసారం అవుతున్నంత కాలం, నటి కుమారి వైష్ణవి గారిని ఏ నిర్మాత కూడ తమ సీరియల్స్ మరియు ప్రోగ్రామ్స్ లలో తీసుకోకూడదని ఆర్బిట్రేషన్ కమిటీ నిర్ణయించింది. ఇక ఈ నిర్ణయాన్ని నిర్మాతలు అందరూ తప్పక అనుసరించవలసిందిగా కోరుచున్నట్లు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు వివరణ ఇచ్చారు.

 నటుడిపై వేటు

నటుడిపై వేటు

ఇక వదినమ్మ సీరియల్ నటుడిపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కౌన్సిల్ సభ్యుడు శ్రీ పి.ప్రభాకర్ గారు స్టార్ మా టీవి కొరకు నిర్మిస్తున్న వదినమ్మ సీరియల్ లో నటిస్తున్న నటుడు శ్రీ రాజేష్ గారిపై చేసిన ఫిర్యాదు పై ఆర్బిట్రేషన్ కమిటీ చర్చించారు. ఇక సదరు నిర్మాతను నటుణ్ణి తేది .06.12.2021 రోజున పిలిపించి విచారించగా నటుడు శ్రీ రాజేష్ గారి అసమంజసమైన వివరణ, ప్రవర్తనల కారణంగా అతనిని ఈ రోజు నుండి తేది .31.12.2022 వరకు ఏ నిర్మాత కూడ తమ సీరియల్స్ మరియు ప్రోగ్రామ్స్ లలో తీసుకోకూడదని వివరణ ఇచ్చారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 రీప్లేస్ చేసుకోవల్సిందే..

రీప్లేస్ చేసుకోవల్సిందే..

అతనికి సహాయ నిరాకరణ చేయవలసిందిగా ఆర్బిట్రేషన్ కమిటీ నిర్ణయించడమైనది. ఇక ప్రస్తుతం అతనితో నటింపచేస్తున్న సీరియల్ నిర్మాతలు తేది .31.12.2021 రోజు లోపు ఆపాత్రకు గాను ఇతరులతో తప్పకుండా రీప్లేస్ చేసుకోవల్సిందిగా ఆర్బిట్రేషన్ కమిటీ నిర్ణయించడమైనది. ఈ నిర్ణయాన్ని నిర్మాతలు అందరూ తప్పక అనుసరించవలసిందిగా కోరుచున్నాము అంటూ టెలివిజన్ కౌన్సిల్ నిర్ణయించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X