twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ నటుడికి కరోనా.. షూటింగ్‌లు బంద్.. అంతా మూన్నాళ్ల ముచ్చటే!!

    |

    కరోనా మహమ్మరి రోజురోజుకూ తన ప్రతాపాన్ని పెంచుకుంటూ పోతోంది. అయితే కరోనా మన జీవితంలో ఓ భాగస్వామ్యం అయిందనుకుంటూ ఎవ్వరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. అయితే ఇదే అదును అనుకున్న కరోనా మాత్రం దావానంలా వ్యాప్తిచెందుతోంది. ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులు కూడా దీనికి అగ్నిలో ఆజ్యం పోసినట్టు తయారైంది. సినిమా, సీరియల్ షూటింగ్‌లకు ప్రభుత్వాలు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

    ప్రభుత్వాల నిబంధనలు..

    ప్రభుత్వాల నిబంధనలు..

    సినిమా రంగాన్ని ఆదుకునేందకు ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇచ్చాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సీరియల్, సినిమా షూటింగ్‌లను అతి తక్కువ మందితో నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీంతో గతవారం నుంచే షూటింగ్‌లు మొదలయ్యాయి.

    సీరియల్ పరిశ్రమ..

    సీరియల్ పరిశ్రమ..

    అందరి కంటే ముందుగా టీవీ ఇండస్ట్రీయే షూటింగ్‌లను ప్రారంభించింది. గత మూడు నెలలుగా జరిగిన కథను ప్రసారం చేస్తున్న చానెళ్లు కొత్త కథను ప్రారంభించేందుకు తహతహలాడాయి. అందుకే షూటింగ్‌లను శర వేగంగా ప్రారంభించి ఈ వారం నుంచే కొత్త ఎపిసోడ్‌లను ప్రారంభించాయి.

    దెబ్బకు షాక్..

    దెబ్బకు షాక్..

    అయితే తాజాగా సీరియల్ నటుడు ప్రభాకర్ కరోనా వచ్చిందనే వార్త అందర్నీ షాక్‌కు గురి చేసింది. జీ తెలుగులో ప్రసారం అయ్యే సూర్యకాంతం సీరియల్ సహా వేరొక సీరియల్ లోనూ ఆయన నటిస్తున్నారని తెలిసింది. దీంతో ఒక్క సారిగా బుల్లితెర లోకం ఉలిక్కి పడింది. తిరుపతి నుంచి హైదరాబాద్ కి వచ్చిన సదరు నటుడికి సెట్స్ లో జ్వరం కనిపించడం తో టెస్ట్ చేయించడంతో పాజిటివ్ అని తేలింది.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    షూటింగ్‌లు బంద్..

    షూటింగ్‌లు బంద్..

    ఎంతో సంబరంగా మొదలు పెట్టిన షూటింగ్‌లు బంద్ అయ్యాయి. అంతా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. నిర్మాతల తో మాట్లాడి ప్రస్తుతం ఆయా సీరియళ్ల షూటింగులు ఆపేయాలని టీవీ ఆర్టిస్టుల సంఘం డిమాండ్ చేస్తోందట. అందుకే పెద్ద సినిమాలు, పెద్ద హీరోలెవ్వరూ షూటింగ్‌ల జోలికి వెళ్లడం లేదు.

    English summary
    Telugu Tv Serial Actor Tested Corona Positive. Famous Tv Channel Serial Actor Goy Corona. all Shootinga Are Cancelled Due To Corona Case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X