టివి నటి ఝాన్సీ ఆత్మహత్య.. ప్రియుడితో సహజీవనం, విషాదానికి అసలు కారణం ఇదే!
బుల్లితెర యువ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. పవిత్రబంధం అనే సీరియల్ లో ఝాన్సీ నటించింది. మంగళవారం రాత్రి ఝాన్సీ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదానికి కారణం ఝాన్సీ ప్రేమ వ్యవహారమే అని పోలిసుల ప్రాధమిక విచారణలో జరిగింది. ఝాన్సీ మరణం గురించి పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఝాన్సీ మరణానికి దారితీసిన పరిస్థితులు సంచలనం రేపేవిగా ఉన్నాయి.

పవిత్రబంధం సీరియల్
ఝాన్సీ ఓ ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే పవిత్రబంధం సీరియల్ లో నటించింది. కొన్ని చిత్రాల్లో కూడా చిన్న పాత్రలు చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నటిగా కొనసాగుతోనే అమీర్ పేటలో ఝాన్సీ ఓ బ్యూటీ పార్లల్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఝాన్సీకి సూర్య అలియాజ్ నాని అనే వ్యక్తితో పరిచయం అయింది. పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సీరియల్స్ మానేసి
సూర్యతో ప్రేమలో పడ్డాక ఝాన్సీ సీరియల్స్ లో నటించడం కూడా మానేసిందట. గత కొన్ని రోజులుగా వీరి మధ్య సంబంధాలు సరిగా లేవని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రేమ, సహజీవనం విషయంలో ఝాన్సీని కుటుంబ సభ్యులు ఎంత హెచ్చరించినా పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులతో గొడవపడి కూడా అతడితో ప్రేమని కొనసాగిస్తూ వచ్చింది.

పెళ్లి చేసుకోవాలని
కొన్ని రోజుల క్రితం తనని పెళ్లి చేసుకోవాలని ఝాన్సీ సూర్యని కోరినట్లు తెలుస్తోంది. కానీ సూర్య పెళ్లి ప్రస్తవన ఎత్తకుండా తప్పించుకుంటున్నాడు. పెళ్లి విషయంలో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. విభేదాలు కాస్త తీవ్రంగా మారినట్లు తెలుస్తోంది. తరచుగా ఝాన్సీ నివాసానికి సూర్య వచ్చేవాడని అంటున్నారు. ఆమె తల్లితో ఝాన్సీని పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడట. ఇటీవల ఝాన్సీనే స్వయంగా పెళ్లి చేసుకోవాలని అడిగినా అతడు అంగీకరించలేదని, అప్పటి నుంచి ఝాన్సీ మనస్తాపంతో ఉందని కుటుంబ సభ్యులు ఒకరు తెలిపారు.

వాట్సాప్‌లో గొడవ
ఝాన్సీ ఆత్మహత్య చేసుకునే కొంత సమయం ముందు కూడా సూర్యతో వాట్సాప్ లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఝాన్సీ సోదరుడు ఆఫీస్ నుంచి తిరిగి రాగానే ఇంటి తలుపులు తెరుచుకోలేదు. దీనితో అదే అపార్ట్ మెంట్ లో ఉన్నవారి సాయంతో తప్పులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే ఝాన్సీ ఉరేసుకుని మరణించింది. ప్రస్తుతం సూర్య పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఝాన్సీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.


Click it and Unblock the Notifications











