నాపై అలాంటి వీడియోలు చేస్తారా అంటూ కౌంటర్ ఇచ్చిన దేవత సీరియల్ నటి.. తప్పు చేయలేదు అంటూ..

టెలివిజన్ రంగంలో ఇటీవల కొందరి నటీనటులపై తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ చర్యలు తీసుకున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. వదినమ్మ సీరియల్ నటుడిపై అలాగే దేవత సీరియల్ నటిపై ఒకేసారి చర్యలు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో కూడా అనేక రకాల కామెంట్స్ రావడంతో ఫైనల్ గా దేవత సీరియల్ నటి వైష్ణవి క్లారిటీ ఇచ్చారు. అనవసరంగా తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని జరిగింది ఒకటి అయితే జరగని విషయాలని చెబుతూ తప్పుగా కామెంట్స్ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

 దేవత నటిపై చర్యలు

దేవత నటిపై చర్యలు

ఇటీవల దేవత సీరియల్ లో నటి కుమారి వైష్ణవిపై ఆర్బిట్రేషన్ కమిటీ చర్చించి చర్యలు తీసుకున్నారని అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. వైష్ణవిని ఏ నిర్మాత కూడ తమ సీరియల్స్ మరియు ప్రోగ్రామ్స్ లలో తీసుకోకూడదని తేల్చి చెప్పారని టెలివిజన్ సీరియల్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

క్లారిటీ ఇచ్చిన వైష్ణవి

క్లారిటీ ఇచ్చిన వైష్ణవి

ఒక సీరియల్ చేస్తున్నప్పుడు మరొక సీరియల్ లో నటించవద్దనే ఒప్పందాన్ని అతిక్రమించినందుకు నటి వైష్ణవిపై వేటు వేసినట్లు కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇక ఇటీవల సోషల్ మీడియాలో అలాగే యూ ట్యూబ్ లో కూడా అలాంటి వార్తలు ఎక్కువగా రావడంతో నటి వైష్ణవి స్పందించక తప్పలేదు. అందులో ఉన్నవన్ని కూడా అబద్ధపు ప్రచారాలు అని ఆమె వివరణ ఇచ్చింది.

నేనే తప్పుకున్నాను

నేనే తప్పుకున్నాను

వైష్ణవి మాట్లాడుతూ.. రీసెంట్ గా నాపై కొన్ని కాంట్రవర్సి వీడియోలు చూడడం జరిగింది. దానిపై నేను రెస్పాండ్ అవ్వాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. దేవత సీరియల్ నుంచి సుందరి తీసేసారు అని అన్నారు. తీసేసారు అనేదానికి తప్పుకున్నారు అనేదానికి కూడా చాలా తేడా ఉంది. దేవత అనే సీరియల్ నుంచి సంధ్యా అనే పాత్ర నుంచి నేనే తప్పుకునున్నాను. నన్ను ఎవరు కూడా అందులో నుంచి తీసి వేయలేదు.. అని వైష్ణవి తెలిపింది.

ముఖ్యమైన విషయం ఏమిటంటే..

ముఖ్యమైన విషయం ఏమిటంటే..

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వైష్ణవిని మరొకసారి ఇలాంటి టీవీ షోలలో అలాగే సీరియల్స్ కూడా తీసుకోవద్దు అని ప్రొడ్యూసర్స్ నిర్ణయించినట్లుగా కూడా వార్తలను ప్రచారం చేస్తున్నారు. నిజానికి జరిగింది అది కాదు. నిజానికి నాకు ఈ ఇండస్ట్రీలోని వర్క్ చేయడానికి ఇష్టం లేదు. నేను పూర్తిగా అన్నిటి నుంచి దూరంగా వెళుతున్నాను అని చెప్పి బయటకు రావడం జరిగింది. నా అంతట నేను బయటకు రావడానికి వాళ్ళు నన్ను వద్దు అనుకోవడానికి చాలా తేడా ఉంది.. అని వైష్ణవి తెలిపారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
వెంటనే కరెక్ట్ చేసుకోండి..

వెంటనే కరెక్ట్ చేసుకోండి..

కరెక్ట్ గా ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా తెలిస్తే వీడియోలు పోస్ట్ చేయండి. నిజానిజాలు తెలియకుండా ఫేక్ వార్తలను అనవసరంగా పోస్ట్ చేయవద్దు. ఇది ఎవరైతే చేశారో వారందరికీ చెప్పడం జరుగుతుంది. దయచేసి మరొకసారి మీరు చేసిన కామెంట్స్ ను అలాగే చేసిన వీడియోలను కరెక్ట్ చేసుకోవాలి. నాపై ఇప్పటివరకు ఎలాంటి బ్యాన్ గాని విధించలేదు. తప్పు చేసిన వారిపై అలాంటి తరహా కఠిన చర్యలు తీసుకుంటారు. కానీ నేను నా అంతట నేనుగా బయటకు వచ్చేసాను. దయచేసి ఈ విషయంలో అబద్ధపు ప్రచారాలు చేయవద్దు అని వైష్ణవి వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X