TV Serials ratings: దేదీప్యంగా కార్తీకదీపం.. 24వవారంలో కూడా టాప్ టీఆర్పీ.. 2వ స్థానం దేనికంటే!
తెలుగు వినోదరంగంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ గురించి రేటింగ్స్ వెల్లడయ్యాయి. 24వ వారంలో కూడా కార్తీకదీపం మోస్ట్ వాంటెడ్ సీరియల్‌గా నిలిచింది. తాజా టీఆర్పీ ప్రకారం.. పలు టెలివిజన్ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే సీరియల్స్ రేటింగ్స్ ఇలా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

టాప్ 5 రేటింగ్ సీరియల్స్
ప్రస్తుత ఏడాదిలో 24వ వారం టాప్ రేటింగ్ సాధించిన సీరియల్స్‌లో కార్తీక దీపం అత్యధిక రేటింగుతో ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఆ తర్వాత 2వ స్థానంలో ఇంటింటి గృహలక్ష్మి ఉండగా, 3వ స్థానంలో గుప్పెడంత మనసు నిలిచింది. ఇక 4వ స్థానంలో జానకీ కలగనలేదు, 5వ స్థానంలో దేవత సీరియల్ టాప్ రేటింగును సొంతం చేసుకొన్నది.

స్టార్ మాలో
తెలుగు బుల్లితెర మీద అత్యధిక రేటింగుతో సీరియల్స్‌ను ప్రసారం చేస్తున్న స్థానంలో స్టార్ మా ఛానెల్ టాప్‌లో ఉంది. స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం 24వ వారంలో కూడా అర్బన్‌లో 17.28 రేటింగ్‌తో, రూరల్‌లో 17.67 రేటింగుతో ఎన్నో నెలలుగా టాప్‌గా నిలిచింది. ఇక ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ అర్బన్ 12.70, రూరల్‌లో 12.62, గుప్పెడంత మనసు అర్బన్‌లో 11.47, రూరల్‌లో 11.83, జానకి కలగనలేదు సీరియల్ అర్బన్‌లో 9.13, రూరల్‌లో 8.69, దేవత సీరియల్ అర్బన్‌లో 8.83, రూరల్‌లో 8.30, రేటింగుతో దూసుకుపోతున్నాయి.

జీ తెలుగు ఛానెల్‌లో
జీ తెలుగులో విషయానికి వస్తే.. ఈ ఛానెల్‌లో త్రినయని సీరియల్ అత్యధికంగా అర్బన్ ఏరియాలో 7.27, రూరల్‌లో 9.16 రేటింగ్‌తో టాప్‌గా నిలిచింది. 2వ స్థానంలో నం 1 కోడలు 6.39 అర్బన్‌లో, 7.95 రేటింగ్ రూరల్ ప్రాంతంలో సాధించింది. ప్రేమ ఎంత మధురం అర్బన్‌లో 5.97, రూరల్‌లో 8.16, రాధమ్మ కూతురు సీరియల్ అర్బన్‌లో 6.49, రూరల్‌లో 8.18, నాగభైరవి సీరియల్ అర్బన్‌లో 5.57, రూరల్‌లో 7.75 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నాయి.

ఈటీవీ ఛానెల్‌లో
ఈటీవీలో ప్రసారం అవుతున్న సీరియల్స్ ఎలాంటి పోటీ ఇచ్చినట్టు కనిపించడం లేదు. శ్రీమంతుడు సీరియల్‌లో అర్బన్‌లో 2.68, రూరల్‌లో 3.60, అత్తారింటికి దారేది సీరియల్ అర్బన్‌లో 2.71, రూరల్‌లో 3.34, ఎస్‌వీఎస్‌సీ అర్బన్‌లో 2.40, రూరల్‌లో 3.27 రేటింగ్‌తో కొనసాగుతున్నాయి.

జెమినీ ఛానెల్‌లో
జెమినీ టెలివిజన్‌లో రేటింగు విషయంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినట్టు కనిపించింది. ఒక సమయంలో రేటింగులో టాప్ స్థానంలో ఉండే ఈ ఛానెల్‌లో సీరియల్స్ ప్రభావం చూపలేకపోతున్నాయనేది తాజా టీఆర్పీ జాబితాతో స్పష్టమైంది. చదరంగం అర్బన్‌లో 1.83, రూరల్‌లో 3.06 సాధించగా, మట్టిగాజులు సీరియల్ అర్బన్‌లో 1.87, రూరల్లో 2.89, అంతులేని కథ అర్బన్‌లో1.60, రూరల్‌లో 2.38 రేటింగును, అల వైకుంఠపురంలో అర్బన్‌లో 1.83, రూరల్‌లో 2.88 రేటింగును సాధించింది.


Click it and Unblock the Notifications











