TV Serials TRP's రేటింగ్‌లో దిగజారిన కార్తీకదీపం..టాప్ సీరియల్స్ పరిస్థితి అంతే.. కారణం ఏమిటంటే!
తెలుగు బుల్లితెరపై డైలీ సీరియల్స్ తమదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చాలూ ఎలాంటి సీరియల్‌నైనా అక్కున చేర్చుకొంటామని తాజా రేటింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఎప్పటి లానే కార్తీక దీపం మొదటిస్థానంలో నిలిస్తే.. ఇంటింటి గృహలక్ష్మి రెండోస్థానాన్ని నిలబెట్టుకొన్నది. ఇక 25వ వారంలో ఏ సీరియల్ పరిస్థితి ఎలా ఉందంటే...

తెలుగు బుల్లితెరపై టాప్ 5 సీరియల్స్
ఇక టాప్ 5 సీరియల్స్ విషయానికి వస్తే.. ఎప్పటి మాదిరిగానే కార్తీకదీపం (16.99) టాప్ 1 స్థానంలో, ఇంటింటి గృహలక్ష్మి (11.67) టాప్ రెండో స్థానంలో మూడోస్థానంలో గుప్పెడెంత మనసు అర్బన్‌లో 10.88, రూరల్‌లో 11.35, ఇక 4వ స్థానంలో జానకి కలగనలేదు అర్బన్‌లో 8.88, రూరల్‌లో 8.56, 5వ స్థానంలో దేవత సీరియల్ అర్బన్‌లో 8.44, రూరల్‌లో 7.82 రేటింగ్ సొంతం చేసుకొన్నది.

స్టార్ మా ఆధిపత్యం
ఇక సీరియల్స్‌లో దాదాపు ఎక్కువ రేటింగ్ ఉన్న సీరియల్స్ అన్నీ స్టార్ మా ఛానెల్‌లో ఉండటం గమనార్హం. స్టార్ మాలో కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మి, గుప్పెడు మనసు, జానకి కలగనలేదు, దేవత, వదినమ్మ లాంటి సీరియల్స్ స్టార్ మా ప్రసారం చేస్తే.. త్రినయని, నం. 1 కోడలు, ప్రేమ ఎంత మధురం, నాగభైరవి, రాధమ్మ కూతురు లాంటి సీరియల్స్ జెమినీలో ప్రసారం అవుతున్నాయి.

దిగజారిన కార్తీకదీపం
కార్తీకదీపం సీరియల్‌కు గత కొద్దికాలంగా ఎదురే లేకుండా పోయింది. వారవారానికి టాప్ లేపుకొంటూ సాగిన ఈ సీరియల్‌కు 25వ వారంలో కాస్త బ్రేక్ పడింది. 24వ వారంలో కార్తీక దీపం సీరియల్ అర్బన్‌లో 17.28 రేటింగ్‌తో, రూరల్‌లో 17.67 రేటింగ్ సాధించింది. అయితే 25వ వారం అంటే ప్రస్తుతం వారం అర్బన్‌లో 16.99, రూరల్‌లో 16.20 రేటింగ్ సొంతం చేసుకొన్నది. గతవారంతో పోల్చితే రేటింగ్ విషయంలో కాస్త దిగజారింది.

మిగితా సీరియల్స్ పరిస్థితి కూడా అంతే..
గత కొద్ది వారాలుగా టాప్ 2 స్థానంలో కొనసాగుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ పరిస్థితి కూడా అదే మాదిరిగా ఉంది. గత వారం అర్బన్‌లో 12.70, రూరల్‌లో 12.62 రేటింగ్‌ను నమోదు చేసుకొంటే.. 25వ వారంలో 11.67 (అర్బన్), 11.19 (రూరల్) రేటింగును సొంతం చేసుకొన్నది. అయితే లాక్‌డౌన్, కర్ఫ్యూ ముగియడం, అలాగే సీరియల్ సాగదీసినట్టు ఉండటం రేటింగ్ కాస్త దిగజారడానికి కారణమని చెబుతున్నారు.

స్టార్ మా ఛానెల్‌కు టాప్ రేటింగ్
తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ మా ఛానెల్ అధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నది. స్టార్ మా అర్భన్‌లో 920 పాయింట్లతో, రూరల్‌లో 883 పాయింట్లతో స్ట్రాంగ్‌గా దూసుకెళ్తున్నది. జీ తెలుగు అర్బన్‌లో 770 పాయింట్లతో, రూరల్‌లో 556 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈటీవీ తెలుగు 578 పాయింట్లు, జెమినీ 452 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











