Telugu TV Serials Ratings: సరైనోడుకు షాకింగ్‌గా టీఆర్పీ.. దుమ్మురేపిన కార్తీకదీపం.. శ్రీముఖి షోకు టాప్ రేటింగ్
తెలుగు వినోద పరిశ్రమలో థియేటర్లు సరిగా తెరుచుకోలేక వెండితెర మూగబోతుంటే.. లాక్‌డౌన్ సమయంలో కూడా బుల్లితెర బ్రహ్మండంగా రాణిస్తున్నాయి. పలు ఛానెల్స్‌లో సీరియల్స్ టాప్ ర్యాంకింగ్ సాధిస్తున్నాయి. కొన్ని సీరియల్స్ రికార్డు టీఆర్పీ సాధిస్తుంటే.. మరికొన్ని సీరియల్స్ కంటెంట్‌ను బలోపేతం చేస్తు ర్యాంకింగులను మెరుగుపరుచుకొంటున్నాయి. ఇక టెలివిజన్‌లో పలు సినిమాలు, షోలు మంచి రేటింగ్‌ను సాధిస్తున్నాయి. తాజాగా 30 వారం టెలివిజన్ సీరియల్ రేటింగ్ ఇలా ఉన్నాయి.

జీ తెలుగు ఛానెల్స్‌లో సీరియల్స్
జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం అవుతున్న సీరియల్స్ కొంత మెరుగైన ర్యాంకింగ్‌ను సొంతం చేసుకొంటున్నట్టు స్పష్టమైంది. ఈ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ 30వ వారంలో ఆర్బన్ ప్రాంతంలో 7.15, రూరల్ ప్రాంతంలో 8.65 నమోదు చేసుకొన్నది.
ఇంకా ప్రేమ ఎంత మధురం అర్బన్‌లో 6.19, రూరల్‌లో 7.91 రేటింగ్, అలాగే నం 1 కోడలు అర్బన్‌లో 6.11, రూరల్‌లో 7.48, రాధమ్మ కూతురు అర్బన్‌లో 6.24, రూరల్‌లో 7.61, ప్రేమ ఎంత మధురం అర్బన్‌లో 6.19, రూరల్‌లో 7.91 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది.

టాప్ రేంజ్‌లో స్టార్ మా
ఇక స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న సీరియల్స్ రికార్డు స్థాయిలో రేటింగ్‌ను నమోదు చేస్తున్నాయి. కార్తీక దీపం సీరియల్ ఎప్పటిలానే టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్నది. కార్తీకదీపం సీరియల్ 29వ వారం కంటే 30వ వారం మెరుగైన టీఆర్సీని నమోదు చేసింది. కార్తీక దీపం (17.68 (అర్బన్), 17.03 (రూరల్)), గృహలక్ష్మీ సీరియల్ (14.38 (అర్బన్), 13.65 (రూరల్)), దేవత (11.79 (అర్బన్), 10.052 (రూరల్)), గుప్పెడంత మనసు (11.15 (అర్బన్), 10.94 (రూరల్)), జానకి కలగనలేదు (10.39 (అర్బన్), 9.10 (రూరల్)) టీఆర్పీ నమోదు అయ్యాయి.

ఈటీవీ తెలుగులో సీరియల్స్ పరిస్థితి..
ఇక ఈటీవీ తెలుగులో సీరియల్స్ ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి. 30వ వారంలో చాలా సీరియల్స్ 5 రేటింగ్‌కు అటు ఇటుగా నమోదు అయ్యాయి. మనసు మమత (5.32 (అర్బన్), 4.29 (రూరల్)), యమలీల (5.44 (అర్బన్), 4.63 (రూరల్)), నా పేరు మీనాక్షి (5.63 (అర్బన్), 4.74 (రూరల్)) మాత్రమే ఓ మోస్తారు రేటింగ్‌ను సాధించాయి.

ఆకట్టుకొలేకపోతున్న జెమినీ ధారావాహికలు
ఇక జెమినీ తెలుగు ఛానెల్ విషయానికి వస్తే.. 30వ వారంలో మమతల కోవెల, భాగ్యరేఖ, అమ్మ కోసం, అలా వైకుంఠపురంలో అంతులేని కథ, మట్టిగాజులు సీరియల్స్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకొలేకపోతున్నాయనే విషయం తాజా రేటింగ్స్‌లో స్పష్టమైంది.

ఓవరాల్‌గా టాప్ 7 సీరియల్స్..
ఇక ఓవరాల్‌గా అన్ని ఛానెల్స్‌లో సీరియల్స్ టాప్ రేటింగ్స్ ఇలా ఉన్నాయి.
1. కార్తీక దీపం (17.68 (అర్బన్),
2. గృహలక్ష్మీ (14.38 (అర్బన్), 13.65 (రూరల్))
3. దేవత (11.79 (అర్బన్), 10.052 (రూరల్))
4. గుప్పెడంత మనసు (11.15 (అర్బన్)
5. జానకి కలగనలేదు (10.39 (అర్బన్), 9.10 (రూరల్))
6. త్రినయని (7.15 (అర్బన్), 8.65 (రూరల్))
7. ప్రేమ ఎంత మధురం (6.19 (అర్బన్), 7.91 (రూరల్))
Recommended Video

సరైనోడు, స్టార్ మా పరివార్ ఛాంపియన్ ఈవెంట్‌కు
ఇక టీవీ ఛానెల్స్‌లో ప్రసారం అవుతున్న సినిమాలు, షోల రేటింగ్స్ విషయానికి వస్తే. . ఆది భగవాన్ చిత్రానికి ( 1.20 అర్బన్‌లో, 1.76 రూరల్), సరైనోడు చిత్రానికి ( 4.22 అర్బన్‌లో 4.96 రూరల్) రేటింగ్‌ను నమోదు చేసుకొన్నాయి. ఇక జీ తెలుగులో ప్రసారమైన ఆషాడంలో అత్తా కోడలు ఈవెంట్‌కు ( 4.51 అర్బన్‌లో 5.47 రూరల్)), స్టార్ మా పరివార్ ఛాంపియన్ షిప్‌కు ( 9.23 అర్బన్‌లో, 10.39 రూరల్)) రేటింగ్‌ను నమోదు చేసింది. శ్రీముఖి, ముక్కు అవినాష్ హోస్టులుగా వ్యవహరించిన స్టార్ మా పరివార్ ఛాంపియన్ ఈవెంట్ భారీ రేటింగ్ రాబట్టడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











