Telugu TV Serials TRP Ratings: కార్తీకదీపం సరికొత్త రికార్డు.. ఈ వారం రేటింగ్ ఎంతో తెలుసా?

తెలుగు టెలివిజన్ రంగంలో సీరియల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయనే విషయం ప్రస్తుత వారానికి ప్రకటించిన రేటింగ్స్‌లో స్పష్టమైంది. 2021లో 28 వారంలో కూడా కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్స్‌ను అత్యధికంగా ప్రేక్షకులను వీక్షించారనే విషయం స్పష్టమైంది. 28 వారంలో తెలుగు టెలివిజన్ ఛానెల్స్ వాటి సీరియల్స్ రేటింగ్ ఇలా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

జీ తెలుగు సీరియల్స్‌ గురించి

జీ తెలుగు సీరియల్స్‌ గురించి

జీ తెలుగు టెలివిజన్ ప్రసారం అవుతున్న సీరియల్స్‌కు సంబంధించిన 28వ వారం రేటింగ్ విషయానికి వస్తే.. ఈ వారం కూడా స్టడీగా రేటింగ్‌ను సాధించాయి. జీ తెలుగులో త్రినయని టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్నది. ఈ సీరియల్ అర్బన్‌లో 8.23 రేటింగ్.. రూరల్‌లో 9.58 రేటింగ్ సాధించింది. ఆ తర్వాత ప్రేమ ఎంత మధురం అర్బన్‌లో 6.82, రూరల్‌లో 9.19 రేటింగ్ సొంతం చేసుకొన్నది. ఇక నంబర్ 1 కోడలు అర్భన్‌లో 7.15 రేటింగ్, రూరల్‌లో 8.16, రాధమ్మ కూతురు సీరియల్ అర్బన్‌లో 6.79, రూరల్‌లో 7.95, కళ్యాణ వైభోగం అర్బన్‌లో 5.22, రూరల్‌లో 6.78 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది.

జెమినీలో సీరియల్స్ రేటింగ్స్ దారుణంగా

జెమినీలో సీరియల్స్ రేటింగ్స్ దారుణంగా


ఇక జెమినీలో ప్రసారం అవుతున్న సీరియల్స్ పెద్దగా ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోతున్నాయనే విషయం స్పష్టమవుతున్నది. తాజా రేటింగ్ చాలా దారుణంగా ఉండటంతో ప్రధాన ఛానెల్స్‌ ప్రసారమయ్యే సీరియల్స్‌కు పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. జెమినీలో అల వైకుంఠపురంలో, తాళి, మట్టి గాజులు, చదరంగం లాంటి సీరియల్స్ ప్రసారమవుతుండగా.. అవి కనీసం 4 రేటింగ్‌ను సాధించలేకపోయాయని 28వ వారంలో స్పష్టమైంది.

ఈటీవీ తెలుగులో

ఈటీవీ తెలుగులో

గతంలో తెలుగు ప్రేక్షకులకు టాప్ సీరియల్స్ అందించిన చరిత్ర ఉన్న ఈటీవీ తెలుగు ఇటీవల కాలంలో దారుణంగా వెనుకబడిపోయింది. ఇటీవల కాలంలో తమ సీరియల్స్‌కు సంబంధించిన రేటింగ్స్‌ను మెరుగు పడే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నదనే విషయం 28వ వారం రేటింగ్స్‌లో స్పష్టమైంది. ఇతర టెలివిజన్ రేటింగ్స్‌తో పోల్చుకొంటే 4 రేటింగ్‌ను కూడా దాటకపోవడం గమనార్హం.

స్టార్ మా టాప్ గేర్‌లో

స్టార్ మా టాప్ గేర్‌లో

ఇదిలా ఉంటే.. సీరియల్స్ విభాగంలో స్టార్ మా తెలుగు టాప్ రేటింగ్‌తో అన్ని ఛానెల్స్‌కు అందనంత దూరంలో ఉంది. ఎప్పటిలానే కార్తీక్ దీపం టాప్ రేటింగ్‌తో కొనసాగుతూ సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇటీవల కాలంలో ఏ సీరియల్ సాధించినంతగా కార్తీక్ దీపం అర్భన్‌లో 18.06 రేటింగ్, రూరల్‌లో 17.75 రేటింగ్‌ను సాధించింది. ఇటీవల కాలంలో ఇదే అత్యధిక రికార్డుగా చెప్పుకొంటున్నారు.

ఆ తర్వాత ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ అర్బన్‌లో 13.74 రేటింగ్, రూరల్‌లో 13.34 రేటింగ్ సాధించి రెండో స్థానంలో నిలిచింది. గుప్పెడంత మనసు అర్బన్‌లో 11.64, రేటింగ్, రూరల్ 11.88 రేటింగ్, దేవత సీరియల్ అర్బన్‌లో 9.55, రూరల్‌లో 8.69 రేటింగ్ సాధించింది. ఆ తర్వాత జానకి కలగనలేదు అర్బన్ ఏరియాలో 9.05, రూరల్ ఏరియాలో 8.45 రేటింగ్ సాధించింది.

తెలుగు టెలివిజన్‌లో టాప్ సీరియల్స్ ఇవే...

తెలుగు టెలివిజన్‌లో టాప్ సీరియల్స్ ఇవే...

తెలుగు ఛానెల్స్‌లో ప్రసారమయ్యే టీవీ సీరియల్స్ ఓవరాల్‌గా రేటింగ్ విషయానికి వస్తే.. టాప్ 1 స్థానంలో కార్తీక దీపం, టాప్ 2 స్థానంలో ఇంటింటి గృహలక్ష్మి, టాప్ 3 స్థానంలో గుప్పెడంత మనసు, టాప్ 4 స్థానంలో దేవత, టాప్ 5 స్థానంలో జానకి కలగనలేదు నిలిచాయి. టాప్ 6 స్థానంలో త్రినయని, టాప్ 7 స్థానంలో ప్రేమ ఎంత మధురం ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X