Telugu TV Serials TRP Ratings: ఆ రకంగా కార్తీకదీపం రేటింగ్ డౌన్.. అనూహ్యంగా గుప్పెడంత మనసు

తెలుగు టెలివిజన్ రంగంలో సీరియల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నాలుగైదు ప్రధాన ఛానెల్స్‌లో ప్రసారమయ్యే కుటుంబ ధారావాహికలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. తాజాగా ఈ ఏడాదికి సంబంధించి 39వ వారానికి రేటింగ్స్‌ను విడుదల చేసింది. ఈ రేటింగ్స్ ప్రకారం.. ఏ సీరియల్ ఏ పోజిషన్‌లో ఉందంటే.

 టాప్ 5 నుంచి 2వ స్థానానికి గుప్పెడంత మనసు

టాప్ 5 నుంచి 2వ స్థానానికి గుప్పెడంత మనసు

ప్రస్తుతం పలు ఛానెల్స్‌లో ప్రసారం అవుతున్న సీరియల్స్‌లో భారీగా రేటింగ్‌ను మెరుగుపరుచుకొన్న సీరియల్‌గా గుప్పెడంత మనసు నిలిచింది. గత కొద్దివారాలుగా మంచి కంటెంట్ ఉండటంతో వారం వారం తన రేటింగ్‌ను మెరుగుపరుచుకొంటూ వెళ్తున్నది. గుప్పెడంత మనసు 38వ వారంలో అర్బన్ ప్రాంతంలో 12.26 రేటింగ్‌ నమోదు చేసుకొంటే.. 39వ వారంలో 12.32 రేటింగ్ రిజిస్టర్ చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతానికి వస్తే.. 38వ వారంలో 12.31 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 13.53 రేటింగ్‌ను సాధించింది.

 39వ వారంలో జానకీ కలగనలేదు రేటింగ్‌

39వ వారంలో జానకీ కలగనలేదు రేటింగ్‌

ఇక ఇటీవల కాలంలో ప్రేక్షకులను మెప్పిస్తున్న సీరియల్ జానకి కలగనలేదు. ప్రతీ వారం ఈ సీరియల్ మెరుగైన రేటింగ్‌ను నమోదు చేసుకొంటున్నది. 38వ వారంలో ఈ సీరియల్ అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 8.26 రేటింగ్ నమోదు చేసింది. ఇక రూరల్ విషయానికి వస్తే.. 38వ వారంలో 8.07 రేటింగ్ నమోదు చేస్తే.. 39వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది.

39వ వారం కార్తీకదీపం రేటింగ్ ఇలా..

39వ వారం కార్తీకదీపం రేటింగ్ ఇలా..

కార్తీకదీపం సీరియల్‌ కొద్ది వారాలుగా మరింత సాగదీస్తున్నారనే విమర్శలకు బలం చేకూరేలా టెలివిజన్ రేటింగ్ క్రమంగా క్షీణించింది. 38వ వారంలో అర్బన్ ప్రాంతంలో 16.31 రేటింగ్ సొంతం చేసుకొంటే.. 39వ వారంలో అర్బన్ ప్రాంతంలో 14.95 రేటింగ్ సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో 38వ వారంలో 16.66 రేటింగ్ సాధించగా, 39వ వారంలో 16.08 రేటింగ్ నమోదు చేసుకోన్నది. గత కొద్దివారాలుగా క్రమేపీ క్షీణించడం కనిపిస్తున్నది.

 39వ వారం ఇంటింటి గృహలక్ష్మీ రేటింగ్

39వ వారం ఇంటింటి గృహలక్ష్మీ రేటింగ్

ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ విషయానికి వస్తే.. ప్రస్తుత వారం మెరుగైన రేటింగ్‌ను సాధించింది. అర్బన్ ప్రాంతంలో 38వ వారం 11.25 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 11.87 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో 38వ వారంలో 11.54 రేటింగ్ సొంతం చేసుకొంటే.. 39వ వారం12.53 రేటింగ్‌ను నమోదు చేయడం విశేషంగా పేర్కొనవచ్చు.

39వ వారంలో వదినమ్మ సీరియల్ రేటింగ్ ఇలా

39వ వారంలో వదినమ్మ సీరియల్ రేటింగ్ ఇలా

గతంలో టాప్ రేటింగ్ సొంతం చేసుకొన్న వదినమ్మ సీరియల్.. తన స్లాట్ టైమింగ్ మార్చడంతో రేటింగ్ పరంగా కిందకు జారింది. 38వ వారంలో అర్బన్ ప్రాంతంలో 38వ వారంలో 5.12 రేటింగ్ సొంతం చేసుకోగా, 39వ వారంలో 5.57 రేటింగ్ సాధించింది. ఇక రూరల్ ప్రాంతానికి వస్తే.. 38వ వారంలో 4.20 రేటింగ్‌ను సాధించగా, 39వ వారం 4.68 రేటింగ్‌ను సాధించింది.

టాప్ 10 సీరియల్స్ ఇవే

టాప్ 10 సీరియల్స్ ఇవే

తెలుగు టెలివిజన్ ఛానెల్స్‌కు సంబంధించి 39వ వారంలో టాప్ 10 సీరియల్స్ ఏమిటంటే?
1 కార్తీకదీపం
2. గుప్పెడంత మనసు
3. ఇంటింటి గృహలక్ష్మి
4. దేవత
5. జానకి కలగనలేదు
6. రాధమ్మ కూతురు
7. నంబర్ 1 కోడలు
8. త్రినయని
9. ప్రేమ ఎంత మధురం
10. కృష్ణ తులసి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X