Don't Miss!
- News
Vallabhaneni Vamsi : ఆ ఇద్దరు టీడీపీ నేతలపై వల్లభనేని వంశీ పరువునష్టం దావా ..
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్‌ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Telugu TV Serials TRP Ratings: దారుణంగా పడిపోయిన కార్తీకదీపం రేటింగ్.. అనూహ్యంగా గుప్పెడంత మనసు
సినిమా పరిశ్రమ సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. టీవీ ఛానెల్స్ లాక్‌డౌన్‌లో మంచి రేటింగ్ సాధించాయి. తాజాగా 40వ వారానికి సంబంధించిన రేటింగ్స్ వెల్లడయ్యాయి. ఎప్పటిలానే స్టార్ మా అగ్రస్థానంలో కొనసాగుతుండగా. ఆ ఛానెల్ ప్రసారం చేస్తున్న కార్తీకదీపం సీరియల్ టాప్ స్థానంలో ఉంది. కానీ కొద్ది వారాలుగా దారుణంగా రేటింగ్‌ను కోల్పోతు ఉంటుంది. 49వ వారానికి సంబంధించిన రేటింగ్ విషయంలోకి వెళితే..

జీ తెలుగు ఛానెల్‌లో
జీ తెలుగు టెలివిజన్‌లో రాధమ్మ కూతురు మెరగైన రేటింగ్‌తో కొనసాగుతున్నది. 40వ వారంలో ఈ సీరియల్ అర్బన్‌లో 7.22 రేటింగ్‌ను, రూరల్ ప్రాంతంలో 6.21 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. గతవారంతో పోల్చితే రేటింగ్ తగ్గినట్టు కనిపించింది. రాధమ్మ కూతురు తర్వాత నంబర్ 1 కోడలు టాప్ రేటింగ్‌తో నిలిచింది. నంబర్ 1 కోడలు సీరియల్ 40వ వారంలో 6.61 అర్బన్‌లో, రూరల్‌లో 5.63 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్ అర్బన్ ప్రాంతంలో 6.66, రూరల్‌లో 5.42 రేటింగ్ సొంతం చేసుకొన్నది.

ఈటీవీ తెలుగు ఛానెల్‌లో సీరియల్స్
ప్రస్తుత వారం అంటే.. 40వ వారంలో ఈటీవీ తెలుగులో ప్రసారమైన మనసు మమతకు మంచి రేటింగ్ లభించింది. ఈటీవీలో మనసు మమత అర్బన్‌లో 4.37 రేటింగ్, రూరల్‌లో 5.57 రేటింగ్ సంపాదించుకొన్నది. ఇక ఆ తర్వాత నా పేరు మీనాక్షి, అత్తారింటికి దారేది, రావోయి చందమామ సీరియల్స్ చాలా తక్కువ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నాయి.

జెమినీ టీవీలో సీరియల్స్ పరిస్థితి
ఇక పాపులర్ ఛానెల్ జెమినీ టీవీలో కూడా సీరియల్స్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకొన్నట్టు కనిపించలేదు. జెమినీలో ప్రసారమవుతున్న అల వైకుంఠపురంలో సీరియల్ ఓ మోస్తారు రేటింగ్ సొంతం చేసుకొన్నది. మట్టిగాజులు ఆతర్వాత తక్కువ రేటింగ్‌ను సాధించింది. అయితే గతంలో టాప్ సీరియల్స్ రేటింగ్‌తో రికార్డు సృష్టించిన ఈ ఛానెల్ ఇటీవల కాలంలో వెనుకపడింది.

దుమ్మురేపుతున్న స్టార్ మా ఛానెల్
బుల్లితెరపై సీరియల్స్ విషయానికి వస్తే.. స్టార్ మా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. కార్తీకదీపం సీరియల్ గతంలో టాప్ రేటింగ్ సాధించినప్పటికీ.. గత కొద్దివారాలుగా నసపెట్టే విధంగా, సాగదీత ఉండటం వల్ల రేటింగ్ దారుణంగా పడిపోతూ వస్తున్నది. 39వ వారం అర్బన్ ప్రాంతంలో 14.95 రేటింగ్ సాధిస్తే.. 40వ వారంలో 12.80 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. ఇక రూరల్ 39వ వారం ప్రాంతంలో 40వ వారంలో 14.52 రేటింగ్ సాధించింది.
అయితే గుప్పెడంత మనసు మాత్రం అనూహ్యంగా రేటింగ్ పెంచుకొంటున్నది. 39వ వారంలో 12.32 (అర్భన్), 40వ వారంలో 11.67 రేటింగ్ సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ విషయానికి వస్తే 39వ వారంలో 12.72, 40వ వారంలో 13.53 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ విషయానికి వస్తే.. 39వ వారంలో అర్బన్‌లో 11.87, 49వ వారంలో 10.89 రేటింగ్, ఇక రూరల్ విషయానికి వస్తే.. 39వ వారంలో 12.53, 49వ వారంలో 12.03 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత స్థానంలో దేవత కొనసాగుతున్నది.
Recommended Video

స్టార్ మా ఛానెల్‌కు టాప్ ర్యాంకింగ్
టెలివిజన్
ఛానెల్స్
రేటింగ్
విషయానికి
వస్తే..
అత్యధికంగా
స్టార్
మా
955
పాయింట్ల
రేటింగ్‌తో
టాప్
స్థానంలో
నిలిచింది.
ఆ
తర్వాత
జీ
తెలుగు
682
పాయింట్లతో
రెండోస్థానంలో
నిలిచింది.
ఈటీవీ
తెలుగు
459
పాయింట్లతో
మూడోస్థానంలో,
జెమినీ
397
పాయింట్లతో
నాలుగో
స్థానంలో
నిలిచింది.