టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న కార్తీక దీపం.. టెలివిజన్ రేటింగ్స్‌లో ఎదురే లేకుండా .. టాప్ 10 సీరియల్స్ ఇవే!

తెలుగు టెలివిజన్ రంగంలో డైలీ సీరియల్స్‌లో కార్తీకదీపం మరోసారి తన అధిపత్యాన్ని చాటుకొన్నది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ఇతర సీరియల్స్‌కు అందనంత దూరంలో రేటింగ్‌ను నమోదు చేసుకొంటున్నది. స్టార్ మాలో ప్రసారమవుతున్న అన్ని సీరియల్స్ టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. 23 వారానికి సంబంధించిన రేటింగ్స్ ఇలా ఉన్నాయి. తాజా రేటింగ్స్ వివరాల్లోకి వెళితే..

స్టార్ మా టెలివిజన్‌లో

స్టార్ మా టెలివిజన్‌లో

స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ 23వ వారంలో రూరల్‌లో 17.74 రేటింగ్‌ను నమోదు చేసుకోగా, అర్భన్ ప్రాంతంలో 17.72 రేటింగ్‌ను సాధించింది. ఇంటింటి గృహలక్ష్మి రూరల్ ప్రాంతంలో 12.66, అర్బన్ ప్రాంతంలో 12.62 రేటింగ్‌ను రాబట్టుకొన్నది. అలాగే గుప్పెడంత మనసు విషయానికి వస్తే.. రూరల్ ప్రాంతంలో 10.58 రేటింగ్‌ను నమోదు చేసుకోగా, అర్బన్ ప్రాంతంలో 11.22 రేటింగ్‌ను సాధించింది. జానకి కలగనలేదు రూరల్‌లో 9.05, అర్బన్‌లో 9.07 రేటింగ్, దేవతకు రూరల్‌లో 8.66, అర్బన్‌లో 8.31 రేటింగ్ లభించింది.

జీ తెలుగులో సీరియల్స్

జీ తెలుగులో సీరియల్స్

ఇక జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినయని సీరియల్ మిగితా వాటికంటే మంచి రెస్సాన్‌ను కూడగట్టుకొన్నట్టు రేటింగ్ స్పష్టం చేసింది. త్రియననికి రూరల్‌లో 7.59, అర్బన్‌లో 9.20 రేటింగ్ రావడం గమనార్హం. ఇక No.1 కోడలు సీరియల్‌కు రూరల్‌లో 6.85, అర్బన్ ప్రాంతంలో 8.34 రేటింగ్ లభించింది. అలాగే ప్రేమ ఎంత మధురం‌ రూరల్‌లో 5.92, అర్బన్‌లో 6.37 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది.

టాప్ 10 తెలుగు సీరియల్స్

టాప్ 10 తెలుగు సీరియల్స్

ఓవరాల్‌గా తెలుగు బుల్లితెరపై సీరియల్స్‌కు సంబంధించిన రేటింగ్స్ ఇలా ఉన్నాయి. ఎప్పటి మాదిరిగానే కార్తీక దీపం సీరియల్ 1వ స్థానంలో, ఇంటింటి గృహలక్ష్మి 2వ స్థానంలో నిలిచాయి,. గుప్పెండంత మనసు మూడోస్థానంలో, 4వ స్థానంలో జానకి కలగనలేదు నిలిచింది. ఐదో స్థానంలో దేవత, 6వ స్థానంలో త్రినయని, 7 స్థానంలో No.1 కోడలు, 8వ స్థానంలో ప్రేమ ఎంత మధురం, రాధమ్మ కూతురు 9వ స్థానంలో, చెల్లెలి కాపురం 10వ స్థానంలో నిలిచాయి.

టాప్ రేటింగులో కార్తీకదీపం ఎందుకంటే

టాప్ రేటింగులో కార్తీకదీపం ఎందుకంటే

ఇక డైలీ సీరియల్స్ విషయంలో తెలుగు బుల్లితెర మీద కార్తీక దీపం జోరుకు అడ్డే లేకుండా పోయింది. కంటెంట్, నటీనటుల ఫెర్పార్మెన్స్ పరంగా ఎన్నో వారాలుగా టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొంటూ ముందుకు వెళ్తున్నది. లాక్‌డౌన్స్, కర్ఫ్యూ లాంటి అంశాలు ఈ సీరియల్‌‌కు మరింత కలిసి వచ్చాయి. ముఖ్యంగా పెళ్లికాకుండా మోనిత ప్రెగ్నెంట్ కావడమనే అంశం, ఆ కారణంగా సీరియల్ మరింత భావోద్వేగంగా మారడంతో ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారనేది కాదనలేని వాస్తవంగా మారింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
జీ తెలుగు, జెమినీపై స్టార్ మా అధిపత్యం

జీ తెలుగు, జెమినీపై స్టార్ మా అధిపత్యం

బుల్లితెరపై పోటాపోటీగా నడుస్తున్న సీరియల్స్‌ విషయంలో స్టార్ మా ఛానెల్ కొన్నేళ్లుగా తన అధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. జీ తెలుగు, జెమినీ టెలివిజన్‌లో మంచి సీరియల్స్ ఉన్నప్పటికీ.. రేటింగ్‌ను భారీగా సాధించడంలో వెనుకపడుతున్నాయి. టాప్ 5 సీరియల్స్ స్టార్ మా నుంచే రావడం విశేషం. టాప్ 10లో జెమినీకి సంబంధించి ఒక్క సీరియల్ కూడా లేకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X