అమర్ దీప్ నరరూప రాక్షసుడు.. రాత్రుళ్లు నాతో అలా... టేస్టీ తేజ షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షో ఎంత సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ సీజన్ కు కామన్ మ్యాన్ విన్నర్ కావడం ఆ తర్వాత వివాదాలు తలెత్తడం ఇవన్నీ సంచలనం సృష్టించాయి. అయితే ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ ఫుడ్ వీడియోలు ఎక్కువగా చేస్తున్నాడు. తాజాగా అమర్ దీప్ తో కలిసి ఫుడ్ వ్లాగ్ వీడియో చేసాడు. అయితే ఆ వీడియోలో అమర్ దీప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ తెలుగు 7 రియాల్టీ షో.. సెప్టెంబర్ 3న ప్రారంభం అయి.. డిసెంబర్ 17న ముగిసింది. అయితే ఈ సీజన్ విన్నర్ రైతు బిడ్డ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ నిలవడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు వివాదాలు కూడా తలెత్తాయి. ఇక సీజన్ రన్నరప్ గా అమర్ దీప్ చౌదరి నిలిచాడు. హీరో శివాజీ మూడో స్థానంలో నిలిచాడు. ఇక హౌస్ నుంచి వచ్చాక ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా మారిపోయారు.

అయితే ఈ సీజన్లో తన కామెడీతో అలరించిన టేస్టీ తేజ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ వంటి కామెడీ షోలతో పాటుగా.. పుడ్ వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ హౌస్ కు వెళ్లిన తర్వాత తన కామెడీతో.. తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ఇక శోభా శెట్టితో ఫ్రెండిషిప్ చేస్తూ.. బాగానే ఎంటర్ టైన్ చేశాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. తేజ.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కలిసి ఫుడ్ వీడియోలు చేస్తూ వస్తున్నాడు.
తాజాగా టేస్టీ తేజ.. బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ తో కలిసి ఓ ఫుడ్ వీడియో చేశాడు. ఆ వీడియోలో అమర్ దీప్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ఇక వీడియో ప్రారంభంలోనే అమర్ దీప్ ను ఓ హోటల్ కు తీసుకువెళ్లిన తేజ.. అక్కడ ఏం తింటావ్ అని అడిగాడు. నేను వెజ్ బ్రో అంటూ అమర్ దీప్ చెప్పుకువచ్చాడు. నువ్వు వెజ్ ఏంటి బ్రో.. నరరూప రాక్షసుడివి.. వెజ్ తినడం ఏంటి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు తేజ.
ఇక వెజ్ తింటాను అని చెప్పిన అమర్ దీప్ లోపలికి వెళ్లి.. నాన్ వెజ్ కుమ్మేశాడు. మొదట మటన్ సూప్ తాగుతుండగా.. ఇదేం సూప్ బ్రో అని టేస్టీ తేజ అడగ్గ వెజ్ సూప్ అని అమర్ దీప్ చెప్పాడు. మేక తినేది గడ్డి.. అంటే వెజ్.. మేక వెజ్ తింటుంది కాబట్టి.. మటన్ కూడా వెజ్ అంటూ తేజ కామెడీ చేశాడు. ఇక కాసేపు అలా మాట్లాడుకున్నారు. ఇక వీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

చివరగా.. బిగ్ బాస్ హౌస్ లో నాతో అమర్ దీప్ చాలా క్లోజ్ గా ఉండే వాడు.. నన్ను రాత్రుళ్లు పట్టుకుని పడుకునేవాడు.. తేజు అనుకుని తేజతో ఉన్నట్లు అనునునే వాడేమో అంటూ కామెడీగా మాట్లాడుకున్నారు. ఇక వీరి వీడియోలోకి తేజు.. అమర్ దీప్ భార్య వచ్చి జాయిన్ అయింది. ముగ్గురు కలిసి ఫుడ్ ను ఎంజాయ్ చేశారు. అంతే కాదు ఎన్నో విషయాలు చర్చించుకున్నారు.


Click it and Unblock the Notifications











