Bigg Boss Buzzz: చచ్చేవరకు ఆ ప్రేమ పోదు.. వారే నా బలం.. అవకాశవాది కామెంట్స్‌పై తనూజ రియాక్షన్

Thanuja Buzzz Interview: బిగ్‌బాస్‌ 9లో లేడీ విన్నర్‌గా చరిత్ర సృష్టిస్తుందని భావించిన తనూజ పుట్టస్వామి హౌస్‌లో తన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించింది. ధైర్యం, పట్టుదల, ఆటతో పాటు భావోద్వేగాలన్నింటినీ సమపాళ్లలో చూపిస్తూ 105 రోజుల పాటు టాప్‌లో రాణించింది. బాండింగ్స్ పేరుతో విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రతి టాస్క్‌లో గట్టి పోటీ ఇచ్చింది.హోరాహోరీగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో పడాల పవన్ కళ్యాణ్ విజేతగా నిలవగా, అతనికి సమానంగా టఫ్ ఫైట్ ఇచ్చిన తనూజ రన్నర్‌గా నిలిచింది. తాజాగా బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన షాకింగ్ విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ తెలుగు 9 రన్నర్ అప్ తనూజ పుట్టస్వామికు సీనియర్ నటుడు శివాజీ ప్రత్యేకంగా 'ఆడపులి' అనే టైటిల్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా 'ఈ బిగ్ బాస్ జర్నీ నీకు సాటిస్ఫైడ్‌గా ఉందా?' అని శివాజీ ప్రశ్నించగా.. తనూజ కచ్చితంగా అవునని సమాధానం ఇచ్చింది. 'బిగ్ బాస్ జర్నీలో నేను నవ్వాను, ఏడ్చాను, కోపడ్డాను, ప్రేమగా ఉన్నాను. ఇది ఒక మిక్స్‌డ్ ఎమోషన్స్ జర్నీ. నన్ను నేను పూర్తిగా చూసుకున్న ప్రయాణం' అంటూ తన బిగ్ బాస్ అనుభవాలను ఓపెన్‌గా చెప్పింది.

Thanuja Buzzz Interview An Emotional Journey Powerful Statements After Bigg Boss 9

ఈ సందర్భంగా భరణిని ఒక్కోసారి 'నాన్న' అని, ఇంకోసారి 'సార్' అని ఎందుకు పిలుస్తావు? అని శివాజీ ప్రశ్నించగా.. తనూజ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. 'నేను బిగ్ బాస్‌లో అడుగు పెట్టింది గెలవడానికి, నా గేమ్ నేను ఆడడానికి. ఎదుటివారిపై నాకు ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉన్నా... గేమ్ ఆడాలంటే వాటిని పక్కన పెట్టాల్సిందే' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

తనూజపై 'అవకాశవాది' అనే అభిప్రాయం ఉందని ప్రస్తావించగా.. ఆమె భావోద్వేగంగా స్పందించింది. 'నేను అవకాశవాదిని అయితే, ఇంకొకరు బాగా ఆడాలని కోరుకునేదాన్ని కాదు. ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే, నీలో ఈ మైనస్ ఉంది అని చెప్పేదాన్ని కాదు'అంటూ తన మనసులోని మాటలను బయటపెట్టింది.

ఇక 'మా తనూజ 20 లక్షలు తీసుకుని ఉంటే బాగుండేది'అని శివాజీ అనగా.. తనూజ మరింత ఎమోషనల్ అయింది. 'నేను డబ్బు కోసం పనిచేసే అమ్మాయిని కాదు. నాకు దేవుళ్లు అంటే ఆడియన్స్. వాళ్లే నా బలం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే అది వాళ్ల వల్లే' భావోద్వేగానికి లోనైంది.

ఫినాలే రోజు అనుభవాలను గుర్తు చేసుకుంటూ..'నాగార్జున సార్ టాప్ 2 మీ ఇద్దరి చేతులు ఎత్తినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి?'అని ప్రశ్నించగా..తనూజ కళ్లలో నీళ్లు తిరిగాయి. 'టాప్ ఫైవ్‌లో ఉన్న అందరి పేరెంట్స్ వచ్చారు. నా నాన్న కూడా వస్తారని చాలా ఆశపడ్డాను. కప్ తీసుకుని ఆయన ముందు పెట్టి 'ఇది నీ కూతురు... ప్రొఫెషనల్ మారినా నీ కూతురు మారదు' అని చెప్పాలని అనుకున్నాను'అంటూ చెప్పింది.

ఇక తన పేరుపై ఉన్న అపోహలపై స్పందిస్తూ 'చాలామంది అనుకుంటారు పుట్టస్వామి నా ఇంటిపేరు అని. అది నా నాన్న పేరు. ఆయన మీద ప్రేమతోనే నా పేరులో పెట్టుకున్నాను. నేను చచ్చేవరకు ఆ ప్రేమ పోదు" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తంగా ఈ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ తనూజ ఆటతీరుతో పాటు ఆమె మనసులోని భావోద్వేగాలను కూడా బయటపెట్టింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

More from Filmibeat

Read more about: Bigg Boss Telugu 9 sivaji thanuja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X