తనూజలో కనిపించని కోణం... ఆ నటికి చెమటలు పట్టించిన బిగ్‌బాస్ బ్యూటీ

బిగ్‌బాస్ తెలుగు 9లో అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు తనూజ పుట్టస్వామి. చివరి వరకు హోరాహోరీగా సాగిన ఈ సీజన్‌లో తన అందం, వ్యక్తిత్వం, మంచితనంతో టాప్ ప్లేస్‌లో నిలిచారు. కళ్యాణ్ పడాలతో నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో తృటిలో బిగ్‌బాస్ టైటిల్ మిస్ అయినా రియల్ విన్నర్ అనిపించుకున్నారు. కన్నడ అమ్మాయే అయినా తెలుగువారి మనసుల్ని గెలుచుకున్నారు. బిగ్‌బాస్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న తనూజ పుట్టస్వామి మళ్లీ తిరిగి తన షోలలో పాల్గొంటున్నారు. తాజాగా స్టార్ మాలో ప్రసారమవుతున్న కుకు విత్ జాతిరత్నాలులో పాల్గొన్న తనూజ తన బిహేవియర్‌తో షాకిచ్చారు. బుల్లితెర నటి దీపిక రంగరాజుకు చెమటలు పట్టించారు. ఈ వివరాల్లోకి వెళితే..

స్టార్ మాలో ప్రసారమవుతున్న కుకు విత్ జాతిరత్నాలు విజయవంతంగా దూసుకెళ్తోంది. దీనికి ప్రదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. జడ్జిలుగా అరుణ ముచ్చర్ల, కమెడియన్ అలీ, నటి శ్రీదేవి విజయ్ కుమార్, స్టార్ చెఫ్ సంజయ్ తుమ్మాలు వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో రకరకాల థీమ్స్, వెరైటీ వంటకాలతో జడ్జిలు ఇస్తున్న టాస్క్‌లు.. టెస్ట్‌లో పాస్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ పడుతున్న పాట్లు, వారి అల్లరి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. తాజాగా ఈ వారానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ అల్లరిని చూస్తే..

Thanuja Puttaswamy Shocks Deepika Rangaraju in Cooku With Jathirathnalu Season 2

తొలుత ప్రోమోలో జాతిరత్నాలకు వైల్డ్ యానిమల్స్ గెటప్స్ వేసి.. మిమ్మల్ని జంతువుల నుంచి కాపాడటానికి జైలులో వేస్తున్నామని చెప్పి కుక్స్‌గా ఉన్న ఆషికా గోపాల్, పల్లవి రామిశెట్టి, తనూజ పుట్టస్వామి, రోహిణి రెడ్డి, నిఖిల్ విజయేంద్ర సింహ తదితరులను బోనులోకి పెట్టేస్తాడు యాంకర్ ప్రదీప్. కుక్స్ జైలులో నుంచే జాతిరత్నాలకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ వంట చేయించాలని జడ్జిలు టాస్క్ ఇచ్చారు. దాంతో కుక్స్ బోనులోంచే ఎలాంటి గ్రోసరీలు కావాలి? ఎలా కట్ చేయాలి? ఎలా వండాలి అనే దానిపై చెబుతుంటారు.

అయితే జాతిరత్నాలు మాత్రం ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేస్తూ కూరగాయలు కట్ చేయడం, వంట చేయడం చేస్తుంటారు. బ్రహ్మముడి ఫేమ్ దీపిక రంగరాజు కోతి గెటప్‌లో కొబ్బరి చిప్ప తింటుంది. అయితే తను చెప్పిన పని చేయకపోవడంతో తనూజ పుట్టస్వామికి కోపం నషాళానికి అంటడంతో దీపిక అంటూ ఒకే ఒక్క కేక వేస్తుంది. ఆ దెబ్బకు వణికిపోయిన దీపిక.. పరిగెత్తుకుంటూ వెళ్లి హడావుడిగా వంట మొదలుపెట్టడంతో అంతా నవ్వేస్తారు. ఆ వెంటనే ప్రదీప్ జైలు గేట్లు తీయడంతో కుక్స్ అంతా పరుగులు తీస్తారు.

ఇంతలో యాదమ్మ రాజు వచ్చి ఈ లొల్లిలో నా పెళ్లి ఏమైంది? అంటూ హడావుడి చేస్తుండగా.. ఇంకా వంట అవ్వలేదంటూ సుధీర్ పంచ్‌లు విసురుతాడు. ఆ వెంటనే ఒక అమ్మాయి కోసం మణికంఠ, యాదమ్మ రాజు, అవినాష్‌లు కొట్టుకుంటూ ఉంటారు. వంట చేయడంలో రోహిణి బిజీగా ఉండగా ప్రదీప్ వచ్చి.. మీరెంటీ సెపరేట్‌గా వండుతున్నారని అడగ్గా నాది వేరే ప్రోగ్రామ్ అని ఆన్సర్ ఇస్తుంది రోహిణి. మా కుకు విత్ జాతిరత్నాలు మరి మీది అని ప్రదీప్ అడగ్గా.. మాది కొంపలో కుంపటి అంటుంది రోహిణి. తర్వాత జైలు లోపల ఉన్న అమ్మాయికి కోతి గెటప్‌లో ఉన్న దీపిక రంగరాజు పేలు చూస్తుంది. కోతులు లోపల ఉండాలి.. మనుషులు బయట ఉండాలని ప్రదీప్ పంచ్ విసురుతాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. మరి ఈ వారం కుకు విత్ జాతిరత్నాలు విన్నర్ ఎవరు? ఎలిమినేట్ అయ్యేది ఎవరు? తెలియాలంటే మే 16, 17 తేదీలలో ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X