తనూజతో డైరెక్టర్ మిస్ బిహేవ్.. షూటింగ్ ఆపేసిన బిగ్ బాస్ బ్యూటీ!

తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన తనూజ. ఇప్పటికే సీరియల్ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న తర్వాత మరింత పాపులర్ అయ్యారు. మొదటి రోజు నుంచే తనదైన గేమ్ ప్లాన్, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, ఎమోషన్స్‌తో పాటు ధైర్యంగా మాట్లాడే స్వభావంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. చాలామంది ఆమెనే ఈసారి టైటిల్ విన్నర్ అవుతుందని భావించినా, చివరకు రన్నరప్‌గా నిలిచారు. అయితే టైటిల్ దక్కకపోయినా, ప్రేక్షకుల దృష్టిలో మాత్రం ఆమెనే 'రియల్ విన్నర్'గా నిలిచారని అభిమానులు ఇప్పటికీ చెబుతుంటారు. అయితే.. తాజా సీనియర్ నటుడు సాయి కిరణ్ (Sai Kiran) చేసిన వ్యాఖ్యలతో మరోసారి తనూజ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమైంది?

తెలుగు సినీ ప్రేక్షకులకు సాయికిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. నువ్వే కావాలి, ప్రేమించు, రావే నా చెలియా, డార్లింగ్ డార్లింగ్, మనసుంటే చాలు వంటి సినిమాల్లో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తర్వాత సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. సుడిగుండాలు, కోకిలమ్మ, అభిలాష , గుప్పెడంత మనసు, మౌనరాగం, ఇంటిగుట్టు వంటి పలు సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం కూడా సీరియల్స్, సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. అలాగే అడపాదడపా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ లైఫ్ను బిజీ బిజీగా గడుపుతున్నారు.

Thanuja Puttaswamy Viral Again After Sai Kiran Reveals Self Respect Incident on Sets

ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయికిరణ్.. తనూజ వ్యక్తిత్వం గురించి ఓ ఆసక్తికర సంఘటనను బయటపెట్టారు. "బిగ్‌బాస్ ఫినాలే వరకు వచ్చిన తనూజను తీసుకుందాం. ఒకసారి షూటింగ్‌లో ఉండగా ఓ తెలుగు సీరియల్ డైరెక్టర్ మిస్ బిహేవ్ గా చాలా రఫ్‌గా మాట్లాడాడట. 'ఏయ్ దాన్ని రమ్మనండయ్యా.. వేస్ట్‌దీ.. ఇంతసేపు ఏంటి?' అంటూ ఆమె గురించి అసభ్యకరంగా మాట్లాడాడట" అని సాయికిరణ్ వెల్లడించారు.

ఆ మాటలు విన్న వెంటనే తనూజ.. వెంటనే కోపంతో షూటింగ్ నిలిపివేసిందట. 'నన్ను దాన్ని, దీన్ని అని ఎలా పిలుస్తావ్? వేస్ట్‌ది అని ఎలా అంటావ్? మనిషికి కనీస గౌరవం ఇవ్వడం నేర్చుకో. నన్ను మేడమ్ అని పిలవమని అడగడం లేదు.. కానీ రెస్పెక్ట్ మాత్రం ఇవ్వాలి. నువ్వు ఉంటే నేను షూటింగ్ చేయను' అంటూ అక్కడికక్కడే గట్టిగా చెప్పిందట. ఈ ఘటన గురించి సాయికిరణ్ మాట్లాడుతూ..'ఆ రోజు నాకు తనూజపై చాలా గౌరవం పెరిగింది. అదే నిజమైన సెల్ఫ్ రెస్పెక్ట్. మనకు నచ్చని విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే, అదే సమయంలో నిలదీయాలి. పదేళ్ల తర్వాత అప్పట్లో నన్ను అవమానించారు అని చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. తనూజ చేసినదే సరైనది'అని అన్నారు.

అంతేకాదు, 'ఆ కారణంతోనే ఆమె బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు నేను ఓటింగ్ చేశాను' అని కూడా ఆయన చెప్పడం విశేషం. ఈ మాటలు విన్న నెటిజన్లు, అభిమానులు తనూజను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 'అమ్మాయి అంటే ఇలా ఉండాలి', 'ఆత్మాభిమానం ఉన్న మహిళ', 'దటీజ్ ఆడపులి', 'రెస్పెక్ట్ స్ట్రాంగ్ ఉమెన్' అంటూ సోషల్ మీడియాలో వీడియోలను వైరల్ చేస్తున్నారు.

మరోవైపు, ఈ ఘటన మళ్లీ మహిళల గౌరవం, షూటింగ్ సెట్స్‌లో నటీమణులు ఎదుర్కొనే పరిస్థితులపై చర్చ మొదలయ్యేలా చేసింది. ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు స్వాభిమానం కూడా ఎంత ముఖ్యమో తనూజ ఉదాహరణగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బిగ్‌బాస్ ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న తనూజ.. ఇప్పుడు తన ధైర్యసాహసాలతో మరోసారి వార్తల్లో నిలవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X