Thanuja Remuneration: ఓడినా కళ్యాణ్ కన్నా ఎక్కువ సంపాదన.. తనూజ రెమ్యునరేషన్ ఎన్ని లక్షలంటే?
Thanuja Remuneration: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారంతో అధికారికంగా ముగిసింది. 105 రోజుల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ సీజన్ చివరికి ఊహించని ఫలితంతో ఎండ్ కార్డ్ పడింది. కామనర్‌గా, మాజీ ఆర్మీ జవాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల టైటిల్ విజేతగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. మరోవైపు, సీజన్ ప్రారంభం నుంచే టైటిల్ ఫేవరేట్‌గా ప్రచారం పొందిన సీరియల్ నటి తనూజ రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, విన్నర్ ఎవరన్నదానికంటే ఎక్కువగా ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం... తనూజ గేమ్, ఆమె ఓటమికి కారణాలు, అలాగే ఆమె ఎంత సంపాదించుకుంది అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆ లెక్కలు ఏంటంటే...
టైటిల్ ఫేవరేట్‌గా బిగ్ బిగ్ హౌస్ లోకి అడుగుపెట్టింది తనూజ. బిగ్ బాస్ 9 మొదటి వారం నుంచే తనూజ ఆట ప్రత్యేకంగా కనిపించింది. టాస్కులు అయినా, నామినేషన్స్ అయినా, డిబేట్స్ అయినా ఏ సందర్భంలోనూ వెనకడుగు వేయకుండా తన అభిప్రాయాన్ని ధైర్యంగా వినిపించింది. ముఖ్యంగా మహిళా కంటెస్టెంట్‌గా ఇంట్లో స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవడం, ఎమోషనల్ కాకుండా లాజికల్‌గా మాట్లాడడం ఆమెకు పెద్ద ప్లస్‌గా మారింది. దీంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. "ఈసారి కచ్చితంగా మహిళా విన్నర్" అనే నమ్మకం కూడా ప్రేక్షకుల్లో బలంగా పాతుకుపోయింది. అయితే.. ఎవరు ఊహించిన విధంగా తనూజకు నిరాశ ఎదురైంది.

గేమ్ చివరి దశకు వచ్చేసరికి కొన్ని నెగటివ్ అంశాలు తనూజకు మైనస్ అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా భరణితో ఆమె బాండింగ్, కొన్ని సందర్భాల్లో అవసరం లేని అతి వాదనలు ఆమె ఇమేజ్‌పై ప్రభావం చూపించాయి. అంతేకాదు, కళ్యాణ్ పడాలతో క్లోజ్‌గా ఉండటం కూడా అనూహ్యంగా తనూజకే నష్టంగా మారిందని టాక్. అలాగే.. ప్రతి విషయానికి ఎమోషనల్ కావడం, చిన్న విషయానికి కూడా కన్నీరు పెట్టుకోవడం కూడా బిగ్ బాస్ ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ సందర్బాల్లో తనూజ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్‌కు సపోర్ట్ చేయడం వల్ల ఓటింగ్ స్ప్లిట్ అయ్యిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ సమయంలో కళ్యాణ్‌కు సింపుల్, డిసిప్లిన్డ్, జై జవాన్ అనే ఇమేజ్ బలంగా కలిసి వచ్చింది.
కళ్యాణ్ పడాల విషయానికి వస్తే... ఆయన ప్రయాణం నిజంగా సినిమాటిక్ అని చెప్పాలి. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్, క్రమశిక్షణ, తక్కువ మాటలు, ఎక్కువ పనితనం ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గొడవలకు దూరంగా ఉండటం, అవసరమైన చోట మాత్రమే స్పందించడం ఆయనకు పాజిటివ్ ఓటింగ్‌ను తెచ్చిపెట్టింది. చివరికి అదే టైటిల్‌గా మారింది.
ఇప్పుడు అసలు హాట్ టాపిక్... తనూజ రెమ్యూనరేషన్.. టైటిల్ తన చేతికి రాకపోయినా... సంపాదన విషయంలో మాత్రం విన్నర్ కళ్యాణ్ పడాలకే షాక్ ఇచ్చింది తనూజ. ఫేవరేట్‌గా బరిలోకి దిగి రన్నరప్‌గా నిలిచిన ఈ సీరియల్ నటి, ఓటమి వెనుక ఎంతటి నిరాశ ఉన్నా, పారితోషికం విషయంలో మాత్రం 'విన్నర్' అనే స్థాయికి చేరిందనే టాక్ నడుస్తోంది. సమాచారం ప్రకారం, తనూజకు వారానికి సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 15 వారాలు హౌస్‌లో కొనసాగిన ఆమె మొత్తం రూ.37.5 లక్షల నుంచి రూ.42 లక్షల వరకు సంపాదించినట్టు అంచనా. ఇది విన్నర్ ప్రైజ్ మనీతో పోలిస్తే పెద్ద మొత్తమే.
విన్నర్ కళ్యాణ్ పడాలకైతే ట్రోఫీతో పాటు రూ.35 లక్షల నగదు బహుమతి లభించింది. అదనంగా ఖరీదైన మారుతి సుజుకి కారు, మరో రూ.5 లక్షల గిఫ్ట్ వోచర్ కూడా అందుకున్నాడు. అలాగే వారానికి సుమారు రూ.70 వేల చొప్పున రెమ్యునరేషన్ రావడంతో మొత్తం కలిపి ఆయన సంపాదన రూ.60 నుంచి 70 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే... టైటిల్ గెలవకపోయినా తనూజ ఆర్థికంగా మాత్రం పెద్ద లాభమే పొందింది. అభిమానులు ఆమె ఓటమికి నిరాశ చెందినప్పటికీ, ఆమె సంపాదన, పెరిగిన ఫేమ్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











