జబర్దస్త్‌ వల్ల ఆ ఇబ్బందులున్నాయి, అందుకే నేను, రచ్చరవి తప్పుకున్నాం: షేకింగ్ శేషు

తెలుగు టెలివిజన్ రంగంలో అతి తక్కువ కాలంలో సూపర్ పాపులర్ అవ్వడంతో పాటు రేటింగ్స్ పరంగా టాప్ పొజిషన్లో కొనసాగుతున్న షో 'జబర్దస్త్ కామెడీ షో'. ఈ షో ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను వెలుగులోకి తెచ్చింది. ఈ షో ద్వారా పాపులర్ అవ్వడంతో పాటు సినిమా అవకాశాలు దక్కించుకుని రాణిస్తున్నవారూ ఉన్నారు. కొందరు ఇటు సినిమా, అటు జబర్దస్త్ రెండింటినీ మేనేజ్ చేస్తుండగా, మరికొందరు మాత్రం రెండు పడవలపై ప్రయాణం చేయలేక ఏదో ఒక దాని నుంచి పక్కకు తప్పుకుంటున్నారు. గతంలో ఈ షోలో టీమ్ లీడర్లుగా కొనసాగిన షేకింగ్ శేషు, రచ్చ రవి తప్పుకోవడానికి కారణం అదే.

దీనికి దానికి లంగర్ కుదరదు అంటున్న షేకింగ్ శేషు

దీనికి దానికి లంగర్ కుదరదు అంటున్న షేకింగ్ శేషు

జబర్దస్త్ కోసం మనం మూడు రోజులు డేట్స్ ఇస్తే 9 రోజులు వరకు పోతాయి. ఒక నెలలో 9 రోజులు పోయాయంటే మధ్యలో ఏదైనా సినిమా ఉండి, దానికి జబర్దస్త్ అడ్డొస్తే..... పోన్లేండి మీరు జబర్దస్త్ చేసుకోండి, మేము వేరే ఆర్టిస్టును పెట్టుకుంటాం అంటారు. ఆ వేషం పోయినట్లే. దీనికి... దానికి లంగర్ కుదరదు.

రచ్చ రవి అందుకే తప్పుకున్నాడు

రచ్చ రవి అందుకే తప్పుకున్నాడు

రచ్చ రవి అనే ఆర్టిస్ట్ బయటకు రావడానికి కూడా ఈ డేట్స్ కుదరకపోవడమే కారణం. వాడు పాపం డేట్ ఇచ్చాడు... డేట్ ఇచ్చిన తర్వాత సినిమా వచ్చింది, సార్ సినిమా వచ్చింది చేసుకుంటాను అంటే కుదరదు.. మాకు డేట్ ఇచ్చావ్ అన్నారు. వారు అభ్యంతరం చెప్పడంలోనూ కారణం ఉంది, నాగబాబు గారు, రోజాగారి కాంబినేషన్‌తో నడిచే ప్రోగ్రాం... అందుకే వారు కూడా ఈ విషయంలో స్ట్రిక్టుగా ఉంటారని షేకింగ్ శేషు తెలిపారు.

వాళ్లను వీళ్లను ఇబ్బంది పెట్టడం కంటే...

వాళ్లను వీళ్లను ఇబ్బంది పెట్టడం కంటే...

రచ్చరవి టీమ్ లీడర్, నేను టీమ్ లీడర్... అలాంటపుడు సినిమా వదులుకోక తప్పదు. వాళ్లను, వీళ్లను ఇబ్బంది పెట్టడం కంటే రెండు పడవల ప్రయాణం ఆర్టిస్ట్ చేయకపోవడమే మంచిది. ఏదో ఒకటి ఎంచుకుని అందులో కొనసాగడమే మంచిదని షేకింగ్ శేషు స్పష్టం చేశారు.

సుడిగాలి సుధీర్ టీమ్‌లో

సుడిగాలి సుధీర్ టీమ్‌లో

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి టీమ్స్‌లో ఇతర మెంబర్స్ కూడా టీమ్‌ను మేనేజ్ చేయగలరు. వారిలో ఒకరు లేకున్నా స్కిట్ నడిచిపోతుంది. టీమ్ లీడర్ అయుండి, అతడికింద ఉన్న ఆర్టిస్టులు టీమ్‌ను మేనేజ్ చేయలేనపుడు ఇబ్బంది వస్తుంది. షేకింగ్ శేషు, రచ్చరవి లాంటి వారికి కింద అలా మేనేజ్ చేసే వారు ఎవరూ లేరు, వారే టీమ్‌ను నడిపించాలి.... అందుకే ఇలాంటి మాకు ఇబ్బందిగా మారేదని తెలిపారు.

ఆ టీంలో మెయిన్ రైటర్ రాంప్రసాద్

ఆ టీంలో మెయిన్ రైటర్ రాంప్రసాద్

సుడిగాలి సుధీర్ టీమ్ ఉంది... అందులో గెటప్ శ్రీను లేకుంటే ఈ టీమే లేదు అని బయట అనుకుంటారు, కానీ అందరూ కలిసి చేస్తేనే స్కిట్టు క్లిక్ అయ్యేది. కానీ పేరు గెటప్ శ్రీనుకు ఎక్కువ వస్తుంది. ఆ టీమ్ లో మెయిన్ రైటర్ రాంప్రసాద్.... అని షేకింగ్ శేషు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X