Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లోకి వెళ్లకుండా యాక్టర్ ను అడ్డుకొంటున్న భార్య..
తెలుగు ఆడియన్స్‌కి అసలు సిసలు వినోదాన్ని అందించేందుకు బిగ్‌బాస్ 8 తెలుగు రెడీ అవుతోంది. సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారం ఈ రియాలిటీ షో గ్రాండ్‌గా మొదలుకానుంది. మరోసారి నాగార్జున తన స్టైలీష్ లుక్‌తో బిగ్‌బాస్ షోను హోస్ట్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రోమో ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. బిగ్‌బాస్ మేనియా త్వరలో ప్రారంభం కానుండగా.. దీనికి మరింత బూస్టప్ ఇచ్చేలా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కొత్త కొత్త అప్‌డేట్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు.
గత సీజన్ ఉల్టాపల్టా అంటూ మంచి టీఆర్పీలు కొట్టడంతో ఈసారి కూడా అలాంటి వినోదాన్నే అందించాలని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. కాన్సెప్ట్, టాస్క్‌లు కొత్తగా ఉంటాయని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో చర్చ జరుగుతోంది. అన్ లిమిటెడ్ ఫన్, ఫైట్ అనే కాన్సెప్ట్‌తో 8వ సీజన్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ప్రోమోలో జినీ గెటప్‌లో ఉన్న నాగార్జున .. ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు.. ఈసారి ఫన్, ట్విస్టులకు లిమటే లేదని హింట్ ఇచ్చేశారు. ఏం కోరినా లిమిట్ లేకుండా ఇస్తానంటూనే.. అడిగే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని కూడా కండీషన్ పెట్టాడు.

బిగ్‌బాస్ 8 తెలుగులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరా అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గా ఉంచారు నిర్వాహకులు. గతంలో కనీసం ఒకటి రెండు పేర్లయినా బయటికి తెలిసేవి, కానీ ఈసారి మాత్రం గుట్టుగా ఉంచుతున్నారు. యాదమ్మ రాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బర్రెలక్క, కుమారి ఆంటీ, అబ్బాస్, అంబటి రాయుడు, రాజ్ తరుణ్, సౌమ్యా రావు సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇదే ఫైనల్ లిస్ట్ చెప్పుకోవడానికి ఛాన్స్ లేకుండా పోయింది. రోజు గడిచేకొద్ది కొత్త కొత్త పేర్లు ఈ లిస్ట్‌లోకి చేరుతుండటంతో ఒక రకమైన కన్‌ఫ్యూజన్ ఏర్పడింది.
బిగ్‌బాస్ నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్స్‌ను సిద్ధం చేసేశారని, రేపో మాపో అనౌన్స్ చేస్తారని కొందరు యూట్యూబర్లు చెబుతున్నారు. ఎంపికైనప కంటెస్టెంట్స్‌ను త్వరలోనే క్వారంటైన్‌కు తరలించి, వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ టెస్టుల్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లు తేలితే .. వారి స్థానంలో వేరొకరిని కంటెస్టెంట్‌గా పంపించేందుకు రిజర్వ్ బెంచ్ కూడా సిద్ధమైనట్లుగా సోషల్ మీడియా టాక్. ఈసారి దాదాపు 20 మంది హౌస్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఎప్పటిలాగే ఈ షోకి ఒకరిద్దరు సీరియల్ నటులు కంటెస్టెంట్స్‌గా ఎంటరవుతారని అంటున్నారు. అయితే ఓ వ్యక్తిని మాత్రం అతని వైఫ్ అడ్డుకుంటోందని స్పై అక్క అనే యూట్యూబర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయనెవరో కాదు.. చక్రవారం సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్. బుల్లితెర వర్గాల్లో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకు మంచి పేరుంది. అందుకే బిగ్‌బాస్ నిర్వాహకులు ఇంద్రనీల్‌ను సంప్రదించారని.. ఇంటర్వ్యూ , సెలక్షన్ కూడా పూర్తయ్యిందని చెబుతున్నారు. కానీ అగ్రిమెంట్ చేయలేదట.. దీనికి వాళ్లవిడ మేఘనానే కారణమట.
హౌస్‌లోకి వెళ్లేటప్పుడు కంట్టెస్టెంట్స్ మంచి ఫేమ్‌తో వెళ్లి బయటకు వచ్చేటప్పుడు విపరీతమైన నెటిగిటివిటీతో వస్తారని ఆమె భయపడుతున్నారట. అందుకే ఇంద్రనీల్‌ను బిగ్‌బాస్ షోలోకి వెళ్లకుండా మేఘన అడ్డుపడుతున్నారట.. కానీ ఆయన మాత్రం హౌస్‌లో అడుగుపెట్టాలని తహతహలాడుతున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











