Bigg Boss Telugu 8 Week 1st Elimination: బిగ్‌బాస్ తెలుగు 8 నుంచి షాకింగ్ ఎలిమినేషన్.. వైల్డ్ కార్డు ఎంట్రీతో

బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ చూస్తుండగానే తొలి వీకెండ్‌కి వచ్చేసింది. హౌస్‌లోకి వెళ్లిన అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా మింగిల్ అవుతారోనని భయపడగా .. ఫస్ట్ వీక్‌లోనే జట్లుగా మారిపోయారు. బిగ్‌బాస్ చూస్తున్నవారికి వీకెండ్ రాబోతుందంటేనే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారోనన్న టెన్షన్ ఉంటుంది. కంటెస్టెంట్స్ బిహేవియర్ , ఆటతీరు నచ్చి కొందరు వారికి ఫేవరేట్‌గా మారిపోతారు. దీంతో వారు ఎక్కడ ఎలిమినేట్ అయిపోతారోనని ఆడియన్స్ భయపడిపోతుంటారు. బిగ్‌బాస్ రూల్స్‌ని అనుసరించి ఈవారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సోమవారం నామినేషన్స్ కార్యక్రమం ప్రారంభమై రెండు రోజుల పాటు జరిగింది. ఫస్ట్ డే నే కాబట్టి ఏ సాకు దొరక్కపోవడంతో గుడ్డు పేరు, వంట పేరు చెప్పి కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేశారు. ఈ సిల్లీ రీజన్స్‌కే ఇంటి సభ్యులు అరుస్తూ, కేకలు పెడుతూ గొడవ పెట్టుకున్నారు. కొట్లాటకు దిగితేనైనా రీజన్స్ పుట్టుకొస్తాయనే ఆశ కాబోలు. ఏదైతేనేం మొత్తం మీద నామినేషన్స్ పూర్తి చేశారు. బిగ్‌బాస్ తెలుగు 8 ఫస్ట్ వీక్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. వారే విష్ణుప్రియ, శేఖర్ భాషా, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వీశెట్టి.

that strong contestant likely to be eliminated in 1st week bigg boss 8 telugu here s the details

నామినేషన్స్‌లో ఉన్న వారికి ఓట్లు వేసేందుకు పలు ఫ్లాట్‌ఫామ్స్‌లో ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ లైన్స్ అందుబాటులోకి వచ్చి శుక్రవారం రాత్రికి క్లోజ్ అయ్యాయి. అయితే కేవలం రెండ్రోజుల్లో కంటెస్టెంట్స్‌ని జడ్జ్ చేయడం అంత ఆషామాషీ కాదు. కానీ తాము అనాలిసిస్ చేసినంతలో ఆడియన్స్ ఓటింగ్ ఇచ్చారు. ఇందులో విష్ణుప్రియ, శేఖర్ భాషాలకు మంచి ఓట్లు పడ్డాయట.

ఇక సెంటిమెంట్ అస్త్రం బయటకు తీసి హౌస్‌మెట్స్ చేతుల్లో టార్గెట్ అయిన నాగ మణికంఠకు జనంలో సింపతీ బాగానే వర్కవుట్ అయ్యి అతనికి కూడా ఓట్లు పడ్డాయట. పృథ్వీ, సోనియా ఆకుల చిన్న సైజు సెలబ్రెటీలు కాబట్టి వారికి ఉన్నంతలో సపోర్ట్ దొరికింది. ఎటోచ్చి బెజవాడ బేబక్క మాత్రం డేంజర్ జోన్‌లో ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మంచి మాటకారి అయిన బేబక్కపై ప్రేక్షకులు చాలా హోప్స్ పెట్టుకున్నారు, కానీ ఆవిడ నుంచి ఎలాంటి ఎంటర్‌టైన్మెంట్ రావడం లేదని డిజప్పాయింట్ అవుతున్నారు.

బిగ్‌బాస్ థీమ్ ఆమెకు అర్ధం కాక ఎలాంటి రియాక్షన్ ఇవ్వక సైలెంట్ అయిపోతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇలా జరుగుతుండటంపై బిగ్‌బాస్ టీమ్ కూడా అసహనంతో ఉందని దీని వల్ల షోకి డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు. ఈ కారణం చేత ఫస్ట్ వీక్‌కే ఆమె బిగ్‌బాస్ ప్రయాణం ఎండ్ కార్డ్ స్టేజ్‌కి చేరుకుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

బేబక్క ఎలిమినేట్ అవుతారో లేదో పక్కనపెడితే.. హౌస్‌లోకి ఓ బుల్లితెర సెలబ్రెటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ వ్యక్తి ఎవరో కాదు యాంకర్ శ్రీముఖి ఫ్రెండ్, జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్. వచ్చే వారం లేదంటే, ఆపై వీక్ ఆయన బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తారని సోషల్ మీడియాలో గాసిప్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, ఆ ప్లేస్‌లో ఎవరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారో కొద్దిగంటల్లో తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X