50 మందితో బిగ్‌బాస్‌ను మించిన షో.. ఫస్ట్ డే 5 గురు అవుట్.. తెలుగు హీరోయిన్‌కు అవకాశం!
రియాలిటీ షో అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది బిగ్‌బాస్. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఈ షో పాపులర్ మాత్రమే కాకుండా టాప్ రేటింగ్‌తో ఎన్నో ఏళ్లుగా ముందుకు సాగుతున్నది. ఇలాంటి షో ఇటీవల అన్ని భాషల్లో ఫినాలేను ముగించుకొన్నది. అయితే అలాంటి షో మాదిరిగా ఉండే షోనే ఇప్పుడు హిందీ భాషలో ప్రారంభమైంది. ఈ షో పేరు The 50. ప్రారంభానికి ముందే ఓ రకమైన సెన్సేషనల్ న్యూస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ షో ప్రారంభం ఎప్పుడు? ఎవరు హోస్ట్? కంటెస్టెంట్లు ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తరహాలో ఉండే ఈ షోలో యూట్యూబ్, సోషల్ మీడియా, సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన 50 మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొంటారు. అయితే ఇప్పటికే సెలబ్రిటీలు జనవరి 25వ తేదీన ఇంటిలోకి వెళ్లారు. గత ఐదు రోజులకుపైగా ఇంటిలో వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ షోను జియో హాట్ స్టార్ ఓటీటీలో, అలాగే కలర్ ప్లస్ ఛానెల్‌లో ప్రసారం చేయనున్నారు.

హిందీ టెలివిజన్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసిన ఈ షోలో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నిక్కీ తంబోలి పాల్గొంటున్నారు. ఆమె చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇంకా బిగ్‌బాస్ హిందీ షోలో కూడా పాల్గొనడం ద్వారా పాపులారిటీ సాధించింది. ప్రస్తుతం ది 50 షోలో కూడా అవకాశం రావడంతో పాల్గొన్నారు.
నార్త్ ఆడియెన్స్‌కు పరిచయమైన రిధిమా పండిత, దిగ్విజయ్ రాఠీ, రజత్ దలాల్, సింగర్ కాకా, డినో జేమ్స్, సిద్దార్థ్ భరద్వాజ్, అరుషీ చావాల్, ఆర్య, అద్నాన్ షేక్, దివ్య అగర్వాల్, మోనాలిసా, ఊర్వశీ దకోలియా, చాహత్ పాండే, నీలమ్ గిరి, టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్ లాంటి సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. ఈ షో సుమారుగా 50 రోజులపాటు కొనసాగుతుంది.
ఈ షో ప్రారంభం కాకముందే కంటెస్టెంట్ల ఎలిమినేషన్ ప్రక్రియ హాట్ టాపిక్‌గా మారింది. తొలి రోజే ఐదుగురు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి షోపై ఆసక్తిని రేపారు. తాజా సమాచారం ప్రకారం.. దుష్యంత్ కుక్రేజా, వన్‌షాజ్ సింగ్, నేహల్ చుడాస్మా, లవ్ కేష్ కటారియా, బేబికా ధుర్వే ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారనే వార్త బయటకు వచ్చింది. దాంతో ఈ గేమ్ ఫార్మాట్ ఏమై ఉంటుందనే విషయంపై నెటిజన్లు, ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాలీవుడ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ షోలో కెప్టెన్లుగా వ్యవహరించడానికి 10 మంది సెలబ్రిటీలను ఎంపిక చేశారు. ఈ షో కోసం ముంబైలోని మద్ ఐలాండ్‌లో భారీ సెట్ వేశారు. ఈ షోలో విజేతగా నిలిచిన వారికి 50 లక్షల రూపాయల బహుమానాన్ని అందజేస్తారు.


Click it and Unblock the Notifications











