Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమెజాన్‌పై విరుచుకుపడ్డ తమిళ్ రాకర్స్.. ఆన్లైన్లో ’ఫ్యామిలీ మ్యాన్‘ లీక్, ఫ్రీ డౌన్లోడ్
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో వినోదానికి పెద్ద ఎత్తున్న ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ఓవర్ ది టాప్ (ఓటీటీ) మీడియా సేవలకు అత్యంత ప్రేక్షకాదరణ లభించింది. ఇంటర్నెట్ ఆధారిత ఆన్లైన్ స్ట్రీమింగ్ మీడియాలో వినోదం పాళ్లు పెరగడంతో ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. దీంతో ఓటీటీ మీడియా సేవలు సినిమా పరిశ్రమకు ధీటుగా, కీలకంగా మారాయి. అయితే ఇలాంటి పరిస్థితిని గ్రహించిన ఓటీటీపై తమిళ్ రాకర్స్ విరుచుకుపడుతున్నారు. తాజాగా పలు వెబ్ సిరీస్‌లను పైరసీ గురి చేసి ఆన్లైన్ స్ట్రీమింగ్ మీడియాకు కూడా సవాల్ విసిరుతున్నది. వివరాల్లోకి వెళితే..
ది ఫ్యామిలీ మ్యాన్‌కు విశేష ఆదరణ
ఇటీవల ఒరిజినల్ వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే.. ది ఫ్యామిలీ మ్యాన్ యాక్షన్ డ్రామాకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలోని స్పెషల్ సెల్లో పనిచేసే ఓ మధ్య తరగతి ఉద్యోగిగా మనోజ్ బాజ్‌పేయ్ నటించారు. చాలీ చాలని జీతంతో ఇబ్బంది పడుతూనే అత్యంత ఒత్తిడితో కూడిన ఉద్యోగంలో ఉంటూ టెర్రరిస్టుల నుంచి దేశాన్ని ఎలా కాపాడరనేది ఈ సిరీస్ కథ.
తమిళ్ రాకర్స్ బెడద
లాక్‌డౌన్‌కు ముందు ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజైన ది ఫ్యామిలీ మ్యాన్‌కు కూడా తమిళ్ రాకర్స్ బెడద తప్పలేదు. రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే జంట దర్శకులు రూపొందించిన ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్‌లో మంచి ప్రేక్షకాదరణ దక్కింది. మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి నటించిన ఈ ఈ వెబ్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పూర్తి ఎపిసోడ్స్‌ను తమిళ్ రాకర్స్ పైరసీ చేసింది.
వెబ్ సిరీస్ లీక్ చేసి.. ఫ్రీ డౌన్లోడ్
ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ను లీక్ చేసి హెచ్డీ క్వాలిటీని నెటిజన్లకు అందుబాటులోకి తెచ్చింది. సైబర్ సెక్యూరిటీని ఛేదించుకొని ఇలాంటి నాణ్యమైన చిత్రాలను లీక్ చేయడంతో నిర్మాత, దర్శకులుకు తమిళ్ రాకర్స్ కొత్త సవాల్ విసిరింది. పూర్తి స్థాయిలో ది ఫ్యామిలీ మ్యాన్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇలా ఎన్ని రకాలు ప్రయత్నించినా.. ప్రతీసారి కొత్త డొమైన్లలో సినిమాను లీక్ చేస్తుండటంతో తలలు పట్టుకోవాల్సి వస్తుంది.
Recommended Video
వెబ్ సిరీస్, సినిమాలపై రాకర్స్ పంజా
ఇంతకు ముందు మిసెస్ సీరియల్ కిల్లర్, అంగ్రేజీ మీడియం, ఎక్స్ట్రాక్షన్, పంగా, చపాక్, గుడ్ న్యూస్, టెర్మినేటర్: డార్క్ ఫేట్ చిత్రాలను తమిళ రాకర్స్ లీక్ చేసింది. గతంలో విశాల్ లాంటి హీరోలు తమ వంతుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. పైరసీకి పాల్పడుతున్న వారిని సైబర్ పోలీసులకు పట్టించినా.. తమిళ్ రాకర్స్ ఆగడాలకు అడ్డుకట్టవేయలేకపోయారు.