Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్.. ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విపరీతంగా ఆకట్టుకుంటుంది. దానికి కారణం ఈ వారం ఫ్యామిలీ వీక్ పెట్టడం. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగియగానే... బిగ్ బాస్ సెంటిమెంట్ ప్లాన్ అమలు చేశాడు. ఇక హౌసులోకి ఒక్క కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ ను పంపించి.. అటు కంటెస్టెంట్స్ ను.. ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ను ఏడిపించేస్తున్నాడు. అయితే ఈ ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్.. ఓ కంటెస్టెంట్ పై పడింది. దీంతో ఆమె ఈ వారం ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతోంది. ఇక పది వారాలు పూర్తి చేసుకోబోతున్న ఈ షోలో ప్రస్తుతం ఫ్యామిలీవీక్ నడుస్తోంది. ప్రస్తుతం హౌసులో శివాజీ, యావర్, ప్రశాంత్, బోలే, అశ్విని, అర్జున్, శోభా శెట్టి, గౌతమ్, ప్రియాంక, అమర్ దీప్, రతికా రోజ్ ఉన్నారు. మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఇప్పటికే నామినేషన్స్ పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్స్ లో శివాజీ, గౌతమ్, ప్రశాంత్, బోలే షవాలి, రతికా రోజ్ ఉన్నారు.

అయితే ఈ వారం బిగ్ బాస్ సెంటిమెంట్ ప్లాన్ అమలు చేశాడు. ఒక్కో కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ ను హౌజ్ లోకి పంపించి.. తెగ ఎమోషనల్ చేసేస్తున్నాడు. దీంతో చూసే ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అయిపోతున్నారు. అయితే ఈ ఫ్యామిలీ వీక్ పేరు మీద ఓ కంటెస్టెంట్ కు భారీ దెబ్బ పడిందని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు రతికా రోజ్. పదో వారంలో మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. రెండో రోజు నుంచే కంటెస్టెంట్లకు సర్ ప్రైజ్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే.
మొదటి రోజే శివాజీ కుమారుడు హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ రోజే అర్జున్ భార్య, అశ్విని తల్లిని పంపి ఎమోషనల్ చేసేశాడు బిగ్ బాస్. ఇక నామినేషన్ లో ఉన్న శివాజీ ఓట్లు అమాంతం పెరిగిపోయాయి. పాజిటివిటీ వచ్చేసింది. ఇక ఆ తర్వాత రెండో రోజు గౌతమ్ తల్లి, ప్రియాంక ప్రియుడు శివ కుమార్, భోలే భార్యను హౌస్ లో పంపి కంటెస్టెంట్స్ ను ఏడిపించాడు బిగ్ బాస్. నామినేషన్స్ లో ఉన్న గౌతమ్కు ఈ ఎపిసోడ్ కలిసి వచ్చింది.

ఇక బోలే షవాలి ఫ్యామిలీ ఎమోషన్ ఆడియెన్స్ కు అంతగా కనెక్ట్ కాలేక పోయింది. బోలే భార్య హౌసులోకి వచ్చాక.. బోలే షవాలి కాస్ ఎమోషనల్ అయిపోయాడు. ఇక కలిపి ముద్దలు కూడా పెట్టింది. అయితే ఉన్న టైమ్ ను బోలేకు బయట ఏం జరిగిందో చెప్పాలి కానీ... బిగ్ బాస్ హౌస్ చూస్తూ ఇద్దరు గడిపేశారు. ఇక బోలేకు ఎలా ఆడాలో చెప్పాల్సిందిపోయి.. ఏమి చెప్పకుండా వెళ్లిపోయిందనే కామెంట్స్ వినిపించాయి..
మూడో రోజు అమర్ భార్య, శోభాశెట్టి తల్లి, యావర్ బ్రదర్ వచ్చి కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ గుండెల్ని పిండేశాడు బిగ్ బాస్. ముఖ్యంగా ప్రిన్స్ యావర్, తన బ్రదర్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు. మొత్తానికి ఈ వారంలో టాస్కులు, గేమ్స్ లేకుండా పూర్తిగా ఫ్యామిలీ వీక్ గా మార్చేశాడ బిగ్ బాస్. ఇక ప్రిన్స్ కు అప్పటి వరకు ఓటింగ్ లాస్ట్ ఉండే.. కానీ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ తో.. మళ్లీ టాప్ లోకి వచ్చేశాడు.
ఇక హౌసులో మిగిలింది ఇద్దరు.. ఒకరు రతికా రోజ్.. మరొకరు రైతు బిడ్డ. వీరిద్దరికి సంబంధించి శుక్రవారం అంటే నేడు సర్ ప్రైజ్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అయితే రతికా రోజ్ ఫ్యామిలీ వచ్చి.. ఎమోషన్ వర్కౌట్ అయ్యే సరికి ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. దీంతో రతికా రోజ్ గతవారమే తృటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. రతికా కుటుంబ సభ్యులు ఇంకా హౌస్ లోకి రాలేదు.. దీంతో రతికాకు ఓటింగ్ కూడా తక్కువ ఉంది. ఈసారి ఆమె ఎమలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











