Bigg Boss Telugu7 లో పవర్ అస్త్ర.... కంటెస్టెంట్లకు షాకిచ్చిన నాగార్జున.. అది సాధిస్తేనే అంటూ..
'బిగ్ బాస్' తెలుగు సీజన్ - 7 అట్టహాసంగా ప్రారంభం అయింది. గత సీజన్స్ కంటే... ఈ సారి ఊహకు అందకుండా ఉల్టా పుల్టా ఉంటుందని మొదటి నుంచి చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ చెప్పినట్లుగానే... ఈసారి అంతా రివర్స్ లో ఉంటుందని అర్ధం అవుతుంది. తార్ మార్ తక్కెెడ మార్ సాంగ్ తో నాగార్జున మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజనంతా మీరు ఊహకు అందని విధంగా.. ఉల్లాఫుల్టాగా సాగుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఈసారి బిగ్ బాస్ లో పవర్ అస్త్ర అని తీసుకువచ్చారు. అదేంటో తెలుసుకుందాం.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఘనంగా ప్రారంభం అయింది. ఇక చిరంజీవి తార్ మార్ తక్కెడ మార్ సాంగ్ తో నాగార్జున మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి కంటెస్టెంట్ గా జానకీ కలగనలేదు ఫేం ప్రియాంక జైన్ ఎంటర్ అవ్వగా.. ఆమెకు పవర్ అస్త్ర గురించి నాగ్ చెప్పుకొచ్చారు.

అయితే ఈ సీజన్ లో ఏ కంటెస్టెంట్ కన్ఫార్మ్ కాదని చెప్పి నాగార్జున షాక్ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ హౌజ్ మేట్ కావాలంటే... అందరూ పవర్ అస్త్ర అర్హత సాధించారు. అయితే ఎలా సాధించాలి.. ఏంటి అనేది రివిల్ చేయలేదు. అది సాధించనంత వరకు బిగ్ బాస్ హౌజ్ మేట్ అర్హత సాధించలేరని చెప్పారు. అప్పటివరకు జస్ట్ కంటెస్టెంట్ గానే ఉంటారని తెలిపారు నాగ్.
ఇక దీన్ని బట్టి చూస్తే... ఇది నిజంగానే కొత్తగానే ఉల్టా పుల్టాగానే ఉంటుందని అర్ధం అవుతుంది. ప్రతి సీజన్లో కంటెస్టెంట్లు కూర్చుంచునేందుకు ఇచ్చే సోఫా, ఛైర్లు కూడా ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో ఇవ్వలేదు. అవి కూడా గేమ్స్ ఆడి గెలుచుకోవాలని షాక్ ఇచ్చారు నాగార్జున.
ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో మూడు బెడ్ రూమ్స్ ఉన్నాయి. అందులో వీఐపీ బెడ్ రూమ్స్, డీలక్స్ బెడ్ రూమ్స్, స్టాండర్డ్ బెడ్ రూమ్స్ గా బెడ్ రూమ్స్ ను వర్గీకరించారు. మరి ఇవి కూడా కంటెస్టెంట్స్ ఆడి గెలుచుకోవాలని కావొచ్చు. మొత్తంగా ఈ సీజన్ మొత్తం కొత్తగా ఉండబోతుందని అర్దం అవుతుంది.
బిగ్ బాస్ 7లో కొత్త ప్రయోగం ప్రవేశ పెట్టారు.. ఈ రియాలిటీ షోలో హాలోగ్రామ్ ద్వారా నాగార్జున నేరుగా హౌస్ లోకి వెళ్లిన ఫీలింగ్ కల్పించారు. ఇదిలా ఉంటే ఈ పవర్ అస్త్ర సాధిస్తేనే హోజ్ మేట్ అర్హత, దానితో స్పెషల్ పవర్స్ వస్తాయట. మరి ఎవరు సాధిస్తారో చూడాలి ఇక.


Click it and Unblock the Notifications











