టాప్ కమెడియన్ ఆత్మాహత్యాయత్నం.. భార్య వదిలేసి మరొకరితో.. ఆర్థిక సమస్యలతో

ఉత్తరాది జాతీయ ఛానెల్‌లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కామెడీ షో ది కపిల్ శర్మ షో. కపిల్ శర్మ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షో ద్వారా ఎంతో మంది స్టాండప్ కమెడియన్స్, కామెడియన్లు కెరీర్‌పరంగా బాగా ఎదగడమే కాకుండా మంచి పాపులారిటీ సంపాదించుకొన్నారు. అలాంటి కమెడియన్లలో ఒకరైన తీర్థానంద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. తీర్థనాథ్ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడు? ఆ కారణాలు ఏమిటి? ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏమిటనే విషయంలోకి వెళితే..

 నానా పాటేకర్ లుక్‌తో

నానా పాటేకర్ లుక్‌తో

కమెడియన్ తీర్థానంద్ చూస్తే ప్రముఖ నటుడు నానా పాటేకర్‌ను పోలీ ఉంటాడు. దాంతో ఆయన టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపు పొందారు అయితే కొద్దికాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఆపై ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా వదిలేసి వెళ్లిపోయారు అని సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.

ఆర్థిక సమస్యలతో చితికిపోయి

ఆర్థిక సమస్యలతో చితికిపోయి

తీర్థనాథ్ వ్యక్తిగత జీవితంలోనే కాదు.. కుటుంబపరమైన జీవితంలో కూడా అనేక సమస్యలతో చితికిపోయాడు. ఆర్థికంగా చితికిపోయిన తీర్థనాథ్‌ను భార్య వదిలేసి మరోకరిని వివాహం చేసుకొన్నది. ఒక్కగానొక్క కూతురు వివాహం చేసుకొని అత్తారింటికి వెళ్లిపోయింది. దాంతో తీర్థనాథ్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నా కుటుంబం పట్టించుకోవడం లేదు

నా కుటుంబం పట్టించుకోవడం లేదు

తీర్థానంద్ ఉండే అపార్ట్‌మెంట్‌లోనే తన కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ వారు ఆయనతో మాట్లాడరు. అనారోగ్యంతో బాధపడుతుంటే.. పట్టించుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా సహకరించలేదు. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆ పరిస్థితుల్లో నాలుగు రోజులు హాస్పిటల్‌లో ఉండి ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటి నుంచి చాలా విషాదంలో మునిగిపోయాడు. దాంతో ఆత్మహత్యాయత్నం చేశారు.

 ఇరుగు పొరుగు వారు స్పందించడంతో

ఇరుగు పొరుగు వారు స్పందించడంతో

తీర్థానంద్ వ్యవహారం, ఆయన కదలికలు, అనుమానం రావడంతో ఇరుగుపొరుగువాళ్లు ఆయన దృష్టిపెట్టారు. అయితే ఆత్మహత్యాయత్నం చేయడంతో సకాలంలో వాళ్లు స్పందించారు. వెంటనే ఆయనను హస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాలకు ముప్పు తప్పింది అని ఇరుగుపొరుగు వాళ్లు తెలిపారు.

Recommended Video

Actor Nani About His Learning Experience As Assistant Director | Filmibeat Telugu
డబ్బులేక పోవడంతో

డబ్బులేక పోవడంతో

తన పరిస్థితిపై తీర్థానంద్ మాట్లాడుతూ.. నేను ఫ్యామిలీ పరంగా, వర్క్ పరంగా నలిగిపోయాను. 15 ఏళ్లుగా యాక్టింగ్ చే్తున్నాను. కానీ నేను డబ్బు, హోదా, గౌరవం లాంటి అన్ని రకాల సౌకర్యాలను అనుభవించాను. ప్రస్తుతం నా పరిస్థితి దారుణంగా ఉంది. నేను నటించిన సినిమా ఇటీవల రిలీజైంది. నా నటనకు మంచి ప్రశంసలు లభించాయి. కానీ డబ్బు రాలేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. ఇంకా పారితోషికం అందలేదు అని మీడియాకు తీర్థానంద్ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X