For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కపిల్ కామెడీ షో టీఆర్పీ రేటింగ్ ఢమాల్... ఆ కమెడియన్ లేకపోవడమే కారణమా?

|

పున:ప్రారంభం అయిన తర్వాత కపిల్ శర్మ కామెడీ షో హిందీ టెలివిజన్ రంగంలో మంచి రేటింగ్స్ సాధిస్తూ అగ్రస్థానంలో దూసుకెళుతోంది. అయితే గత రెండు మూడు వారాలుగా ఈ షో టీఆర్పీ రేటింగ్స్ క్రమక్రమంగా పడిపోయాయి. రెండు అంశాలు ఈ షోపై బాగా ప్రభావం చూపినట్లు చర్చించుకుంటున్నారు.

పుల్వామా ఉగ్రదాడి విషయంలో నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ వివాదాస్పద కామెంట్స్ చేయడంతో ఆ ప్రభావం షోపై పడకుండా అతడిని తాత్కాలికంగా పక్కనపెట్టారు. దీంతో పాటు షోలో భాగంగా ఉన్న మరొక కమెడియన్ చందన్ ప్రభాకర్ రెండు వారాలుగా కనిపించక పోవడం... ఈ షోపై తీవ్ర ప్రభావం చూపింది.

నాకు ఆ పని చేయడం రాదు, ఇంట్లో మనుషులను పెట్టుకున్నాం: నమ్రత

దారుణంగా పడిపోయిన టీఆర్పీ రేటింగ్స్

దారుణంగా పడిపోయిన టీఆర్పీ రేటింగ్స్

9వ వారంలో కపిల్ శర్మ కామెడీ షో రేటింగ్ దారుణంగా పడిపోయాయి. ఈ రెండు కారణాలు.. ముఖ్యంగా చందన్ ప్రభాకర్ షోలో లేకపోవడం ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు. రేటింగ్స్ చార్టులో ఈ షో 2వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయింది.

నెం.1 రోహిత్ శెట్టి షో..

నెం.1 రోహిత్ శెట్టి షో..

కలర్స్ ఛానల్‌లో రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ‘ఖత్రోంకి ఖిలాడి-జిగ్గర్ పె ట్రిగ్గర్' టీఆర్పీ రేటింగ్స్ 9వ వారంలో స్టడీగా కొనసాగింది. ఈ షో 3.1 రేటింగ్ సాధిస్తూ మొదటి స్థానంలో కొనసాగుతోంది.

సూపర్ డాన్సర్

సూపర్ డాన్సర్

శిల్పా శెట్టి, అనురాగ్ బసు, గీతా కపూర్ సోనీ టీవీలో హోస్ట్ చేస్తున్న కిడ్స్ డాన్స్ రియాల్టీ షో ‘సూపర్ డాన్సర్ చాప్టర్ 3'... 2.6 రేటింగుతో రెండో స్థానంలోకి ఎగబాకింది. కలర్స్ ఛానల్‌లో ప్రసారం అవుతున్న ‘నాగిని 3' 2.5 రేటింగుతో మూడో స్థానంలో ఉంది.

దారుణంగా పడిపోయిన కపిల్ శర్మ రేటింగ్

దారుణంగా పడిపోయిన కపిల్ శర్మ రేటింగ్

‘కపిల్ శర్మ కామెడీ షో' మొన్నటి వరకు మొదటి, రెండో స్థానాల్లో కొనసాగుతూ వచ్చింది. అయితే 9వ వారంలో కేవలం 2.4 రేటింగుతో 4వ స్థానంలోకి పడిపోవడంతో ఈ షోకు ఆదరణ తగ్గిందనే వాదన తెరపైకి వచ్చింది.

English summary
Chandan Prabhakar's absence, The Kapil Sharma Show has been entertaining its viewers with its hilarious and spontaneous gimmicks. But unfortunately, the Kapil Sharma comedy show has slipped two places drastically in its week 9 TRP chart.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more